Yes Bank సంక్షోభం నుంచి బయట పడేసేందుకు ఆర్బీఐ నడుంబిగించింది. ఇప్పటికే మారిటోరియం విధించి బోర్డును స్వాధీనం చేసుకొని, ఎస్బీఐ ఆధ్వర్యంలో కన్సార్షియం ఏర్పాటు చేసి ఆర్బీఐ, ప్రస్తుతం Yes Bank అత్యవసరంగా నిధులు అవసరమైతే సుమారు రూ. 59,000 కోట్ల మేర రుణ సదుపాయం అందుబాటులో ఉంచింది. డిపాజిట్‌దారుల భద్రత కోసమే ఆర్బీఐ ఈ నిధులను వాడుకోవాలని నిబంధన పెట్టింది. అయితే Yes Bankకు ఆర్బీఐ సాధారణం కంటే ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది.
గతంలో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆర్బీఐ ఈ తరహా రుణ సదుపాయం కల్పించింది. మళ్లీ 16 ఏళ్ల తర్వాత ఇలాంటి చర్య తీసుకోవడం తొలిసారి కావడం విశేషం. ఇదిలా ఉంటే ఖాతాదారుల సొమ్ము భద్రంగానే ఉందని యస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ మరోసారి భరోసానిచ్చారు. బ్యాంకు వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని, బైటి వనరులపై ఆధారపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇదిలా ఉంటే ఎస్బీఐ సహా పలు బ్యాంకులు పెట్టుబడులు పెట్టడంతో బుధవారం నుంచి యస్ బ్యాంక్ కార్యకలాపాలు యధావిధిగా ప్రారంభమయ్యాయి.
Published by:Krishna Adithya
First published:March 20, 2020, 13:28 IST