RBI Rate Cut : ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే....మనకేంటి లాభం...?

ముఖ్యంగా హౌజింగ్, వాహన, ఎడ్యుకేషన్ రుణాలపై వడ్డీరేట్లను బ్యాంకులు తగ్గించే అవకాశం ఉంది. హౌజింగ్ రుణాలు పొందేవారు ఈఎంఐలో ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు ఎంపిక చేసుకుంటే మాత్రం వారికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈఎంఐ భారం తగ్గే అవకాశం ఉంది.

news18-telugu
Updated: April 3, 2019, 5:21 PM IST
RBI Rate Cut : ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే....మనకేంటి లాభం...?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 3, 2019, 5:21 PM IST
ఆర్‌బీఐ మ్యానిటరీ పాలసీ కమిటీ ఈ ఆర్థిక సంవత్సరం నిర్వహించున్న తొలి భేటీపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జరగబోయే భేటీలో కీలక వడ్డీ రేట్లు మరో పావు శాతం, 25 బీపీఎస్ తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నిజానికి ఫిబ్రవరిలో జరిగిన ఆర్బీఐ రెపోరేట్ 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపోరేట్ 6.25 శాతానికి తగ్గింది. అయితే తగ్గనున్న కీలక వడ్డీ రేట్లు సామాన్యులపై ఎలా ప్రభావం చూపుతాయనే అంశం సర్వత్రా చర్చలో నిలిచింది. ముఖ్యంగా బ్యాంకుల నుంచి వివిధ రకాల లోన్లు పొందేవారికి ఆర్‌బీఐ తగ్గించిన వడ్డీ రేట్లు కలిసిరానున్నాయి. ముఖ్యంగా హౌజింగ్, వాహన, ఎడ్యుకేషన్ రుణాలపై వడ్డీరేట్లను బ్యాంకులు తగ్గించే అవకాశం ఉంది. హౌజింగ్ రుణాలు పొందేవారు ఈఎంఐలో ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు ఎంపిక చేసుకుంటే మాత్రం వారికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈఎంఐ భారం తగ్గే అవకాశం ఉంది.

అయితే, సాధారణంగా రెపోరేట్స్ తగ్గినప్పుడు బ్యాంకులకు ఆర్‌బీఐ నుంచే వచ్చే నగదుపై చెల్లించే వడ్డీ తగ్గుతుంది. తద్వారా బ్యాంకులకు లాభం కలుగుతుంది. అయితే ఈ లాభాన్ని బ్యాంకులు సాధారణంగా బ్యాంకులు తమ కస్టమర్లకు బదిలీ చేస్తుంటాయి. అప్పుడు రుణాలు పొందిన కస్టమర్లకు వడ్డీ భారం తగ్గించి ఊరట ఇస్తుంటాయి. తద్వారా మరిన్ని రుణాలను ఆకర్షించేలా బ్యాంకులు ప్లాన్ చేసుకుంటాయి. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం వడ్డీ రేట్లు తగ్గించినా వాటి లాభాలను కస్టమర్లు పంచకుండా వెనకేసుకుంటాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం కారణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించి ద్వారా విపణిలోకి ద్రవ్య ప్రవాహం పెంచాలని చూస్తోంది. తద్వారా బ్యాంకులకు నిధులు రావడం ద్వారా పెట్టుబడుల ప్రవాహం పెరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. కాగా కస్టమర్లు మాత్రం తొందరపడి రుణాల కోసం పరిగెత్తకుండా పూర్తి గైడ్ లైన్స్ వచ్చేవరకూ ఓపిగ్గా ఉండాలని, అరశాతం వడ్డీ తగ్గిందని ఆశపడి రుణాల కోసం పరిగెత్తవద్దని, నిపుణులు సూచిస్తున్నారు.

First published: April 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...