గ్రామీణ ప్రాంతాల్లో రుణ వ్యవస్థను మార్చేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) యొక్క డిజిటలైజేషన్ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్ణయించింది. ఈ పథకాన్ని మధ్యప్రదేశ్ (madhya pradesh) మరియు తమిళనాడు (Tamilnadu)లో ప్రారంభించనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన అనుభవాలతో కిసాన్ క్రెడిట్ కార్డ్‌ల డిజిటలైజేషన్ కోసం దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్‌బిఐ (RBI) ఒక ప్రకటనలో వెల్లడించింది. మధ్యప్రదేశ్ మరియు తమిళనాడులో ప్రారంభించబడిన పైలట్ ప్రాజెక్ట్ బ్యాంకులలోని వివిధ ప్రక్రియల ఆటోమేషన్ మరియు సర్వీస్ ప్రొవైడర్లతో వారి సిస్టమ్‌లను ఏకీకృతం చేయడంపై దృష్టి పెడుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ డిజిటలైజేషన్ రుణ ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేయడంలో మరియు రుణగ్రహీతల వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, రుణం కోసం దరఖాస్తు చేయడం నుంచి దాని పంపిణీకి పట్టే సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని ఆర్‌బీఐ చెబుతోంది. నాలుగు వారాల ఈ సమయాన్ని రెండు వారాలకు తగ్గించవచ్చు.
ఈ పైలట్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ మరియు తమిళనాడులోని ఎంపిక చేసిన జిల్లాలలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్‌తో కలిసి అమలు చేయబడుతుంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందుకు పూర్తి సహకారం అందిస్తాయి. రైతులకు సులభంగా ఆర్థికసాయం అందించేందుకు 1998లో కేసీసీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వంటి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు రుణాలు అందజేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్, 2020లో మార్పులతో KCC పథకాన్ని ప్రారంభించారు.
Business Idea: ఇంటి నుంచే చేసే బిజినెస్.. ఏడాదికి రూ.5 లక్షలు సంపాధించే ఛాన్స్.. ఎలాగంటే?
KCC ద్వారా, రైతులు 5 సంవత్సరాలలో KCC నుంచి 3 లక్షల రూపాయల వరకు స్వల్పకాలిక రుణాన్ని తీసుకోవచ్చు. రైతులకు 9 శాతం చొప్పున రుణాలు అందుతాయి. దీని తర్వాత ప్రభుత్వం 2 శాతం సబ్సిడీ ఇస్తుంది. అలాగే, రైతు రుణాన్ని సకాలంలో చెల్లిస్తే అదనంగా రాయితీ కూడా లభిస్తుంది. తద్వారా రైతులు తక్కువ వడ్డీతో రుణాలు పొందగలుగుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loans, Farmers, Madhya pradesh, Pm kisan application, Tamilnadu