హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance Brands Limited: బెలెన్సియాగాతో రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ డీల్

Reliance Brands Limited: బెలెన్సియాగాతో రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ డీల్

Reliance Brands Limited: బెలెన్సియాగాతో రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ డీల్

Reliance Brands Limited: బెలెన్సియాగాతో రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ డీల్

Reliance Brands Limited | ఫ్యాషన్ బ్రాండ్‌తో బెలెన్సియాగాతో (Balenciaga) రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (RBL) ఒప్పందం కుదుర్చుకుంది. విస్తరిస్తున్న డిజిటల్ రంగం, మెటీరియల్ డెవలప్‌మెంట్‌లు, నేటి సామాజిక బాధ్యతలతో బెలెన్సియాగాను ఆధునికతలో అగ్రగామిగా నిలిపాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada | Visakhapatnam | Tirupati | Hyderabad

గ్లోబల్ లగ్జరీ బ్రాండ్ అయిన బెలెన్సియాగాతో (Balenciaga) రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (RBL) వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో అత్యుత్తమ గ్లోబల్ కోచర్‌ను భారత మార్కెట్‌కు తీసుకురానుంది. ఈ దీర్ఘకాలిక ఫ్రాంచైజ్ ఒప్పందంతో దేశంలో బ్రాండ్‌ను ప్రారంభించేందుకు బెలెన్సియాగాకు ఏకైక భారతదేశ భాగస్వామిగా RBL ఉంటుంది. ఇప్పటికే రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ బెలెన్సియాగా పేరెంట్ కంపెని కెరింగ్‌తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.

1917లో స్పానిష్‌లో జన్మించిన క్రిస్టోబల్ బెలెన్సియాగాను స్థాపించారు. ఆ తర్వాత 1937లో పారిస్‌లో అడుగుపెట్టింది ఈ బ్రాండ్. బెలెన్సియాగా అనేక ఆవిష్కరణలతో ఆకృతి, సాంకేతికతతో ఆధునిక కోచర్‌కు వేదికగా ఉంటోంది. 2015లో డెమ్నా ఆర్టిస్టిక్ డైరెక్టర్‌గా నియమితులైనప్పటి నుంచి బెలెన్సియాగా విజన్‌కు అనుగుణంగా బౌండరీ పుషింగ్ కలెక్షన్, మహిళలు, పురుషులకు దుస్తులు, ఉపకరణాలు, ఆబ్జెట్స్ డి ఆర్ట్‌లతో విస్తరించింది.

Balenciaga, Balenciaga fashion brand, Reliance Brands Limited, Reliance fashion brand, Reliance fashion business, Reliance Retail Ventures Ltd, బెలెన్సియాగా, రిలయన్స్ ఫ్యాషన్ బిజినెస్, రిలయన్స్ ఫ్యాషన్ బ్రాండ్స్, రిలయన్స్ బ్యాండ్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్

కొన్ని బ్రాండ్‌లు నిజానికి బెలెన్సియాగా లాగా సృజనాత్మక పునర్విమర్శ, పునర్నిర్మాణం కోసం అవకాశాన్ని స్వీకరించాయి. వారి అవాంట్-గార్డ్, తెలిbwv క్రియేషన్స్, లోగో, ఫ్యాషన్ పరిశ్రమలో తత్ఫలితంగా ఉన్న ఆరాధన ప్రపంచవ్యాప్తంగా బలమైన పునాదిని సృష్టించాయి. భారతీయ లగ్జరీ కస్టమర్ పరిపక్వత చెంది, ఫ్యాషన్‌ను వారి వ్యక్తిత్వానికి ఉపయోగిస్తున్నందున దేశానికి బ్రాండ్‌ను పరిచయం చేయడానికి ఇది అత్యంత సరైన సమయం.

దర్శన్ మెహ్తా, ఎండీ, రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్

విస్తరిస్తున్న డిజిటల్ రంగం, మెటీరియల్ డెవలప్‌మెంట్‌లు, నేటి సామాజిక బాధ్యతలతో బెలెన్సియాగాను ఆధునికతలో అగ్రగామిగా నిలిపాయి.

Balenciaga, Balenciaga fashion brand, Reliance Brands Limited, Reliance fashion brand, Reliance fashion business, Reliance Retail Ventures Ltd, బెలెన్సియాగా, రిలయన్స్ ఫ్యాషన్ బిజినెస్, రిలయన్స్ ఫ్యాషన్ బ్రాండ్స్, రిలయన్స్ బ్యాండ్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్

ఇక RBL రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో గ్లోబల్ బ్రాండ్‌లను ప్రారంభించడం, నిర్మించడం అనే లక్ష్యంతో 2007లో సంస్థ కార్యకలాపాలను ప్రారంభించింది. గత ఐదేళ్లలో RBL స్వదేశీ ఇండియన్ డిజైనర్ బ్రాండ్‌లను నిర్మించడంలో, నిర్వహించడంలో పెట్టుబడి పెట్టింది. బ్రాండ్ పార్ట్నర్స్ పోర్ట్‌ఫోలియోలో అర్మానీ ఎక్స్ఛేంజ్, బ్యాలీ, బొట్టెగా వెనెటా, బ్రూక్స్ బ్రదర్స్, బర్బెర్రీ, కెనాలి, క్లార్క్స్, కోచ్, డీజిల్, డ్యూన్, EA7, ఎంపోరియో అర్మానీ, ఎర్మెనెగిల్డో జెగ్నా, జి-స్టార్ రా, గాస్, జార్జియో అర్మానీ, హ్యామ్లేస్, హ్యూగో బాస్, హంకెమోలర్, ఐకానిక్స్, జిమ్మీ చూ, కేట్ స్పేడ్ న్యూయార్క్, లెన్స్‌క్రాఫ్టర్స్, మనీష్ మల్హోత్రా, మైఖేల్ కోర్స్, మదర్‌కేర్, ముజీ, పాల్ & షార్క్, పాల్ స్మిత్, పాటరీ బార్న్, పాటరీ బార్న్ కిడ్స్, రాఘవేంద్ర రాథోర్, రీప్లే, సాల్వటోర్ ఫెర్రాగామో, సత్య పాల్, స్టీవ్ మాడెన్, సూపర్‌డ్రీ, సన్‌గ్లాస్ హట్, స్కాచ్ & సోడా, టిఫనీ & కో, టాడ్స్, టోరీ బర్చ్, టుమీ, వెర్సేస్, విల్లెరోయ్ & బోచ్, విజన్ ఎక్స్‌ప్రెస్ అండ్ వెస్ట్ ఎల్మ్ వంటి సంస్థలు ఉన్నాయి. భారతదేశంలో 821 స్టోర్స్, 1,263 షాప్ ఇన్ షాప్స్ ఉన్నాయి. 2019లో బ్రిటీష్ టాయ్ రిటైలర్ హామ్లీస్‌ను కొనుగోలు చేయడం ద్వారా RBL తన మొదటి అంతర్జాతీయ భాగస్వామ్య గుర్తింపును తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలలో హామ్లీస్ 211 కేంద్రాల్లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.

First published:

Tags: Reliance, Reliance retail

ఉత్తమ కథలు