Home /News /business /

RBI TO ROLL OUT DIGITAL CURRENCY BY 2023 SAYS FINANCE MINISTER NIRMALA SITHARAMAN KNOW HOW DIGITAL RUPEE WORKS SS

RBI Digital Currency: వచ్చే ఏడాదిలోగా డిజిటల్ కరెన్సీ తీసుకొస్తాం: నిర్మలా సీతారామన్

Digital Currency: వచ్చే ఏడాదిలోగా డిజిటల్ కరెన్సీ తీసుకొస్తాం: నిర్మలా సీతారామన్
(ప్రతీకాత్మక చిత్రం)

Digital Currency: వచ్చే ఏడాదిలోగా డిజిటల్ కరెన్సీ తీసుకొస్తాం: నిర్మలా సీతారామన్ (ప్రతీకాత్మక చిత్రం)

RBI Digital Currency | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ కరెన్సీ 2023 లోగా వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రకటించారు. డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నందున డిజిటల్ రుపీ తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ కసరత్తు చేస్తోంది.

ఇంకా చదవండి ...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ కరెన్సీ తీసుకొస్తున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 లోగా భారతదేశంలో డిజిటల్ కరెన్సీని (Digital Currency) తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. కాలిఫోర్నియాలో ఫిక్కీ, USISPF నిర్వహించిన ఈవెంట్‌లో ఆమె ఈ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ వాణిజ్య వినియోగ ప్రయోజనాలను పరిశీలిస్తున్నాయని, జన్ ధన్, ఆధార్, మొబైల్ ద్వారా ఇది సాధ్యం అవుతుందని ఆమె అన్నారు. అన్ని పరిశ్రమలలో డిజిటల్ పద్ధతులు పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC), డిజిటల్ బ్యాంకులు, డిజిటల్ యూనివర్సిటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుంది. డిజిటల్ కరెన్సీ మరింత సమర్థవంతమైనది. కరెన్సీ నిర్వహణ వ్యవస్థకు చౌకగా మారుస్తుంది. బ్లాక్‌చెయిన్, ఇతర సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ రుపీ ప్రవేశపెట్టాలని ప్రతిపాదించాం. 2022-23లో ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీని తీసుకొస్తుంది.
నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి



రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రుపీ బ్లాక్‌చెయిన్ రూపొందిస్తుంది. దీని ద్వారా అన్ని లావాదేవీల జాడ తెలుసుకోవడం సులువు. ప్రైవేట్ కంపెనీలు అందించే ప్రస్తుత మొబైల్ వాలెట్ సిస్టమ్‌లా కాకుండా ఇది భిన్నంగా ఉంటుంది. ఇక వర్చువల్ కరెన్సీ నియంత్రణపై భారతదేశం సరైన నిర్ణయం తీసుకుంటుందని నిర్మాలా సీతారమన్ గతలో తెలిపారు. క్రిప్టోపై నిర్ణయం హడావుడిగా ఉండదన్నారు.

డిజిటల్ కరెన్సీ అంటే ఏంటీ?


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీపై ప్రకటన చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ రుపీ తీసుకొస్తామన్నారు. ఆర్‌బీఐ తీసుకొచ్చే డిజిటల్ కరెన్సీ సాధారణ కరెన్సీలాగా చెల్లింపులకు ఉపయోగించవచ్చు. ఇది భారతదేశానికి చెందిన అధికార కరెన్సీగా చలామణి అవుతుంది. ఎవరు ఎప్పుడు డిజిటల్ కరెన్సీని ఎక్కడ చెల్లించారు? ఆ కరెన్సీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది? అన్న వివరాలన్నీ ఉంటాయి.

నోట్ల రద్దు, కరోనా వైరస్ మహమ్మారి తర్వాత భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఫిజికల్ కరెన్సీ అంటే పేపర్ కరెన్సీ వినియోగం తగ్గిపోతున్నందున డిజిటల్ కరెన్సీ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేట్ వర్చువల్ కరెన్సీ పెరుగుతున్నందున ప్రజల అవసరాలు తీర్చేందుకు ఆర్‌బీఐ అధికారికంగా డిజిటల్ రుపీని అందుబాటులోకి తీసుకురానుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Currency, Digital currency, Nirmala sitharaman, Rbi, Reserve Bank of India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు