రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) eRupee అనే కొత్త రకం డిజిటల్ కరెన్సీ (Digital Currency)పై పని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ డిజిటల్ రూపాయిని భారతీయ రిజర్వు బ్యాంక్ ప్రయోగాత్మకంగా కొన్ని నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈ-రూపీ (eRupee)ని క్యాష్‌గా లేదా క్యాష్‌ను eRupeeగా మార్చడం సాధ్యం కాదని ఆర్‌బీఐ ఫిన్‌టెక్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జనరల్ మేనేజర్ అనూజ్ రంజన్ వెల్లడించారు.
eRupee బ్యాంకు డిపాజిట్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుందని రంజన్ తెలిపారు. ఈ డిజిటల్ రూపీ ఎక్స్ఛేంజ్ ప్రక్రియను ఆర్‌బీఐ (RBI) నియంత్రిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో eRupeeని క్యాష్‌గా మార్చడం సాధ్యమవుతుందని కానీ ఇప్పటికైతే ఆ సదుపాయం అందుబాటులోకి రాలేదని స్పష్టం చేశారు. ఇండియన్ మర్చంట్స్ ఛాంబర్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అనూజ్ రంజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
* ఇండియన్ డిజిటల్ కరెన్సీ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త డిజిటల్ కరెన్సీ eRupeeని పైలెట్ ప్రాజెక్టులో భాగంగా పరీక్షిస్తోంది. ఈ పరీక్షలు ఇప్పటివరకు విజయవంతంగానే సాగుతున్నాయి. ఎక్కువ మంది ప్రజలు దీనిని వినియోగిస్తుండటంతో ఖర్చులను ఆర్‌బీఐ చూసుకుంటోంది. అంటే eRupee సిస్టమ్‌ను ఇంప్లిమెంట్, మెయింటనింగ్ చేయడానికి అయ్యే ఖర్చును యూజర్లపై మోపకుండా తానే వాటిని భరిస్తోంది.
ఇక యెస్ బ్యాంక్ (Yes Bank) ప్రజలు eRupeeని పొందగలిగే డిజిటల్ వాలెట్ యాప్‌ను యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లలో అందుబాటులోకి తెచ్చింది. అలానే రిలయన్స్ రిటైల్, నేచురల్ ఐస్‌క్రీమ్ వంటి కొన్ని స్టోర్స్ ఇప్పుడు eRupeesలో పేమెంట్స్‌ను అంగీకరిస్తున్నాయి.
అనూజ్ రంజన్ చెప్పినట్లు eRupeeని పొందాలనుకునే వారు ముందుగా తమ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బును డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వారికి eRupeeని జారీ చేస్తుంది. దీనిని డిజిటల్ లావాదేవీలకు ఉపయోగించవచ్చు. అంటే యూజర్ బ్యాంక్ అకౌంట్‌లో ఇప్పటికే ఉన్న డబ్బుకు బదులుగా ఆర్‌బీఐ eRupeeని జారీ చేస్తుంది. eRupee వాల్యూ నిజమైన డబ్బుకు సమానంగా ఉండేలా ఈ పద్ధతిని ఆర్‌బీఐ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చైనా, నైజీరియా, బహామాస్ వంటి కొన్ని దేశాలు ఇప్పటికే డిజిటల్ కరెన్సీలను లాంచ్ చేశాయి.
ఇది కూడా చదవండి : కేంద్ర బడ్జెట్ నుంచి ఆశిస్తున్న ఐదు మేజర్ అనౌన్స్‌మెంట్స్ ఇవే..
స్వీడన్, జపాన్ వంటి మరికొన్ని దేశాలు ఈ రకం కరెన్సీని త్వరలో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఇప్పటికీ డిజిటల్ కరెన్సీని అధ్యయనం చేస్తూ ట్రయల్స్ నిర్వహిస్తోంది. అయితే యూఎస్ఎ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కాంగ్రెస్ నుండి దిశానిర్దేశం లేకుండా డిజిటల్ కరెన్సీని రూపొందించే ఆలోచన లేదని సూచించింది.
ఇతర దేశాలు ఇప్పటికీ డిజిటల్ కరెన్సీల ప్రయోజనాలు, లోపాలను చర్చిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు (CBDC) అని కూడా పిలిచే డిజిటల్ కరెన్సీ సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది. వాటిలో ఒక రకం డిజిటల్ కరెన్సీని సాధారణ ప్రజలకు, మరో రకం డిజిటల్ కరెన్సీని సెంట్రల్ బ్యాంకులు వాణిజ్య బ్యాంకులకు బదిలీ చేయడానికి ఉపయోగిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Digital currency, Digital Rupee, Personal Finance, Rbi