Punjab National Bank పై RBI కొరడా...కోటి జరిమానా విధింపు...జరిగిన తప్పు ఇదే...

పిఎన్‌బి బ్యాంక్ లిమిటెడ్. కేంద్ర బ్యాంకు అయిన RBI అనుమతి పొందకుండానే భూటాన్ (బ్యాంక్ అంతర్జాతీయ అనుబంధ సంస్థ)తో ద్వైపాక్షిక షేర్డ్ ఎటిఎం వ్యవస్థను నిర్వహిస్తోంది. RBI తరచుగా ఇలాంటి బ్యాంకులపై జరిమానాలు విధిస్తుందని నిపుణులు అంటున్నారు.

news18-telugu
Updated: November 14, 2020, 10:18 PM IST
Punjab National Bank పై RBI కొరడా...కోటి జరిమానా విధింపు...జరిగిన తప్పు ఇదే...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
Payment and Settlement Systems చట్టాన్ని ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు(Punjab National Bank) ఒక కోటి రూపాయల జరిమానా విధించింది. స్టాక్ మార్కెట్లకు పంపిన కమ్యూనికేషన్‌లో, పిఎన్‌బి ఈ సమాచారం ఇచ్చింది. డ్రూక్ పిఎన్‌బి బ్యాంక్ లిమిటెడ్. కేంద్ర బ్యాంకు అయిన RBI  అనుమతి పొందకుండానే భూటాన్ (బ్యాంక్ అంతర్జాతీయ అనుబంధ సంస్థ)తో ద్వైపాక్షిక షేర్డ్ ఎటిఎం వ్యవస్థను నిర్వహిస్తోంది. RBI తరచుగా ఇలాంటి బ్యాంకులపై జరిమానాలు విధిస్తుందని నిపుణులు అంటున్నారు. నిబంధనలను పాటించనందుకు ఈ జరిమానా విధిస్తోంది. అయితే RBI విధించిన ఈ జరిమానా వినియోగదారులను ఏమాత్రం ప్రభావితం చేయదు. Payment and Settlement Systems చట్టం 2007 (పిఎస్ఎస్ చట్టం) లోని సెక్షన్ 26 (6) ను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ పిఎన్‌బికి రూ.కోటి జరిమానా విధించింది.

అంతేకాదు మార్కెట్లోని ఐదు పేమెంట్ ఆపరేటర్ల అధికారం ధృవీకరణను రద్దు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. రెగ్యులేటరీ అవసరాలకు అనుగుణంగా లేనందున కార్డ్ ప్రో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకాష్ మొబైల్ వాలెట్ సర్వీసెస్ ధృవీకరణ రద్దు చేసింది. అదే సమయంలో, ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ లిమిటెడ్, పైరో నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన సర్టిఫికేట్ రిటర్న్ చేసింది. ఇక ఎయిర్ సెల్ స్మార్ట్ మనీ ధృవీకరణ రద్దు చేసింది.

ఇదిలా ఉంటే ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ .50 లక్షల జరిమానా విధించినట్లు ఇటీవల ఆర్‌బిఐ తెలిపింది. కొన్ని గృహ రుణాలపై దాని సూచనలను పాటించనందుకు ఈ జరిమానా విధించబడింది.
Published by: Krishna Adithya
First published: November 14, 2020, 10:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading