డిజిటల్ పేమెంట్ ప్రొడక్ట్స్, సర్వీసులపై సమాచారం అందించే 24x7 హెల్ప్‌లైన్ డిజిసాథీ (DigiSaathi)ని భారత ప్రభుత్వం తాజాగా లాంచ్ చేసింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ డిజిసాథీని ప్రారంభించారు. దీనిని బ్యాంకులు, నాన్-బ్యాంకులు వంటి పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు, పార్టిసిపెంట్స్ కన్సార్టియం తరఫున నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఏర్పాటు చేసింది. ఈ సేవలను www.digisaathi.info, చాట్‌బాట్ ద్వారా బ్యాంక్ కస్టమర్లు పొందవచ్చు. లేదా +91 892 891 3333కి వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా.. 14431, 1800 891 3333కి టోల్-ఫ్రీ కాల్‌లు చేయడం ద్వారా 24x7 హెల్ప్‌లైన్‌ని యాక్సెస్ చేయవచ్చు. ఈ 24x7 హెల్ప్‌లైన్ సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
డిజిసాథీ అనేది ఆటోమేటెడ్ రెస్పాన్స్ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా డెబిట్/క్రెడిట్/ప్రీపెయిడ్ కార్డ్‌లు, యూపీఐ, ఎన్ఈఎఫ్టీ (NEFT), ఆర్టీజీఎస్(RTGS), ఐఎంపీఎస్ (IMPS), ప్రీపెయిడ్ వాలెట్‌లు, ఏటీఎం, యూపీఐ/భారత్ క్యూఆర్, NACH, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి అనేక పేమెంట్ ఉత్పత్తులు, సేవల సమాచారాన్ని కస్టమర్లు తెలుసుకోవచ్చు. డిజిసాథీ వెబ్‌సైట్ ఇంటర్‌ఫేస్ ఇంగ్లీష్, హిందీ భాషలలో అందుబాటులో ఉంది. దీనిలో డిజిటల్ పేమెంట్ ప్రొడక్ట్స్, సేవల గురించి సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. డిజిసాథీ వెబ్‌సైట్ చాలా యూజర్-ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏదైనా ఒక ఉత్పత్తి లేదా సేవను ఎలా పొందాలి లేదా ఎలా ఉపయోగించాలి అనే దానిపై కూడా ఇది కస్టమర్లకు సూచనలను అందిస్తుంది. డిజిసాథీ కస్టమర్లను గైడ్ చేస్తూ... సంబంధిత బ్యాంకులు/సంస్థల సంప్రదింపు వివరాలను షేర్ చేస్తూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం అందిస్తుంది.
*డిజిసాథీ వెబ్‌సైట్‌లో సెర్చ్ ఫెసిలిటీ ఎలా పనిచేస్తుంది?
ముందుగా, సమాచారాన్ని పొందడానికి https://digisaathi.info వెబ్‌సైట్‌లో సెర్చ్ బాక్స్ లో మీ ప్రశ్నను టైప్ చేయండి. మీరు మీ ప్రశ్నను టైప్ చేస్తున్నప్పుడు, సంబంధిత ప్రశ్నలు (Related Questions) ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతాయి. ఆ ప్రశ్నల లిస్టులో మీకు కావలసిన ప్రశ్నపై క్లిక్ చేసి సమాచారాన్ని పొందవచ్చు. లిస్టులో మీకు కావలసిన ప్రశ్నలు కనిపించకపోతే.. కొత్తగా ప్రశ్న అడగవచ్చు. మీ కొత్త ప్రశ్నకు కావాల్సిన సమాచారం పొందడానికి మీరు సంబంధిత రిజల్ట్స్ (Related Results)పై క్లిక్ చేయవచ్చు. డిజిసాథీ వెబ్‌సైట్ నుంచి సమాచారాన్ని పొందడానికి లిస్టు అయిన సంబంధిత ప్రశ్నలపై క్లిక్ చేస్తే సరిపోతుంది.
డిజిసాథీ కార్యవర్గంలో ఎన్‌పీసీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, వీసా, మాస్టర్ కార్డ్, జీపే, అమెజాన్ పే, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఉన్నాయి. ఇవన్నీ సమాచారాన్ని అందిస్తాయి. అలానే రెస్పాన్స్‌ల కచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి డిజిసాథీ వెబ్‌సైట్‌లో లిస్టు అయిన ఆటోమేటిక్‌గా రెస్పాన్స్‌లను కాలానుగుణంగా సమీక్షిస్తాయి. ఫిర్యాదులను నమోదు చేయడానికి, మోసపూరిత లావాదేవీలను నివేదించడానికి లేదా బ్యాంక్‌కి సర్వీస్ రిక్వెస్ట్ పంపడానికి ఈ మీరు బ్యాంక్/ఆర్థిక సంస్థ సంప్రదింపు వివరాలు, ఈమెయిల్ ఐడీలను వెబ్‌సైట్‌లో సెర్చ్ చేయవచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ పొందడానికైతే, మీరు సెర్చ్ బాక్స్ లో బ్యాంక్/ఆర్థిక సంస్థ పేరును టైప్ చేయాలి. తరువాత మీరు బ్యాంక్ కాంటాక్ట్ సమాచారాన్ని వీక్షించవచ్చు. మీరు డిజిటల్ చెల్లింపు ఉత్పత్తులు, సేవల సమాచారం కోసం లేదా బ్యాంకులు/ఆర్థిక సంస్థల సంప్రదింపు వివరాలను పొందడం కోసం 'అస్క్ మీ (Ask Me)' చాట్‌బాట్ ఐకాన్ పై కూడా క్లిక్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banking news, Helpline, Rbi, Service