RBI: ముథూట్, మణప్పురం ఫైనాన్స్ కంపెనీలకు ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా

గోల్డ్ లోన్ కంపెనీలు ముథూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RESERVE BANK OF INDIA ) షాక్ ఇచ్చింది.

news18-telugu
Updated: November 20, 2020, 7:45 PM IST
RBI: ముథూట్, మణప్పురం ఫైనాన్స్ కంపెనీలకు ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఫైల్ ఫొటో)
  • Share this:
గోల్డ్ లోన్ కంపెనీలు ముథూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RESERVE BANK OF INDIA
) షాక్ ఇచ్చింది. ఆ రెండు కంపెనీలకు భారీగా జరిమానా విధించింది. ఆర్‌బీఐ నిర్ధేశించిన నిబంధనలు ఉల్లంఘించినందకు గానూ ఈ నిర్ణయం తీసుకుంది. ముథూట్ ఫైనాన్స్‌కు రూ. 10 లక్షలు, మణప్పురం ఫైనాన్స్‌కు రూ. 5 లక్షలు జరిమానా విధించినట్టు వెల్లడించింది. బంగారంపై రుణాలు ఇస్తున్న సమయంలో ఆర్బీఐ మార్గదర్శకాలలోని లోన్ టూ వాల్యూ రేషియోను పాటించకపోవడం, రూ. 5 లక్షల కంటే ఎక్కువ రుణం మంజూరు చేసేటప్పుడు ఆర్బీఐ నిబంధనల ప్రకారం రుణ గ్రహీత పాన్ కార్డు కాపీని పొందకపోవడంతో ముథూట్ ఫైనాన్స్‌కు జరిమానా విధించినట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

"2018 మార్చి 31, 2019 మార్చి 31 నాటి ముథూట్ ఫైనాన్స్ ఆర్థిక స్థితిగతులను చూసినప్పుడు పైన చెప్పిన రెండు మార్గదర్శకాలకు పాటించడం లేదని తేలింది. ముందుగా ఆర్బీఐ జారీచేసిన ఆదేశాలు పాటించడంలో విఫలమైనందుకు ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వాల్సిందిగా ఆ కంపెనీకి నోటీసులు జారీ చేయడం జరిగింది. అందుకు కంపెనీ ఇచ్చిన సమాధానం, వ్యక్తిగత విచారణలు, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించాం. అయితే వారు సమర్పించిన ఆధరాలు సక్రమంగా లేవు. ఈ క్రమంలోనే కంపెనీపై ఆరోపణలు నిరూపితం కావడంతో వారికి జరిమానా విధించాం" ఆర్బీఐ పేర్కొంది.

ఇక, బంగారు ఆభరణాల ఓనర్‌షిప్ వెరిఫికేషన్ చేయడంలో తమ మార్గదర్శకాలు పాటించనందుకు ముణప్పురం ఫైనాన్స్‌కు జరిమానా విధించినట్టు ఆర్బీఐ మరో ప్రకటనలో తెలిపింది. 2019 మార్చి 31 నాటి ముణప్పురం ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తే ఆర్బీఐ మార్గదర్శకాలు పాటించలేదని తేలిందని ఆర్బీఐ పేర్కొంది.
Published by: Sumanth Kanukula
First published: November 20, 2020, 7:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading