హోమ్ /వార్తలు /బిజినెస్ /

Loan Charges: లోన్ తీసుకున్న వారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. కొత్త రూల్స్!

Loan Charges: లోన్ తీసుకున్న వారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. కొత్త రూల్స్!

Loan Charges: లోన్ తీసుకున్న వారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. కొత్త రూల్స్!

Loan Charges: లోన్ తీసుకున్న వారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. కొత్త రూల్స్!

Penal Interest | మీరు లోన్ తీసుకున్నారా? అయితే గుడ్ న్యూస్. ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. పీనల్ చార్జీలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు తీసుకువస్తామని వెల్లడించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Penal Charges | రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI - ఆర్‌బీఐ) తీపికబురు అందించింది. రుణ గ్రహీతలకు ఊరట కలిగే ప్రకటన చేసింది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు జారీ చేసే రుణాలకు సంబంధించిన పీనల్ చార్జీలకు కొత్త మార్గదర్శకాలు తీసుకువస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది. పీనల్ చార్జీల్లో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీని వల్ల లోన్ (Loan) తీసుకున్న వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం పీనల్ చార్జీలు అనేవి ఒక్కో బ్యాంక్‌కు ఒక్కోలా ఉంటాయి. అంటే బ్యాంక్ తనకు నచ్చిన విధంగా పాలసీ విధానాలకు అనుగుణంగా పీనల్ చార్జీలను వసూలు చేస్తోంది. ఇలా అన్ని బ్యాంకులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలు కూడా ఇలానే పీనల్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ పాలసీ ప్రకారం చార్జీలను వసూలు చేస్తున్నాయి. వీటికి మార్గదర్శకాలు అంటూ ఏమీ లేవు. వాటి ఇష్టం. అందుకే ఆర్‌బీఐ పీనల్ చార్జీలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు తెస్తామని ప్రకటించింది.

బ్యాంక్ కస్టమర్లకు అదిరే శుభవార్త.. ఆర్‌బీఐ కీలక ప్రకటన, కొత్త సర్వీసులు!

చెక్ బౌన్స్ అయినప్పుడు, ప్రిపేమెంట్, చెల్లింపులు ఆలస్యం అయినప్పుడు, ఈఎంఐ మిస్ అయినప్పుడు బ్యాంకులు ఈ చార్జీలను వసూలు చేస్తుంటాయి. వీటినే పీనల్ చార్జీలుగా చెప్పుకుంటారు. ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. ఆటో లోన్స్‌కు సంబంధించి ప్రీపేమెంట్ చార్జీలు ఒక శాతంగా ఉన్నాయి. దీనికి జీఎస్‌టీ అదనం. లోన్ జారీ అయ్యి రెండేళ్ల గడువక ముందే చెల్లించే ప్రిపెయిడ్ అమౌంట్‌కు ఇది వర్తిస్తుంది.

పాత స్కూటర్ ఇచ్చి కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనండిలా!

కొన్ని సందర్భాల్లో పీనల్ చార్జీలు అనేవి అధికంగా ఉన్నాయని, అందుకే పారదర్శకత తీసుకురావడం కోసం కొత్త మార్గదర్శకాలు తీసుకువస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. దీని వల్ల రుణ గ్రహీతలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. కాగా మరోవైపు ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకంది. కీలక రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. పావు శాతం మేర రెపో రేటు పెరిగింది. దీని వల్ల రెపో రేటు 6.5 శాతానికి చేరింది.

ఆర్‌బీఐ రెపో రేటు పెంపు వల్ల బ్యాంక్ కస్టమర్లకు రెండు రకాలుగా ప్రభావం పడనుంది. రుణ రేట్లు పెరుగుతాయి. దీని వల్ల లోన్ తీసుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అదేవిధంగా డిపాజిట్ రేట్లు పెరుగుతాయి. దీని వల్ల బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆర్‌బీఐ క్యూఆర్ కోడ్ బేస్డ్ కాయిన్ వెండింగ్ మెషీన్లను తీసువస్తున్నట్లు ప్రకటించింది. తొలిగా 12 పట్టణాల్లో వీటిని అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.

First published:

Tags: Banks, Car loans, Home loan, Personal Loan, Rbi, Reserve Bank of India

ఉత్తమ కథలు