RBI MPC: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐ (RBI) ఇటీవలే రివర్స్ రెపో రేటు పెంచింది. ద్రవ్యోల్బణం తగ్గే సంకేతాలు లేకపోవడంతో మరోసారి రెపోరేటు పెరిగే అవకాశాలున్నాయని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఈఎంఐ (EMI) లు భారంగా మారనున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టకపోవడంతో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశం ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ భేటీ ఈ నెల 6,7,8 తేదీల్లో జరగనుంది. జూన్ 6,7,8 తేదీల్లో జరగబోయే MPC(monetary policy meet) భేటీలో ద్రవ్యోల్బణం, రెపోరేటు చర్చకు రానుంది. ఈ కమిటీ తన నిర్ణయాన్ని ఈ నెల 8న ప్రకటించనుంది. రెపోరేట్లలో కొంత పెరుగుదలైతే ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ దాస్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో రెపోరేటు ఈసారి 30-35 బేసిస్ పాయింట్ల వరకూ పెంచే అవకాశాలున్నాయని సమాచారం. గత నెలలోనే ఆర్బీఐ రెపోపేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది.
ఈ ఏడాది ద్రవ్యోల్బణం 6 శాతానికి పైగా నమోదైంది. ఏప్రిల్ నెలలో అయితే 8 ఏళ్ల గరిష్టస్థాయి.7.79కు చేరుకుంది. అటు దేశీయ వ్యాపారపు ద్రవ్యోల్బణమైతే ఏడాదికి పైగా 15.08గా నమోదవుతోంది. పెరుగుతున్న ఇంధన ధరల్ని నియంత్రించేందుకు కేంద్రం ఇటీవలే పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించిన విషయం తెలిసిందే.
Inflation: కొత్త ఇల్లు కొనాలనుకునే వారిపై ద్రవ్యోల్బణం ప్రభావం.. దీని నుంచి బయటపడే మార్గాలు ఇవే..
రెపో రేటు అంటే ఏమిటి?
సాధారణంగా ప్రజలు తమ వద్ద సరిపడా డబ్బు లేనప్పుడు ఏదో ఒకటి తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటారు. ఈ రుణంపై వడ్డీ కడతారు. అయితే బ్యాంకుల వద్ద కూడా ఒక్కోసారి నిధుల కొరత ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఈ బ్యాంకులు ఆర్థిక సహాయం కోసం సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐను ఆశ్రయిస్తాయి. ఈ కమర్షియల్ బ్యాంకులు సెక్యూరిటీలు లేదా బాండ్లను విక్రయించడం ద్వారా ఆర్బీఐ నుంచి నగదును తీసుకుంటాయి. ఈ నగదుపై ఆర్బీఐ విధించే వడ్డీ రేటును "రెపో రేటు (Repo Rate)" అంటారు.
ALSO READ Breakup Revange : ప్రియుడు సైకోయిజం..మాజీ ప్రేయసి మొఖంపై తన పేరు టాటూగా వేశాడు!
రివర్స్ రెపో రేటు అంటే ఏంటి?
సాధారణంగా ప్రజల వద్ద అన్ని ఖర్చులు పోను అదనపు డబ్బులు మిగిలినప్పుడు వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటారు. వీటిపై వడ్డీని బ్యాంకులు ప్రజలకు చెల్లిస్తాయి. అయితే కమర్షియల్ బ్యాంకుల్లో కూడా అవసరానికి మించిన నగదు ఉంటుంది. ఈ నగదును బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తాయి. ఈ డబ్బుపై బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించే వడ్డీని "రివర్స్ రెపో రేటు (Reverse Repo Rate)" అంటారు.
రివర్స్ రెపో రేటు కంటే రెపో రేటు ఎందుకు ఎక్కువగా ఉంటుంది?
అన్ని బ్యాంకుల మాదిరిగానే ఆర్బీఐ ప్రాఫిట్ ఆశిస్తుంది. అందుకే ఇది కమర్షియల్ బ్యాంకులు ఇచ్చే రుణాలపై ఎక్కువ వడ్డీ రేటు వసూలు చేస్తూ.. కమర్షియల్ బ్యాంకుల నుంచి తీసుకునే డిపాజిట్లపై తక్కువ వడ్డీ రేటు చెల్లిస్తుంది. సరళంగా చెప్పాలంటే, కమర్షియల్ బ్యాంకుల నుంచి వసూలు చేసే వడ్డీ అదే బ్యాంకులకు చెల్లించే వడ్డీ కంటే ఎక్కువగా ఉంటుంది.
రెపో, రివర్స్ రెపో రేట్లు ఎందుకు కీలకం?
ఆర్బీఐ రెపో, రివర్స్ రెపో రేట్లను బ్యాంకింగ్ రంగం అంతటా అందించే వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించడానికి, పెంచడానికి ఉపయోగిస్తుంది. దీని వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. రెపో రేటు తగ్గించడం ద్వారా ఇది ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇది వ్యాపార రుణాలు, కారు రుణాలు, గృహ రుణాలు మొదలైన వాటిపై వడ్డీ రేటును తగ్గిస్తుంది. ఇది ప్రజలను డబ్బు ఖర్చు చేయమని ప్రోత్సహిస్తుంది. అయితే దీనికి విరుద్ధంగా డబ్బు ఖర్చు చేయకుండా సేవ్ చేసుకోమని ప్రోత్సహించడానికి రివర్స్ రెపో రేట్ ని ఆర్బీఐ తగ్గిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rbi, Rbi governor, Repo rate