Good News: ఎన్నికల ముందు మరో వరం... వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ...

RBI Repo Rate cut | గతేడాది జూన్ నుంచి వరుసగా రెపో రేట్లు పెంచుతూ వచ్చింది ఆర్‌బీఐ. అక్టోబర్‌లో మాత్రం తటస్థంగానే ఉంది. ఈసారి ఆర్‌బీఐ రెపో రేట్లు పెంచొచ్చని అందరూ అనుకుంటూ ఉండగా ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: February 7, 2019, 3:24 PM IST
Good News: ఎన్నికల ముందు మరో వరం... వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ...
నమూనా చిత్రం (REUTERS/Francis Mascarenhas/File Photo)
news18-telugu
Updated: February 7, 2019, 3:24 PM IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రెపో రేట్‌ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో గతంలో 6.50 ఉన్న రెపో రేట్ 6.25 శాతానికి చేరింది. ఆర్‌బీఐ రెపో రేట్ తగ్గిస్తుందా లేదా అని చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు మార్కెట్ నిపుణులు. గతంలో 25 బేసిస్ పాయింట్లు రెపో రేట్ పెంచిన ఆర్‌బీఐ... ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం మార్కెట్ వర్గాలకు శుభవార్తే. గతేడాది జూన్ నుంచి వరుసగా రెపో రేట్లు పెంచుతూ వచ్చింది ఆర్‌బీఐ. అక్టోబర్‌లో మాత్రం తటస్థంగానే ఉంది. ఈసారి ఆర్‌బీఐ రెపో రేట్లు పెంచొచ్చని అందరూ అనుకుంటూ ఉండగా ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడు రెపో రేట్లు తగ్గించడం సామాన్యులకు వడ్డీ భారాన్ని ఎంతో కొంత తగ్గిస్తుంది. సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆర్‌బీఐ రెపో రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. రివర్స్ రెపో రేట్‌ని కూడా 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్‌బీఐ.

Photos: భారత ప్రభుత్వం ఖజానా నింపుతున్న చారిత్రక కట్టడాలు ఇవే...




ఇవి కూడా చదవండి:

SBI Prize: ఎస్‌బీఐ నుంచి రూ.5 లక్షల ప్రైజ్ మనీ... పోటీ ఇదే
Loading....
మీకు LIC నుంచి SMS వచ్చిందా? రాకపోతే ఇలా చేయండి...

Xiaomi Discount: షావోమీ ఫోన్లపై భారీ డిస్కౌంట్... 3 రోజులు మాత్రమే
First published: February 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు