Central Bank of India | బ్యాంకుల పెద్దన్న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 20న ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సత్వర దిద్దుబాటు చర్యల ఆంక్షల నుంచి బయటకు తీసుకువచ్చింది. అయితే బ్యాంక్‌పై (Bank) ఆర్బీఐ పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపింది. ‘2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ గణాంకాలను పరిశీలిస్తే.. సత్వర దిద్దుబాటు చర్యల నిబంధనలను అతిక్రమించలేదని తెలుస్తోంది’ అని ఆర్బీఐ పేర్కొంది.
అంతేకాకుండా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి ఒక లిఖిత పూర్వక హామీ పత్రాన్ని సమర్పించింది. మినిమమ్ రెగ్యులేటరీ క్యాపిటల్ కలిగి ఉంటామని, నికర మొండిబకాయిలు అండ్ లెవరేజ్ రేషియోను పాటిస్తామని ఈ బ్యాంక్ ఆర్బీఐకి హామీ ఇచ్చింది. ఆర్బీఐ నిర్దేశించిన ప్రమాణాలను పాటించడం వల్ల బ్యాంక్ పనితీరు మెరుగుపడిందని చెప్పుకోవచ్చు.
బ్యాంక్ కస్టమర్లకు అదిరే శుభవార్త.. 3 కొత్త సర్వీసులు తీసుకువచ్చిన ఆర్బీఐ!
ఆర్బీఐ సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) ఆంక్షల్లో ఉన్న ఒకే ఒక బ్యాంక్‌గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నాళ్లు కొనసాగుతూ వచ్చింది. 2017 జూన్ నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ పీసీఏ ఫ్రేమ్‌వర్క్‌లో ఉంది. మొండి బకాయిలు ఎక్కువగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. అలాగే అసెట్స్ మీద తక్కువ రాబడి అంశం కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
ఈ 3 బ్యాంకుల కస్టమర్లకు గుడ్ న్యూస్.. ముందుగా వీళ్లకే ఆ కొత్త సేవలు అందుబాటులోకి
బ్యాంకులు నిర్దిష్టమైన నిబంధనలు అతిక్రమించినప్పుడు ఆర్బీఐ ఆ బ్యాంకులపై పీసీఏ చర్యలకు దిగుతుంది. రిటర్న్ ఆన్ అసెట్, మినిమమ్ క్యాపిటల్, మొండి బకాయిలు వంటి అంశాల్లో బ్యాంక్ పనితీరు ఆధారంగా పీసీఏ ఫ్రేమ్‌వర్క్ అమలు చేయాలా? వద్దా? అంశం ఆధారపడి ఉంటుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఇకపై ఒక్క బ్యాంక్ కూడా పీసీఏ ఫ్రేమ్‌వర్క్‌లో లేదని చెప్పుకోవచ్చు.
కాగా ఆర్బీఐ పీసీఏ ఆంక్షలను ఎదుర్కొనే బ్యాంకులకు స్వచ్ఛ ఉండదు. రిజర్వు బ్యాంక్ చెప్పింది చేయాల్సి ఉంటుంది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు. బ్యాంకులు బ్రాంచులను విస్తరించలేవు. ప్రమోటర్ల నుంచి డబ్బులు పొందటానికి వీలుండదు. ఇలా పలు ఆంక్షలు ఉంటాయి. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఈ ఆంక్షలు ఏమీ ఉండవు. కాగా ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం 14.2 శాతం పెరుగుదలతో రూ. 234 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ నికర లాభం రూ. 205 కోట్లు. స్థూల ఎన్పీఏలు 14.9 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 3.93 శాతానికి దిగివచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Central Bank of India, Rbi, Rbi governor, UPI