Shaktikanta Das | బ్యాంకుల పెద్దన్న, దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్ కస్టమర్లపై నేరుగా ప్రభావం పడనుంది. రుణ గ్రహీతలపై ఎఫెక్ట్ ఉండనుంది. నెలవారీ ఈఎంఐ (EMI) మరింత పెరగొచ్చు. అలాగే రుణాలు మరింత భారం కానున్నాయి. రుణ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే రెపో రేటు పెంపు వల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి ఊరట కలుగనుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి.
ఆర్‌బీఐ తాజా మానిటరీ పాలసీ కమిటీ సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 6.5 శాతానికి చేరింది. ఇది వరకు రెపో రేటు 6.25 శాతంగా ఉండేది. అందరి అంచనాలకు అనుగుణంగా ఆర్‌బీఐ రెపో రేటు పెంపు ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఆర్‌బీఐ గత ఏడాది మే నెల నుంచి చూస్తే రెపో రేటును ఏకంగా 250 బేసిస్ పాయింట్ల వరకు పెంచిందని చెప్పుకోవచ్చు. రెపో రేటు పెరగడం ఇది వరుసగా ఆరో సారి కావడం గమనార్హం.
ఫోన్‌పే వాడే వారికి గుడ్ న్యూస్.. 2 కొత్త సర్వీసులు!
ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ రెపో రేటును పెంచుతూ వస్తోంది. ఇప్పుడు కూడా అదే నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం దిగి రావొచ్చని, ఈ ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. 2023-24 నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఇకపోతే 2023- 24 ఆర్థిక సంవత్సంలో జీడీపీ వృద్ధి 6.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.
రైతులకు బ్యాంక్ అదిరే శుభవార్త.. ఉచితంగా క్రెడిట్ కార్డు, లాభాలెన్నో!
అలాగే ఆర్‌బీఐ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీని (ఎస్‌డీఎఫ్) 6 శాతం నుంచి 6.25 శాతానికి పెంచింది. ఇంకా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) కూడా పెంచేసింది. 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇది 6.75 శాతానికి చేరింది. అలాగే ఇతర ఆసియా కరెన్సీలతో పోలిస్తే ఇండియన్ రూపాయిలో ఒడిదుడుకులు తక్కువగా ఉన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. అంతర్జాతీయంగా చూస్తే.. చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం నిర్ణీత లక్ష్యాల కన్నా ఎక్కువగానే ఉందని వెల్లడించారు. కరెండ్ అకౌంట్ లోటు కాస్త పెరిగిందని, అయినా ఇబ్బంది ఏమీ లేదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ క్రమంగా మెరుగు పడుతోందని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rbi, Repo rate, Reserve Bank of India