హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Scheme: కొత్త స్కీమ్ తెచ్చిన బ్యాంక్.. కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

Bank Scheme: కొత్త స్కీమ్ తెచ్చిన బ్యాంక్.. కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

Bank Scheme: కొత్త స్కీమ్ తీసుకువచ్చిన బ్యాంక్.. కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

Bank Scheme: కొత్త స్కీమ్ తీసుకువచ్చిన బ్యాంక్.. కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

Bank News | బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు. బ్యాంక్ తాజాగా కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. దీంతో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

FD Rates | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఆర్‌బీఎల్ బ్యాంక్ గుడ్ న్యూస్ అందించింది. కొత్త స్కీమ్‌ను తీసుకువచ్చింది. దీని పేరు స్మార్ట్ డిపాజిట్ స్కీమ్. ఇది ఫ్లెక్సిబుల్ టర్మ్ డిపాజిట్ (Fixed Deposit) పథకం. దీని ద్వారా కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది. రెగ్యులర్ మంత్లీ సేవింగ్స్, టాప్ అప్ ఇన్వెస్ట్‌మెంట్ (Investment) వంటి బెనిఫిట్స్ పొందొచ్చు. ఇంకా ఇందులో చేరడం వల్ల అధిక వడ్డీ రేటు కూడా లభిస్తుంది.

ఆర్‌బీఎల్ బ్యాంక్ స్మార్ట్ డిపాజిట్ స్కీమ్‌లో చేరాలంటే కనీసం రూ. 1000 నుంచి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్‌గా ప్రతి నెలా ఈ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా డిపాజిట్ చేయొచ్చు. ఇలా రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. రెగ్యులర్ సేవింగ్స్‌కు, టాప్ అప్ అమౌంట్‌కు ఒకే రకమైన వడ్డీ లభిస్తుంది.

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వచ్చే నెలలో బ్యాంకులకు 10 రోజులు సెలవులు!

వడ్డీ రేట్ల విషయానికి వస్తే.. 15 నెలల టెన్యూర్‌లోని డిపాజిట్లపై వడ్డీ రేటు 7.55 శాతంగా ఉంది. రెగ్యులర్ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంటుంది. ఇక సూపర్ సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీ రేటు 8.3 శాతంగా ఉంది. టాప్ అప్‌ను రూ. 50 నుంచి కూడా ప్రారంభించొచ్చు. గరిష్టంగా 60 నెలల వరకు టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు. అలాగే కనీసం 6 నెలల టెన్యూర్ ఉంటుంది.

ఫ్లైట్ టికెట్లపై భారీ తగ్గింపు.. రూ.1126కే విమానం ఎక్కేయండి!

మీకు ఎఫ్‌డీ ఆరంభంలో ఎంత వడ్డీ రేటు ఉందో.. మెచ్యూరిటీ వరకు అదే వడ్డీ రేటు వర్తిస్తుంది. వడ్డీ రేటులో ఎలాంటి మార్పు ఉండదు. ఇకపోతే టెన్యూర్‌ కన్నా ముందే డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే 1 శాతం పెనాల్టీ పడుతుంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే ఎలాంటి పెనాల్టీ ఉండదు. ఇకపోతే ఆర్‌బీఎల్ బ్యాంక్ ఇటీవలనే సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును భారీగా పెంచేసిన విషయం తెలిసిందే. వడ్డీ రేటు 125 బేసిస్ పాయింట్ల వరకు పైకి చేరింది. జనవరి 25 నుంచి అంటే ఈ రోజు నుంచే ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి. ఇప్పుడు ఆర్‌బీఎల్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై గరిష్టంగా 6.5 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. కాగా ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో చాలా బ్యాంకులు ఇప్పటికే ఎప్‌డీ రేట్లు పెంచేశాయి. అలాగే సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను సవరించాయి. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.

First published:

Tags: Bank, FD rates, Fixed deposits, Rbl