సాధారణంగా మన క్రెడిట్, డెబిట్ కార్డుల నంబర్లు మనలో చాలామందికి గుర్తుండవు. వాటి పిన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడమే మనలో చాలామందికి పెద్ద పని అని చెప్పుకోవచ్చు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. దీని ప్రకారం మన క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించిన సమాచారాన్ని గుర్తు ఉంచుకోవాల్సి వస్తుందట. ఎందుకంటే ఆర్బీఐ విడుదల చేసిన కొత్త గైడ్ లైన్స్ ప్రకారం పేమెంట్ గేట్ వే సంస్థలు అయిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్, నెట్ ఫ్లిక్స్ వంటివి కస్టమర్ల కార్డుల వివరాలను వారి సర్వర్లలో సేవ్ చేసుకోవడానికి వీలు ఉండదట. కస్టమర్లు, ఈ సంస్థల మధ్య బ్యాంకులు చాలా ముఖ్యమైన వారధిగా పనిచేస్తాయి.అంటే దీని ప్రకారం మీరు ఈ సంస్థల్లో కొనుగోలు చేసిన ప్రతిసారి మీ 16 అంకెల కార్డు నంబర్, సీవీవీ, కార్డు వివరాలన్నీ అందించాల్సి ఉంటుంది. ఇది కొనుగోలుదారుల సౌకర్యాన్ని కొద్దిగా తగ్గిస్తుంది. కానీ కార్డు సమాచారాన్ని సెక్యూర్డ్ గా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆర్బీఐ వెల్లడిస్తోంది.
ఎందుకు గుర్తుంచుకోవాలంటే..
జనవరి 2022 తర్వాత ప్రతి సారి పదహారు అంకెల కార్డు నంబర్, ఎక్స్ పైరీ డేట్, సీవీవీ నంబర్ వంటివన్నీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ తరహా పేమెంట్ ఎక్కడ చేసినా అది వర్తిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉన్నవారికి.. సబ్ స్క్రిప్షన్స్ ఎక్కువగా ఉన్నవారికి ఇది కాస్త ఇబ్బంది కలిగించే విషయమే కానీ డేటా సెక్యూరిటీ కోసం ఇలా చేయడం తప్పదని ఆర్బీఐ చెబుతోంది.చాలామంది సెక్యూరిటీ పరంగా సులభంగా ఉండడంతో పాటు ప్రతి సారీ ట్రాన్సాక్షన్ సమయంలో అన్ని వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉండదు కాబట్టి యూపీఐ ట్రాన్సాక్షన్లను దీనికోసం ఉపయోగించడం సహజంగా మారిపోతుంది. అందుకే ఇవి పాపులర్ గా మారుతున్నాయి. వీటి వల్ల ప్రయోజనం వేగంగా ట్రాన్సాక్షన్ పూర్తవడంతో పాటు అన్ని ప్లాట్ ఫాంలలోనూ సులభంగా పేమెంట్ చేయగలగడం అని చెప్పవచ్చు.
సాధారణంగా ఈ–కామర్స్ ప్లాట్ ఫాంలు మనం వాటిలో సెర్చ్ చేసిన, కొన్న డేటాను ఉపయోగించి కస్టమర్ డెమోగ్రాఫిక్స్ ని బట్టి వారికి తగినట్లుగా స్పెషల్ డీల్స్, ఆఫర్లు పంపుతుంటారు. అయితే సమాచారాన్ని స్టోర్ చేయడానికి వీలు కాదు కాబట్టి ఇకపై ఇలాంటి డీల్స్ రావని చెప్పవచ్చు. కొత్త రూల్స్ ఇంకా ఎలా ఉంటాయన్న దానిపై పూర్తిగా అవగాహన లేకపోయినా వెరిఫికేషన్, సెక్యూరిటీ వంటివి ప్రధానంగా ఉంటాయని మాత్రం తెలుస్తోంది. జులై నుంచే దీన్ని ప్రారంభించాలని ఆర్బీఐ భావించినా బ్యాంకులు దీనికి సిద్ధంగా లేకపోవడం వల్ల కాస్త వాయిదా వేసింది. ఈ మార్పు వల్ల కార్డ్ ఆపరేటర్స్ తో పాటు ఎవరూ మీ కార్డుకు సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేయలేరు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Credit cards