One year FD rates: ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ఏడాది కాలపరిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లలో మదుపు చేయడం ఉత్తమం. వడ్డీరేట్లు తక్కువగా ఉన్నప్పటికీ.. ఒక ఏడాదిలో ఇవి అధిక రాబడిని అందిస్తాయి.

  • Share this:
మీ సంపాదనలో కొంతమేర పొదుపు చేసుకుని వివిధ రకాల పెట్టుబడి మార్గాల్లో మదుపు చేస్తుండొచ్చు. అయితే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం. అందుకని అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లిక్విడ్ అసెట్స్‌లో పెట్టుబడి పెడితే మంచిది. ఇందుకోసం ఏడాది కాలపరిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లలో మదుపు చేయడం ఉత్తమం. వడ్డీరేట్లు తక్కువగా ఉన్నప్పటికీ.. ఒక ఏడాదిలో ఇవి అధిక రాబడిని అందిస్తాయి. రిస్క్ చేయడానికి ఇష్టపడని వారికి.. భద్రతతో పాటు, రాబడి భరోసా ఉంటుంది. అయితే మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి ముందు రిస్క్ అసెస్మెంట్, బ్యాంకు గురించి పూర్తి శ్రద్ధ వహించాలి. మంచి నెట్‌వర్క్ ఉండి, ఎక్కువ వడ్డీ రేట్లు అందించే సంస్థలను డిపాజిటర్లు ఎంచుకోవాలి.
New Rules From August 1: అందరికీ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి నాలుగు కొత్త రూల్స్.. అవేంటో తెలుసుకోండి

ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు..
ఒక ఏడాది మెచూరిటీ ఉండే ఎఫ్‌డీలపై RBL బ్యాంకు 6.10 శాతం వడ్డీనిస్తుంది. లక్ష రూపాయలు మదుపు చేస్తే, ఏడాది తర్వాత డిపాజిటర్లు రూ.106,241 రాబడి పొందుతారు. ఇండస్ ఇండ్ బ్యాంక్ 6.00 శాతం వడ్డీనిస్తుంది. ఇందులో లక్ష రూపాయలు మదుపు చేస్తే ఏడాదికి రూ.106,136 రాబడిగా పొందుతారు. యస్ బ్యాంక్ 6.00 శాతం వడ్డీని అందిస్తుంది. ఇందులో రాబడిగా రూ.106,136 అందుకుంటారు. డీసీబీ బ్యాంక్ 5.80 శాతం వడ్డీ ఇస్తుంది. రాబడిగా ఏడాదికి రూ.105,937 పొందుతారు.
బంధన్ బ్యాంక్ 5.50 శాతం వడ్డీ ఇస్తుంది. రాబడిగా ఏడాదికి రూ.105,614లు పొందుతారు.

విదేశీ బ్యాంకులు..
స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 5.30 శాతం వడ్డీని ఇస్తుంది. లక్ష రూపాయలు మదుపు చేస్తే రాబడిగా ఏడాదికి రూ.105,406 పొందవచ్చు. డీబీఎస్ బ్యాంక్ 4.25 శాతం వడ్డీ ఇస్తుండగా.. రాబడిగా రూ.104,318 పొందుతారు. డూష్ బ్యాంక్ 3.85 శాతం వడ్డీ ఇస్తుండగా.. ఏడాది తర్వాత రాబడిగా రూ.103,906 అందుకుంటారు. HSBC బ్యాంక్ 3.10 శాతం వడ్డీ ఇస్తుండగా.. మెచూరిటీ తరువాత రూ.103,136 పొందుతారు. సిటీ బ్యాంక్ 2.75 శాతం వడ్డీ ఇస్తుండగా.. ఏడాది తర్వాత రూ.102,778 అందుతుంది.

చిన్న ప్రైవేటు బ్యాంకుల్లో అధిక వడ్డీ రేట్లు..
చిన్న ప్రైవేటు బ్యాంకులు ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.1 శాతం వడ్డీ రేట్లు అందిస్తున్నాయని బ్యాంక్ బజార్ డేటా తెలిపింది. ఆర్బీఎల్ బ్యాంక్ 6.10 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 6 శాతం వడ్డీరేట్లు ఇస్తున్నాయి. విదేశీ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చే వాటితో పోలిస్తే ఈ వడ్డీ రేట్లు చాలా ఎక్కువ. ప్రముఖ ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు.. ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీనిస్తున్నాయి.

అగ్ర ప్రైవేటు బ్యాంకులైన ICIC, HDFC ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.90 శాతం వడ్డీనిస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్ ఆఫర్లు 5.10 శాతం వడ్డీని ఇస్తుండగా.. కోటక్ మహేంద్ర బ్యాంక్ 4.50 శాతం అందిస్తుంది. అన్నిటికంటే తక్కువగా IDFC బ్యాంక్ 4.25 శాతం ఇస్తుంది. ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కెనరా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికంగా 5.20 శాతం వడ్డీని ఇస్తున్నాయి. ఎస్బీఐ అయితే 5 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 4.90 శాతం వడ్డీ రేట్లు ఇస్తున్నాయి.

ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) ద్వారా రూ.5 లక్షల వరకు ఎఫ్‌డీలకు ఇన్సూరెన్స్ హామీ ఉంటుంది. కనీస పెట్టుబడి మొత్తం బ్యాంకుల మధ్య మారుతూ ఉంటుంది. ప్రైవేటు బ్యాంకుల్లో 100 నుంచి 10,000 వరకు ఉంటుంది. విదేశీ బ్యాంకులైతే 1000 నుంచి 20,000 వరకు ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published: