హోమ్ /వార్తలు /బిజినెస్ /

RBI: 6.25 శాతానికి రెపోరేటు.. పెరగనున్న వడ్డీ రేట్లు.. ఆర్బీఐ కీలక నిర్ణయాలు

RBI: 6.25 శాతానికి రెపోరేటు.. పెరగనున్న వడ్డీ రేట్లు.. ఆర్బీఐ కీలక నిర్ణయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వ్యాపార వర్గాలు, ఆర్థిక నిపుణుల అంచానాలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సారి వడ్డీ రేట్లను 35 బేసిక్ పాయింట్లకు పెంచింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai | Hyderabad

వ్యాపార వర్గాలు, ఆర్థిక నిపుణుల అంచానాలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of Bank) ఈ సారి వడ్డీ రేట్లను 35 బేసిక్ పాయింట్లకు పెంచింది. దీంతో రెపోరేటు 6.25 శాతానికి చేరింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ద్రవ్య పరపతి కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను ప్రకటించారు. ఈ పెంపు వెంటనే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) తెలిపారు. ఈ నిర్ణయంతో రానున్న కాలంలో గృహ, ఆటో, వ్యక్తిగత సహా అన్ని రకాల రుణాలు ఖరీదైనవిగా మారనున్నాయి. ఈ ఏడాదిలో రెపోరేటును (Repo Rate) ఆర్బీఐ పెంచడం ఇది ఐదో సారి. ప్రస్తుతం 2018 తర్వాత రెపోరేటు అత్యధిక స్థాయికి చేరింది. రిజర్వ్ బ్యాంక్ ఈరోజు వరుసగా ఐదోసారి రెపో రేటును పెంచింది. ఈ ఏడాది తొలిసారిగా మేలో రెపో రేటును 0.50 శాతం పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెపో రేటు 1.90 శాతం పెరిగింది. నేటి పెంపుదలకు ముందు, ఎఫెక్టివ్ రెపో రేటు 5.90 శాతంగా ఉంది.

కరోనా కాలంలో రుణ భారాన్ని తగ్గించడానికి, సామాన్యులకు ఉపశమనం కలిగించడానికి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటులో భారీ కోత విధించింది. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ మళ్లీ రెపో రేటును పెంచడం ప్రారంభించింది. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం ప్రభావడం. రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 7.4 శాతానికి చేరుకోగా, అక్టోబర్‌లో 6.7 శాతానికి స్వల్పంగా తగ్గింది.

SBI News: ఎస్‌బీఐ న్యూ ఇయర్ ఆఫర్ అదిరింది.. ఏకంగా రూ. 40 వేల డిస్కౌంట్!

సమావేశానికి హాజరైన 6 మంది సభ్యులలో 4 మంది రెపో రేటు పెంపునకు అనుకూలంగా ఓటేశారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే వరకు వడ్డీ రేట్లను ఎక్కువగా ఉంచడం అవసరమని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు వినియోగంలో తగ్గుదల కారణంగా, రిజర్వ్ బ్యాంక్ కూడా వృద్ధి రేటు అంచనాను తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 7 శాతంగా అంచనా వేయగా.. ఇప్పుడు దానిని 6.8 శాతానికి తగ్గించింది. ఇటీవల విడుదలైన రెండో త్రైమాసిక వృద్ధి గణాంకాలు కూడా మందకొడిగా ఉన్నాయి. రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంది.

First published:

Tags: Rbi, Repo rate, Reserve Bank of India

ఉత్తమ కథలు