Loans: సొంతిల్లు కొంటున్నారా.. అయితే త్వరపడండి..Home Loan Interest Rates తగ్గుతున్నాయి

Home Loan Interest Rates: కొత్తగా ఇల్లుకొంటున్నారా... టూవీలర్, ఫోర్ వీలర్ తీసుకుంటున్నారా... అయితే ఇది మీకు గుడ్ న్యూస్... హౌసింగ్, వెహికిల్ రుణాలు ఇకపై మరింత తగ్గుతున్నాయి.

Krishna Adithya | news18-telugu
Updated: February 8, 2020, 5:57 PM IST
Loans: సొంతిల్లు కొంటున్నారా.. అయితే త్వరపడండి..Home Loan Interest Rates తగ్గుతున్నాయి
SBI: ఎస్‌బీఐ గుడ్ న్యూస్... ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా లోన్స్
  • Share this:
ఆర్బీఐ మానిటరీ పాలసీ రిలీజ్ చేసింది. అయితే ఈ సారి సీఆర్ఆర్ Cash Reserve Ratio (CRR) తగ్గించడం ద్వారా లోన్స్(Home Loan Interest Rates) తీసుకునే వారి పట్ల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వరాల జల్లు కురిపించారు. ఈ సారి ఆర్బీఐ తన మానిటరీ పాలసీలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు ఇకపై హౌజింగ్ లోన్స్, వాహన లోన్స్(Home Loan, vehicle loan Interest Rates) కు సీఆర్ఆర్ cash reserve ratio (CRR) మెయిన్ టెయిన్ చేయాల్సిన అవసరం లేదని ఆర్బీఐ డిసెషన్ తీసుకుంది. ఇది ఒక రకంగా బ్యాంకులకు అందివచ్చిన వరమనే చెప్పాలి. అయితే ఇంతకీ ఈ సీఆర్ఆర్ అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం. బ్యాంకులు వివిధ రూపాల్లో తమ డిపాజిటర్ల నుంచి రకరకాల రూపాల్లో డిపాజిట్ రూపంలో నగదును సేకరిస్తుంటాయి. ఇందులో సేవింగ్స్, కరెంట్ ఖాతాల రూపంతో పాటు ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో నగదును సేకరించి వాటికి తాము ఆఫర్ చేసిన వడ్డీలను చెల్లిస్తుంటాయి. సేవింగ్స్ ఖాతా అయితే కాస్త తక్కువగా, ఫిక్స్‌డ్ ఖాతాలకు అయితే 6-8 శాతం మధ్యలో వడ్డీని చెల్లిస్తుంటాయి. అయితే సేకరించిన డిపాజిట్లను లోన్స్ రూపంలో ఇస్తుంటాయి. అయితే లోన్స్ యొక్క వడ్డీ రేటు మాత్రం 8-12 శాతం ఉంటుంది. కాగా డిపాజిట్స్ పై చెల్లించే వడ్డీ రేటు, అలాగే లోన్స్ పై వసూలు చేసే వడ్డీ రేటు మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అదే బ్యాంకులకు ఆదాయం. డిపాజిట్స్ నుంచి సేకరించిన సొమ్ములో కొంత మొత్తాన్ని cash reserve ratio (CRR) క్యాష్ రిజర్వ్ రేషియో రూపంలో ఆర్‌బీఐ సేకరిస్తుంది. అలాగే ఎస్ఎల్ఆర్, నాన్ ఎస్ఎల్ఆర్ రూపంలో నగదు సేకరిస్తుంది. ఈ డిపాజిట్స్ చేసిన తర్వాతే మిగిలిన అమౌంట్ తో బ్యాంకులు తమ వ్యాపారాలను కొనసాగిస్తాయి. అయితే ఎస్ఎల్ఆర్, నాన్ ఎస్ఎల్ఆర్ పై బ్యాంకులు వడ్డీ రూపంలో ఆదాయం గడిస్తుంటాయి. కానీ సీఆర్ఆర్ Cash Reserve Ratio (CRR)పై మాత్రం బ్యాంకులకు ఎలాంటి ఆదాయం పొందవు.

అయితే బ్యాంకులు మాత్రం తమ నెట్ డిపాజిట్స్ లో సుమారు 4 శాతం సీఆర్ఆర్ కింద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే బ్యాంకులకు సీఆర్ఆర్ డిపాజిట్స్ అనేవి పెద్దగా లాభసాటి బేరం కాదనే చెప్పాలి. అయితే హోంలోన్స్, ఆటో లోన్స్, ఎంఎస్ఎంఈ లోన్స్ రూపంలో రుణాలను బ్యాంకులు వినియోగదారులకు అందిస్తే ఇకపై ఆ లోన్ మొత్తంపై సీఆర్ఆర్ cash reserve ratio (CRR) మెయిన్ టెయిన్ చేయాల్సిన అవసరం లేదని ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బ్యాంకులకు ఇది కలిసి వచ్చేఅంశమనే చెప్పాలి. అయితే ఈ నిబంధన జూలై వరకూ అమల్లో ఉండనుంది. దీంతో జూలై వరకూ వాహన, హౌజింగ్ రుణాలు చౌక కానున్నాయి.(Home Loan, vehicle loan Interest Rates)

రియల్ ఎస్టేట్‌కు ఆర్బీఐ వరాల జల్లు...
రియల్ ఎస్టేట్ పై ఆర్బీఐ తన మానిటరీ పాలసీలో వరాల జల్లు కురిపించింది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచి భారీ ప్రాజెక్టులు నిర్మించి ఫ్లాట్లు అమ్ముడుపోని రియల్టర్లకు ఆర్బీఐ ఊరట కల్పించింది. రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థలు ఇచ్చిన రుణాలను మొండి బకాయీలు(NPA)గా డిక్లేర్ చేయకుండా వాటిని మరో సంవత్సరం పాటు రుణాలుగా ఉంచుకునేలా నిర్ణయం తీసుకుంది. ఇది ఒక రకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాలిట వరం అనే చెప్పవచ్చు.
First published: February 8, 2020, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading