Reserve Bank of India | బ్యాంకుల పెద్దన్న, దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ – RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఒక బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. దీంతో ఆ బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో బ్యాంక్ (Bank) కస్టమర్లు ఇకపై బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న పూర్తి డబ్బులను విత్‌డ్రా చేసుకోవడం కుదరదు. ఆర్‌బీఐ నిర్దేశించిన మొత్తాన్ని మాత్రమే పొందగలరు. అయితే అత్యవసర పరిస్థితుల్లో సడలింపు ఉంటుంది.
ఆర్‌బీఐ తాజాగా తమిళనాడు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ముసిరి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై కొరడా ఝుళిపించింది. ఆంక్షలు విధించింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితులు దిగజారి పోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆరు నెలల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. అలాగే బ్యాంక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వస్తామని, అందుకు అనుగుణంగా ఆంక్షల సడలింపు ఉండొచ్చని తెలిపింది.
బంగారం కొనాలనుకుంటున్నారా? ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్, కేంద్రం కీలక ప్రకటన!
రిజర్వు బ్యాంక్ ఆంక్షల నేపథ్యంలో బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారు కేవలం రూ. 5 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకోగలరు. అంతేకాకుండా ఆర్‌బీఐ అనుమతి లేకుండా బ్యాంక్ కస్టమర్లకు రుణాలు ఇవ్వకూడదు. అలాగే ఇతర ఏ ఇన్వెస్ట్‌మెంట్లు చేయకూడదు. ఇంకా ఎలాంటి పేమెంట్లు కూడా నిర్వహించకూడదు. ఇంకా ప్రాపర్టీలను విక్రయించడం చేయకూడదు. బ్యాంక్ ఏ పని చేయాలన్నా కచ్చితంగా ఆర్‌బీఐ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకుల పని దినాలు, పని వేళల్లో మార్పు?
అయితే బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. వారి డబ్బుకు ఎలాంటి ఢోకా లేదని తెలిపింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుందని వెల్లడించింది. అంటే బ్యాంక్ అకౌంట్‌లో రూ. 5 లక్షల వరకు కలిగిన వారికి ఇబ్బంది లేదు. పూర్తి డబ్బులు వెనక్కి వస్తాయి. అలాగే ఎవరైనా ఎఫ్‌డీలో రూ. 5 లక్షలు దాచుకున్నా కూడా పూర్తి డబ్బులు పొందొచ్చు. అయితే రూ. 5 లక్షలు దాటితే మాత్రం అప్పుడు రూ. 5 లక్షల వరకే వెనక్కి వస్తాయి.
అందువల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారు ఇలాంటి విషయాలను గుర్తించుకోవాలి. ప్రముఖ బ్యాంకుల్లోనే డబ్బులు డిపాజిట్ చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా రూ. 5 లక్షల వరకే డబ్బులు ఎఫ్‌డీ చేసుకోవడం ఉత్తమం. ఎక్కువ డబ్బులు ఉంటే వేరే బ్యాంక్‌లో లేదంటే మీ భాగస్వామి పేరుతో ఆ డబ్బులను ఎఫ్‌డీ చేసుకోవచ్చు. ఇబ్బంది ఉండదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank news, Banks, Rbi, Reserve Bank of India