రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల సమీకృత అంబుడ్స్‌మన్ పథకాన్ని ప్రారంభించింది. పటిష్ఠమైన యంత్రాంగంతో కూడిన ఈ పథకం పారదర్శకంగా ఉంటుంది. RBI నియంత్రణలో ఉండే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs), పేమెంట్ సర్వీసు ఆపరేటర్ల వంటి సంస్థలపై ఖాతాదారులు చేసే ఫిర్యాదులను పరిష్కరించే యంత్రాంగాన్ని ‘వన్ నేషన్- వన్ అంబుడ్స్‌మన్’ బలోపేతం చేస్తుంది. కొత్త చెల్లింపు విధానాలు అందుబాటులోకి రావడం, ఆ సాంకేతిక పరిజ్ఞానాల మధ్య పరస్పరచర్యలు చోటుచేసుకుంటున్న వేళ వన్ నేషన్- వన్ అంబుడ్స్‌మన్’ కీలక పాత్ర పోషిస్తుందని సర్వత్రా టెక్నాలజీస్ వ్యవస్థాపకులు, వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మందర్ అఘాషే అభిప్రాయపడ్డారు. ఫిర్యాదులు దాఖలు చేసేందుకు, ట్రాకింగ్ కోసం, ఫీడ్‌బ్యాక్ పొందేందుకు సింగిల్ పాయింట్ కాంటాక్ట్ ఉండటం ఖాతాదారులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని అన్నారు.
కొత్త అంబుడ్స్‌మన్ పథకంలో ఫిర్యాదు ఎలా ఫైల్ చేయాలో తెలుసుకుందాం.
అంబుడ్స్‌మన్ ముందు అనేక విధాలుగా ఫిర్యాదులు ఫైల్ చేయవచ్చు. ఆన్లైన్లో ఫిర్యాదు చేయదలుచుకుంటే https://cms.rbi.org.in వెబ్సైట్ సందర్శించాలి. CRPC@rbi.org.in ఈమెయిల్ ద్వారా కూడా కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు. లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ 1448కు కాల్ చేసి కూడా ఫిర్యాదు తెలియజేయవచ్చు. అంతే కాదు మీరు ఫిజికల్‌గా ఫామ్ నింపి దాన్ని చండీగఢ్‌లో RBI ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ రిసీట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్‌కు పంపించవచ్చు.
రూ. 50 వేల పెట్టుబడితో ముడు నెలల్లో రూ. 30 లక్షలు సంపాధించే ఛాన్స్.. ఎలానో తెలుసుకోండి
RBIకి చెందిన CMS వెబ్సైట్లో ఫిర్యాదు రిజిస్టర్ చేసేందుకు OTP ద్వారా మొబైల్ నెంబర్ వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్లైన్ ఫామ్‌లో వ్యక్తిగత వివరాలు నింపి ఆ సంస్థపై ఫిర్యాదు చేస్తున్నారో అది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫిర్యాదు వివరాలతో పాటు ఆ సంస్థపై తొలిసారి ఎప్పుడు ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు కాపీనీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
Business ideas: తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలనుకుంటున్నారా..? అయితే, ఈ వ్యాపారం ట్రై చేయండి..
ఫిర్యాదు చేసేందుకు కార్డు నెంబర్ లేదా లోన్ ఖాతా నెంబర్ లేదా డిపాజిట్ ఖాతా వివరాలు అందజేయాల్సి ఉంటుంది. లోన్లు, అడ్వాన్సులు లేదా మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించిన కేటగిరీని మీరు డ్రాప్ డౌన్ మెనూలోని ఆప్షన్స్ నుంచి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తగిన సబ్ కేటగిరీ ఎంచుకోండి. ఉదాహరణకు సబ్ కేటగిరీ 1ను మీరు ఎంచుకొని ఫీజులకు సంబంధించిన ఫిర్యాదు అయితే మీరు డ్రాప్ డౌన్ నుంచి ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారో ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే న్యూ డ్యూ సర్టిఫికేట్ జారీ చేసేందుకు ఛార్జీ వసూలు చేయడం లేదా క్రెడిట్ కార్డుపై యానువల్ ఫీజు వంటివి సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఫిర్యాదుకు సంబంధించిన వాస్తవ వివరాలు అందజేయండి. ఆ మొత్తం ఎంత, మీరు ఒక వేళ పరిహారం కోరుతున్నట్టు అయితే దాన్ని కూడా పేర్కొనండి. మీ ఫిర్యాదును మొత్తం ఒకసారి పరిశీలించి ఆ తర్వాత సబ్మిట్ చేయండి. దాన్ని పీడీఎఫ్‌గా డౌన్లోడ్ చేసుకొని మీ రికార్డ్ కోసం సేవ్ చేసుకోండి.
ఫిర్యాదులు, పరిష్కారం, వివాదాలకు సంబంధించి ఈ సమీకృత అంబుడ్స్‌మన్ స్కీమ్ సులభంగా, పారదర్శకంగా ఉండటమే కాదు పటిష్ఠమైన యంత్రాంగంతో కూడి ఉంటుంది. “ఖాతాదారుల నమ్మకాన్ని పెంచడంలో ఈ అంబుడ్స్‌మన్ స్కీమ్ బాగా పనిచేస్తుంది. ఫిర్యాదులు, మోసాలకు సంబంధించిన వివాదాలను ప్రభావవంతంగా సరిదిద్దుతుంది” అని అన్నారు payNearb వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ ఆనంద్ కుమార్ బజాజ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BANK ACCOUNTS, Rbi, Reserve Bank of India