డబ్బుల్లేని ATMపై ఫైన్... ఆర్బీఐ కొత్త నిర్ణయం
ATM : డబ్బు ఉండే ఏటీఎంల కోసం కిలోమీటర్లు వెళ్లాల్సిన పని తప్పేలా రిజర్వ్‌బ్యాంక్ తీసుకున్న నిర్ణయం బ్యాంకుల కస్టమర్లకు మేలు చేయబోతోంది.

ఏటీఎం (File)
- News18 Telugu
- Last Updated: June 15, 2019, 7:57 AM IST
బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు చెల్లించేటప్పుడు ఒక్క రోజు ఆలస్యమైనా బ్యాంకులు ఊరుకుంటాయా... వడ్డీ వడ్డించేస్తాయి. మరి అలాంటప్పుడు మనకు ఇవ్వాల్సిన సర్వీసులు కూడా అదే విధంగా ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎంలకు వెళ్లినప్పుడు అవి పని చెయ్యట్లేదనో, డబ్బులు లేవనో వాటి ముందు బోర్డులు వేలాడదీస్తుంటారు. ఫలితంగా ఇబ్బంది పడుతున్నది మనమే కదా. దీనిపై బ్యాంకులు ఎందుకు సమాధానం చెప్పవన్నది తేలాల్సిన ప్రశ్న. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ డిసైడైంది. ఇకపై ATMల ముందు గంటల తరబడి నో క్యాష్ బోర్డ్ వేలాడదీస్తే కుదరదు. 3 గంటలకు మించి ఆ బోర్డ్ ఉంటే, ఆ ఏటీఎం కేంద్రంపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది. జరిమానా వేసి... బ్యాంకుకి పంపిస్తుంది.
ఈ ఫైన్ అన్ని ఏటీఎంలకూ ఒకే విధంగా ఉండదు. ఏటీఎం ఉన్న ప్రదేశం, దానికి ఉన్న డిమాండ్, వచ్చే కస్టమర్లు అన్నింటినీ లెక్కలోకి తీసుకొని ఫైన్ వేసి... ఆ నోటీస్‌ను బ్యాంక్ శాఖకు పంపిస్తుంది ఆర్బీఐ. దేశంలో రోజూ కొన్ని లక్షల ఏటీఎంలు ఇలాగే పనిచెయ్యకుండా, డబ్బులు లేకుండా ఉన్నాయి. వాటి వల్ల కొన్ని కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమందైతే ఏటీఎంలలో డబ్బుల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. ఆర్బీఐ నిర్ణయం మనకు కలిసొచ్చే అంశమే. ఇలాంటి ఫైన్లు వేస్తేనే బ్యాంకులు జాగ్రత్త పడి... ఏటీఎంలలో ఎప్పటికప్పుడు క్యాష్ ఫిలప్ చేస్తాయని భావించవచ్చు.
ఇవి కూడా చదవండి :
టీడీపీలో మొదలైన సెగలు... చంద్రబాబుపై తమ్ముళ్ల మాటల మంటలు...
ఏపీలో కొత్త మద్యం పాలసీ... 10 శాతం వైన్ షాపులు ఔట్...
నేడు నీతి ఆయోగ్ సమావేశం... చర్చించే కీలక అంశాలు ఇవీ...Gyro Drop : అది ఫేక్ వీడియో... భలే నమ్మిస్తున్నారుగా...
రోజా పూలతో చక్కటి ఆరోగ్యం... ఇవీ ప్రయోజనాలు...

ATM: గుడ్ న్యూస్... ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా
SBI: ఏటీఎం పనిచేయట్లేదా? కిరాణా షాప్‌లో డబ్బులు తీసుకోవచ్చు ఇలా
SBI ATM: ఛార్జీలు పడకుండా ఏటీఎంలో ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయండి ఇలా
SBI ATM: ఎస్బీఐ ఏటీఎంలలో ఇక ఆ నోట్లు రావు... కారణం ఇదే
మీ ATM కార్డు మీ దగ్గరే ఉంటే... దొంగలు ఎలా మీ డబ్బు దోచేస్తున్నారు? తెలుసుకోండి
ATMలలో ఈ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలుండవ్... అవేంటో తెలుసా..?