ప్రైవేటు బ్యాంకుల విషయంలో RBI కీలక నిర్ణయాలు.. అంతర్గత కమిటీ నివేదిక విడుదల

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అంతర్గత కమిటీ శుక్రవారం ఓ కీలక నివేదికను వెల్లడించింది. ప్రైవేటు బ్యాంకుల యాజమాన్యం, కార్పొరేట్‌ స్ట్రక్చర్‌పై కీలక నిర్ణయాలు తీసుకుంది. పదిహేనేళ్ల తర్వాత ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ప్రమోటర్ల చెల్లింపు ఈక్విటీ వాటా పరిమితిని 26 శాతానికి పెంచింది.

news18-telugu
Updated: November 20, 2020, 8:05 PM IST
ప్రైవేటు బ్యాంకుల విషయంలో RBI కీలక నిర్ణయాలు.. అంతర్గత కమిటీ నివేదిక విడుదల
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అంతర్గత కమిటీ శుక్రవారం ఓ కీలక నివేదికను వెల్లడించింది. ప్రైవేటు బ్యాంకుల యాజమాన్యం, కార్పొరేట్‌ స్ట్రక్చర్‌పై కీలక నిర్ణయాలు తీసుకుంది. పదిహేనేళ్ల తర్వాత ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ప్రమోటర్ల చెల్లింపు ఈక్విటీ వాటా పరిమితిని 26 శాతానికి పెంచింది. ఈ మేరకు కమిటీ నిర్ణయం ప్రకటించింది. ఐదేళ్ల లాకిన్‌ కాలపరిమితి ముగిసిన అనంతరం ఎప్పుడైనా ప్రమోటర్ల యాజమాన్య వాటాను 26 శాతానికి తగ్గించాలని కమిటీ కీలక సిఫార్సు చేసింది. భారీ కార్పొరేట్‌, పారిశ్రామిక సంస్థలకు బ్యాకింగ్‌ లైసెన్సుల విషయంలోనూ కమిటీ కీలక సూచనలు చేసింది. ఈ లైసెన్సులను బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి సవరణలు చేసిన అనంతరమే ఇవ్వాలని సూచించింది. ఈ జూన్ నెలలో దేశంలోని ప్రైవేటు బ్యాంకుల్లో మేనేజ్మెంట్, కార్పొరేట్‌ స్ట్రక్చర్‌ మార్గదర్శకాలను సమీక్షించేందుకు ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీకే మహంతీ సారథ్యంలో ఈ కమిటీ ఏర్పాటైంది.

కొత్త యూనివర్సల్ ‌బ్యాంకు ఏర్పాటుకు తొలి చెల్లింపు మూలధనం(నెట్‌వర్త్‌)ను రూ.1000 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసకున్నారు. అదే చిన్న బ్యాంకులకు ఈ మూలధనం రూ.300 కోట్లని తెలిపింది. పట్టణ సహకార బ్యాంకులు చిన్న బ్యాంకులుగా మారడానికి ఐదేళ్లకు రూ.300 కోట్లు చెల్లింపు మూలధనం ఉండాలని కమిటీ స్పష్టం చేసింది. నాన్‌ ప్రమోటర్ల విషయంలో నూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఓటింగ్‌ హక్కుతో కూడిన బ్యాంకు ఈక్విటీ చెల్లింపు వాటా లిమిట్ 15%గా ఉండాలని నిర్ణయించారు. రూ. 50 వేల కన్నా ఎక్కువ ఆస్తులు కలిగిన ఆర్థిక సంస్థలు బ్యాంకులుగా మారే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కమిటీ ప్రకటించింది. ఆ సంస్థలు మినిమం పదేళ్ల పాటు సేవలను అందించి ఉండాలని స్పష్టం చేసింది. ట్రాక్‌ రికార్డు కలిగిన పేమెంటు బ్యాంకులపై సైతం కమిటీ నిర్ణయం ప్రకటించింది. అవి మూడేళ్ల అనంతరం చిన్నతరహా బ్యాంకులుగా మారే విషయాన్ని పరిశీలిస్తామని ప్రకటించింది.
Published by: Nikhil Kumar S
First published: November 20, 2020, 8:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading