RBI Rules: బ్యాంక్ లాకర్స్ విషయంలో ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు.. కస్టమర్లు దృష్టి సారించాలంటున్న బ్యాంకులు

ప్రతీకాత్మక చిత్రం

లాకర్ సదుపాయాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. లాకర్ల కేటాయింపు కోసం బ్రాంచ్‌ల వారీగా ఖాళీ లాకర్ల జాబితాతో పాటు వెయిట్-లిస్టును మెయింటైన్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది.

  • Share this:
లాకర్ సదుపాయాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. లాకర్ల కేటాయింపు కోసం బ్రాంచ్‌ల వారీగా ఖాళీ లాకర్ల జాబితాతో పాటు వెయిట్-లిస్టును మెయింటైన్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. లాకర్ల కేటాయింపులలో పారదర్శకత పెంచేలా ఆర్‌బీఐ బ్యాంక్ లాకర్ల మార్గదర్శకాలను సవరించింది. ఈ సవరించిన సూచనలు 2022 జనవరి1 నుంచి అమలులోకి వస్తాయని ఆర్‌బీఐ వెల్లడించింది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు శాఖల వారీగా ఖాళీ లాకర్ల జాబితాను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (CBS) లో వెయిట్-లిస్ట్ ను మెయింటైన్ చేయాలి. లేదా ఆర్‌బీఐ జారీ చేసిన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌కు లోబడి ఉన్న ఏదైనా ఇతర కంప్యూటరైజ్డ్ సిస్టమ్‌లో వెయిట్-లిస్టును పేర్కోవాలి. లాకర్ల కేటాయింపుతో సహా లాకర్ల కేటాయింపులో పారదర్శకతను నిర్ధారించడమే కొత్త సూచనల ఉద్దేశమని ఆర్‌బీఐ తెలిపింది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు లాకర్ల కేటాయింపు కోసం అన్ని దరఖాస్తుల రసీదును అంగీకరించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. ఒకవేళ కేటాయింపు కోసం లాకర్‌లు అందుబాటులో లేనట్లయితే కస్టమర్‌లకు వెయిట్ లిస్ట్ నంబర్‌ను బ్యాంకులు అందిస్తాయని వివరించింది. CDD (కస్టమర్ డ్యూ డిలిజెన్స్) ప్రమాణాలకు పూర్తిస్థాయిలో లోబడి ఉన్న ప్రస్తుత బ్యాంకు కస్టమర్లు లాకర్ సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకుంటే.. సేఫ్ డిపాజిట్ లాకర్స్ పొందవచ్చని వ్యాఖ్యానించింది.

సేఫ్ డిపాజిట్ లాకర్‌లో లాకర్ అద్దెదారులు చట్టవిరుద్ధంగా లేదా ఏదైనా ప్రమాదకర వస్తువులను ఉంచరాదనే నిబంధనను బ్యాంకులు లాకర్ ఒప్పందంలో చేర్చాలని ఆర్‌బీఐ ఆదేశించింది. సేఫ్ డిపాజిట్ లాకర్‌లో ఎవరైనా కస్టమర్ చట్టవిరుద్ధమైన లేదా ప్రమాదకర వస్తువులు డిపాజిట్ చేసినట్లు అనుమానం వస్తే.. కస్టమర్‌పై తగిన చర్యలు తీసుకునే హక్కు బ్యాంకుకు ఉంటుందని పేర్కొంది.

లాకర్‌లో డిపాజిట్ చేసిన కస్టమర్ చనిపోతే..?
క్లెయిమ్‌ల పరిష్కారానికి బ్యాంకులు బోర్డు ఆమోదించిన విధానాన్ని అనుసరిస్తారని ఆర్‌బీఐ తెలిపింది. సేఫ్ లాకర్స్ లోని కంటెంట్‌లను నామినీకి అందించడానికి ఓ పాలసీని రూపొందించాలని బ్యాంకులను కోరింది. నామినీకి ఇతర వ్యక్తుల క్లెయిమ్‌ల నోటీసు నుంచి రక్షణ కోసం విధానాన్ని రూపొందించాలని సూచించింది. లాకర్‌లలోని కంటెంట్‌ను నిజమైన నామినీకి అందించేందుకు.. మరణ రుజువును ధ్రువీకరించడానికి.. తమ సొంత క్లెయిమ్ ఫార్మాట్‌లను రూపొందించుకోవాలని కోరింది. డిపాజిటర్ మరణించారని ధ్రువీకరించిన తర్వాత తేదీ నుంచి 15 రోజుల లోపే లాకర్‌లోని వస్తువులను బ్యాంకులు నామినీలకు విడుదల చేస్తాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
Published by:Krishna Adithya
First published: