Home /News /business /

RBI Monetary Policy: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే

RBI Monetary Policy: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అత్యంత కీలకమైన వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించనున్నట్లు ప్రకటించింది. రెపో రేటును స్థిరంగానే ఉంచింది ఆర్‌బీఐ. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత కీలకమైన వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఆర్‌బీఐ రెపో రేటును స్థిరంగానే ఉంచింది. ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ MPC తన త్రైమాసిక పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోవడం ఇది వరుసగా తొమ్మిదోసారి కావడం విశేషం. రెపో రేటు 4శాతంగా ఉంచగా.. రివర్స్‌ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగించనున్నట్లు శక్తికాంత దాస్‌ వివరించారు. మానిటరీ పాలసీ కమిటీలోని ఆరు మందిలో ఐదుగురు రేట్లను స్థిరంగా కొనసాగించాలని నిర్ణయించారు. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు చివరిసారి ఆర్‌బీఐ రెపోరేటును మే 2020లో 4 శాతానికి కుదించింది. అప్పటి నుంచి దానిని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఆర్‌బీఐ రియల్ జీడీపీ గ్రోత్ ను కూడా 9.5 శాతంగా అంచనా వేసింది. ఇదిలా ఉంటే.. మూడో త్రైమాసికపు జీడీపీ వృద్ధి అంచనాలను సైతం 6.8 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించింది ఆర్బీఐ.

  Q4 అంచనాలను 6 శాతానికి కుదించారు. కరోనా కారణంగా ఇబ్బందుల్లోకి వెళ్లిన భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుందని శక్తికాంత దాస్‌ వెల్లడించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఇటీవల ట్యాక్స్ తగ్గించిన నేపథ్యంలో వినిమయ గిరాకీ పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటు నవంబరు నెలలో ముడి చమురు ధరలు తగ్గడం సామాన్యులకు ఊరటనిచ్చే అవకాశం ఉందన్నారు. ద్రవ్యోల్బణం కిందకు దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయన్నాయని శక్తికాంత్ దాస్ అన్నారు.
  LPG Cylinder Weight: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న LPG సిలిండర్ బరువు.. ఎంతంటే?

  ఇదిలా ఉంటే..   రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఇటీవల సమీకృత అంబుడ్స్‌మన్‌ పథకాన్ని ప్రారంభించింది. పటిష్ఠమైన యంత్రాంగంతో కూడిన ఈ పథకం పారదర్శకంగా ఉంటుంది. RBI నియంత్రణలో ఉండే బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (NBFCs), పేమెంట్‌ సర్వీసు ఆపరేటర్ల వంటి సంస్థలపై ఖాతాదారులు చేసే ఫిర్యాదులను పరిష్కరించే యంత్రాంగాన్ని ‘వన్‌ నేషన్‌- వన్‌ అంబుడ్స్‌మన్‌’ బలోపేతం చేస్తుంది.
  Digital Gold Loans: డిజిటల్ గోల్డ్‌పై లోన్ తీసుకోవడం ఎలా...తక్షణమే రూ.60 వేల వరకూ లోన్ లభించే చాన్స్..

  కొత్త చెల్లింపు విధానాలు అందుబాటులోకి రావడం, ఆ సాంకేతిక పరిజ్ఞానాల మధ్య పరస్పరచర్యలు చోటుచేసుకుంటున్న వేళ వన్‌ నేషన్‌- వన్‌ అంబుడ్స్‌మన్‌’ కీలక పాత్ర పోషిస్తుందని సర్వత్రా టెక్నాలజీస్‌ వ్యవస్థాపకులు, వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మందర్‌ అఘాషే అభిప్రాయపడ్డారు. ఫిర్యాదులు దాఖలు చేసేందుకు, ట్రాకింగ్‌ కోసం, ఫీడ్‌బ్యాక్‌ పొందేందుకు సింగిల్‌ పాయింట్‌ కాంటాక్ట్‌ ఉండటం ఖాతాదారులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని అన్నారు.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Rbi, Rbi governor, Reserve Bank of India

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు