హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reserve Bank of India: ఆర్‌బీఐ అదిరే శుభవార్త.. బ్యాంక్ కస్టమర్లకు కొత్త సర్వీసులు!

Reserve Bank of India: ఆర్‌బీఐ అదిరే శుభవార్త.. బ్యాంక్ కస్టమర్లకు కొత్త సర్వీసులు!

Reserve Bank of India: ఆర్‌బీఐ శుభవార్త.. బ్యాంక్ కస్టమర్లకు కొత్త సర్వీసులు!

Reserve Bank of India: ఆర్‌బీఐ శుభవార్త.. బ్యాంక్ కస్టమర్లకు కొత్త సర్వీసులు!

Bank Customers | బ్యాంక్ కస్టమర్లకు కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. యూపీఐ సేవలు మరింత సులభతరం కానున్నాయి. ఆటే పే మాదిరిగానే కొత్త సేవలు లభించనున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

UPI Payments | రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా బ్యాంక్ (Bank) కస్టమర్లకు తీపికబురు అందించింది. కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా యూపీఐ (UPI) చెల్లింపులను మరింత సులభతరం చేయాలని ఆర్‌బీఐ భావిస్తోంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తాజా పాలసీ సమీక్షలో ఈ విషయాన్ని వెల్లడించారు. యూపీఐ కస్టమర్లు వారి బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులను బ్లాక్ చేయడానికి అనుమతి ఇవ్వొచ్చని తెలిపారు.

దీని ద్వారా మర్చంట్లు బ్యాంక్ అకౌంట్ నుంచి ఎన్ని సార్లైనా డబ్బులు కట్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు. బ్యాంక్ అకౌంట్ కలిగిన వ్యక్తి నిర్దేశించిన లిమిట్ వరకు మర్చంట్లు ఎన్ని సార్లైనా డబ్బులు కట్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం సింగిల్ పేమెంట్ వ్యవస్థ మాత్రమే అందుబాటులో ఉంది.

ఖాతాదారులకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. ఇక పదే పదే ఆ సేవల కోసం బ్యాంక్‌కు వెళ్లక్కర్లేదు!

ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల కస్టమర్లకు ఆన్‌లైన షాపింగ్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్లు, హోటల్ బుకింగ్స్ వంటివి సులభతరం కానున్నాయి. ప్రస్తుతం యూపీఐ కస్టమర్లు మ్యూచువల్ ఫండ్ సిప్ వంటి వాటి కోసం రికరింగ్ పేమెంట్లు చేయాల్సి ఉంది. నెట్‌ఫ్లిక్స్ , డిస్నీ హాట్‌స్టర్ వంటి ఓటీటీ సేవలకు, స్పోటిఫై, యాపిల్ మ్యూజివ్ వంటి మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులకు కూడా ఇదే వర్తిస్తుంది. ఇది యూపీఐ ఆటోపే ఫెసిలిటీ మాదిరి పని చేస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు భారీ షాక్.. బ్యాంక్ కీలక నిర్ణయం!

కాగా మర్చంట్లు బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకోవడానికి కచ్చితంగా సంబంధిత బ్యాంక్ అకౌంట్ దారుడి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి లభించిన తర్వాత బ్యాంక్ అకౌంట్ కలిగిన వ్యక్తి నిర్దేశించిన లిమిట్ వరకు మర్చంట్లు డబ్బులు పలు మార్లు కట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మర్చంట్లు కస్టమర్ నుంచి అనుమతి పొందిన తర్వాత ఒకేసారి డబ్బులు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే.. పలు మార్లు డబ్బులు కట్ చేసుకోవచ్చు.

ఉదాహరణకు మీరు హోటల్‌లో రూమ్ బుకింగ్ చేసుకోవాలని భావిస్తే.. ముందుగా బుకింగ్ అమౌంట్ చెల్లిస్తారు. తర్వాత రూమ్ నుంచి వెళ్లేటప్పుడు మళ్లీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే కొత్త ఫెసిలిటీ అందుబాటులోకి వస్తే.. హోటల్ యూపీఐ ద్వారా డబ్బులు పొందేందుకు మ్యాండేట్‌ను క్రియేట్ చేయొచ్చు. అంటే మీరు రెండోసారి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. ఆటోమేటిక్‌గానే డబ్బులు కట్ అవుతాయి. అలాగే మరో ఉదాహరణ చూస్తే.. మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలని అనుకుంటున్నారు. మీరు కొంత మొత్తాన్ని షాపింగ్ కోసం బ్లాక్ చేస్తే.. ఆ షాపింగ్ వెబ్‌సైట్ మీరు షాపింగ్ చేసిన ప్రతి సారీ మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకుంటుంది.

First published:

Tags: Banks, Rbi, Reserve Bank of India, UPI, Upi payments

ఉత్తమ కథలు