RBI Report: గుడ్‌న్యూస్ చెప్పిన రిజర్వ్‌బ్యాంక్... త్వరలో దేశంలో సరికొత్త బ్యాంకుల విప్లవమే?

RBI Report: ఇండియాలో కొత్త బ్యాంకులు ప్రారంభించేందుకు ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఇన్నాళ్లూ RBI బ్రేక్ వేస్తూ వచ్చింది. ఇప్పుడేంచేసిందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: November 21, 2020, 8:56 AM IST
RBI Report: గుడ్‌న్యూస్ చెప్పిన రిజర్వ్‌బ్యాంక్... త్వరలో దేశంలో సరికొత్త బ్యాంకుల విప్లవమే?
త్వరలో దేశంలో కొత్త బ్యాంకుల విప్లవమే?
  • Share this:
ఏ దేశంలోనైనా బ్యాంకులు ఎంత ఎక్కువగా ఉంటే... అంతగా ప్రజల మనీ సేవ్ అవుతుంది, రుణాలు బాగా లభిస్తాయి, ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలు చవకగా అందుతాయి. ఇండియాలో ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులు చాలా ఉన్నప్పటికీ... ఇంకా చాలా మంది బ్యాంకింగ్ సేవల్ని సరిగా పొందలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో... రిజర్వ్ బ్యాంక్ (RBI) రిపోర్ట్ ఒకటి గుడ్ న్యూస్ చెబుతోంది. ఆర్బీఐ లోని అంతర్గత వర్కింగ్ గ్రూప్ (IWG)... ఓ ప్రతిపాదనా రిపోర్ట్ సమర్పించింది. అందులో... దేశంలో ప్రైవేట్ బ్యాంకుల్ని ప్రోత్సహించేలా.. భారీ కార్పొరేట్ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ... గైడ్‌లైన్స్ రూపొందించింది. ఇన్నాళ్లూ పారిశ్రామిక వేత్తలు, కంపెనీలు... బ్యాంకులను ప్రోత్సహించడాన్ని రిజర్వ్ బ్యాంక్ బ్రేక్ వేస్తూ వచ్చింది.

ఇంతకు ముంది ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు... కార్పొరేట్ కంపెనీలకు అవకాశం ఇవ్వకుండా చేసింది. వాటికి బ్యాంకింగ్‌పై అంతగా అనుభవం లేదని... అప్లికేషన్లను పక్కన పెట్టింది. ఫైనాన్షియల్ సంస్థలకు మాత్రమే... అనుభవం ఉందని అభిప్రాయపడింది. ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని RBI మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

ఈ కొత్త ప్రతిపాదన అమల్లోకి రావాలంటే... 1949 బ్యాంకింగ్ నియంత్రణా చట్టంలో సవరణలు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే... బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీలు... బ్యాంకులుగా మారతాయి. ప్రస్తుతం చాలా కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. కొన్నింటిలో రూ.50,000 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. ఇలాంటివి బ్యాంకులుగా మారాలంటే... 10 ఏళ్ల అనుభవం ఉండాలి. కొన్ని సంస్థలకు ఇంతకంటే ఎక్కువ అనుభవమే ఉంది. అవన్నీ బ్యాంకులుగా మారేందుకు ఎదురుచూస్తున్నారు.

టాటా సన్స్, ఆదిత్య బిర్లా నువో, L & T ఫైనాన్స్ హోల్డింగ్స్, రిలయన్స్ క్యాపిటల్, INMACS మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్... వంటివి బ్యాంకులుగా మారేందుకు ఎదురుచూస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదనను ఒప్పుకుంటే చాలు... దేశంలో బ్యాంకింగ్ రంగ స్వరూపం మారిపోతుంది.



ఇది కూడా చదవండి: స్పా సెంటర్లలో సెక్స్ రాకెట్... 25 మంది అమ్మాయిలు, 17 మంది అబ్బాయిలు అరెస్ట్

బ్యాంకుల జాతీయం తర్వాత... RBI మూడుసార్లు మాత్రమే లైసెన్సులు ఇచ్చింది. మొదటి రౌండ్ 1993-94లో 10 ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు లైసెన్సులు ఇచ్చింది. వాటిలో... గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, UTI బ్యాంక్, (ఇదే AXIS బ్యాంక్ అయ్యింది), బ్యాంక్ ఆఫ్ పంజాబ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సెంచూరియన్ బ్యాంక్, IDBI బ్యాంక్, టైమ్స్ బ్యాంక్, డెవలప్‌మెంట్ క్రెడిట్ బ్యాంక్. 2003-04లో మరో రెండు బ్యాంకులు... కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్ బ్యాంక్ లైసెన్స్ పొందాయి... 2014లో IDFC బ్యాంక్, బంధన్ బ్యాంక్ లకు లైసెన్స్ వచ్చింది. తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే... దేశంలో మరిన్ని బ్యాంకుల ఏర్పాటు జరుగుతుంది.
Published by: Krishna Kumar N
First published: November 21, 2020, 8:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading