హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Bonds: డిసెంబర్ 19 నుంచి చౌక ధరకే బంగారం.. కేంద్రం బంపరాఫర్!

Gold Bonds: డిసెంబర్ 19 నుంచి చౌక ధరకే బంగారం.. కేంద్రం బంపరాఫర్!

Gold Bonds: డిసెంబర్ 19 నుంచి చౌక ధరకే బంగారం.. కేంద్రం బంపరాఫర్!

Gold Bonds: డిసెంబర్ 19 నుంచి చౌక ధరకే బంగారం.. కేంద్రం బంపరాఫర్!

Sovereign Gold Bonds | కేంద్ర ప్రభుత్వం మళ్లీ గోల్డ్ బాండ్ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకువచ్చింది. సోమవారం నుంచి వీటి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం అవుతుంది. గ్రాము ధర మార్కెట్ రేటు కన్నా తక్కువే ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Gold Bond Scheme | కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. మరోసారి అదిరే ఆఫర్ అందుబాటులో ఉంచింది. గోల్డ్ బాండ్ (Gold Bond) సబ్‌స్క్రిప్షన్‌ను మళ్లీ తీసుకువచ్చింది. దీంతో బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. మార్కెట్ రేటు కన్నా తక్కువకే గోల్డ్ (Gold) బాండ్లను కొనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్‌లోనే కొంటే మరింత తగ్గింపు లభిస్తుంది. అందువల్ల గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.

కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 19 నుంచి గోల్డ్ బాండ్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభిస్తోంది. ఈ ఏడాదిలో ఇదే చివరి విడత గోల్డ్ బాండ్లు అని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 23 వరకు గోల్డ్ బాండ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. బంగారు బాండ్లు కొనుగోలు చేసిన వారికి డిసెంబర్ 27 నుంచి బాండ్లను జారీ చేస్తారు. గ్రాము ధర రూ. 5409గా ఉంది. ఆన్‌లైన్‌లో కొంటే గ్రాముకు రూ. 5359 రేటు పడుతుంది. ఇది మార్కెట్ రేటు కన్నా తక్కువనే చెప్పుకోవాలి.

క్రెడిట్ కార్డు వాడే వారికి బంపరాఫర్.. రూ.5 వేలు డిస్కౌంట్!

ఔత్సాహికులు దగ్గరిలోని బ్యాంక్‌కు లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి గోల్డ్ బాండ్లను కొనొచ్చు. అలాగే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఆఫీసుల్లో కూడా గోల్డ్ బాండ్లు అందుబాటులో ఉంటాయి. లేదంటే ఆన్‌లైన్‌లో సులభంగానే గోల్డ్ బాండ్లను కొనొచ్చు. గ్రాముకు రూ. 50 తగ్గింపు వస్తుంది. ప్రస్తుతం ఇంకా గోల్డ్ బాండ్ రేటును కేంద్రం నిర్ణయించలేదు. ఒక్క గ్రాము దగ్గరి నుంచి బంగారం కొనొచ్చు. గరిష్టంగా 4 కేజీల వరు గోల్డ్ బాండ్లను కొనొచ్చు. అదే ట్రస్ట్‌లు అయితే 20 కేజీల వరకు గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. ఒక ఆర్థిక సంవత్సానికి ఇది వర్తిస్తుంది.

అదిరిపోయే శుభవార్త.. 2 బ్యాంకుల కీలక నిర్ణయం, కస్టమర్లకు ఇకపై..

తదుపరి విడత గోల్డ్ బాండ్లు 2023 మార్చి 6 నుంచి 10 వరకు ఉంటుంది. వీటి జారీ మార్చి 14 నుంచి ఉంటుంది. గోల్డ్ బాండ్లపై ఏడాదికి 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఫిజికల్ గోల్డ్ ఎలా అయితే కొంటారో.. ఈ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయడానికి కూడా ఒకే విధమైన కేవైసీ రూల్స్ వర్తిస్తాయి. గోల్డ్ బాండ్లపై ట్యాక్స్ పడుతుంది. మీ ట్యాక్స్ స్లాబ్‌కు అనుగుణంగా పన్ను చెల్లించుకోవాల్సి వస్తుంది. కాగా ప్రస్తుతం దేశంలో బంగారం ధరలను గమనిస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 55 వేలకు పైనే ఉంది. అంటే ఈ రేటుతో పోలిస్తే.. గోల్డ్ బాండ్ల రేటు తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు.

First published:

Tags: Gold, Gold jewellery, Gold price, Gold rate, Sovereign Gold Bond Scheme

ఉత్తమ కథలు