రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank Of India) దృష్టికి రాకుండా కొన్ని బ్యాంకులు ట్రాన్సాక్షన్లు(Transactions), లోన్(Loan)లకు సంబంధించిన వివరాలు దాచే ప్రయత్నాలు చేస్తుంటాయి. కానీ ఆర్బీఐ నిఘా నుంచి ఏ బ్యాంకు తప్పించుకోలేదు. తాజాగా ఇలా నిబంధనలు ఉల్లంఘించిన మూడు సహకార బ్యాంకులపై ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. ఈ జాబితాలో ఛత్తీస్‌గఢ్, రాయ్‌పూర్‌కు(Raipur) చెందిన నాగ్రిక్ సహకారి బ్యాంక్ మర్యాదిట్ బ్యాంకు, మరో రెండు సహకార బ్యాంకులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన ఆదేశాలను(RBI Regulations) పాటించకపోవడంతోనే ఈ చర్యలు తీసుకొంది.
ఎక్స్పోజర్ నిబంధనలు, చట్టబద్ధమైన/ఇతర పరిమితులు, కేవైసీ నియమాలపై అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు జారీ చేసిన ఆదేశాలను నగ్రిక్ సహకారి బ్యాంక్ మర్యాదిట్ ఉల్లంఘించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. దీంతో ఈ బ్యాంకుకు రూ.4.50 లక్షల జరిమానా విధించింది.
Multibagger Stock: ఇన్వెస్టర్ల పంట పండింది..11 నెలల్లోనే కోటీశ్వరులను చేసిన స్టాక్
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్- 1949, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్- 2014, కేవైసీలోని కొన్ని నిబంధనలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నాలో ఉన్న జిల్లా సహకార కేంద్రీయ బ్యాంక్ అతిక్రమించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఇందుకుగాను ఈ బ్యాంక్‌కు రూ.1 లక్ష జరిమానా విధించింది.
అదే విధంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్-1949, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్- 2014 నిబంధనలను పాటించలేదని తెలుపుతూ సత్నాలోని జిలా సహకారి కేంద్రీయ బ్యాంక్ మర్యాదిట్‌కు రూ.25,000 జరిమానా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించింది. ఈ జరిమానాలను బ్యాంకుల నియంత్రణ, పర్యవేక్షణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నియమాలను, నిబంధనలను సహకార బ్యాంకులు అతిక్రమించడంతోనే విధించారు. బ్యాంకులు తమ ఖాతాదారులకు అందించిన సేవలు, కుదిరిన ఒప్పందాలకు వీటికి సంబంధం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. అయితే ఈ పెనాల్టీలతో కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
Gold Price Today: గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. నగల కొనుగోలుకు ఇదే మంచి సమయమా?
కట్టడి చేసేందుకు చర్యలు
ఇటీవల పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్, డీహెచ్‌ఎఫ్‌ఎల్ కొన్ని ఖాతాల వివరాలను దాచాయి. ఇలాంటివి అప్పుడప్పుడూ చోటు చేసుకొంటూనే ఉన్నాయి. అందుకే బ్యాంకులపై పర్యవేక్షణ పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా కేంద్రాన్ని(Data Center) ఏర్పాటు చేసే యోచనలో ఉంది. దీని సాయంతో ఆర్‌బీఐ నేరుగా బ్యాంకుల వ్యవస్థల్లోకి వెళ్లి వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించే అవకాశం కలుగుతుంది. బ్యాంకుల సిస్టమ్స్‌లోని వివరాలను నేరుగా ఆర్బీఐ పర్యవేక్షించనుంది. క్రమంగా పట్టణ సహకార బ్యాంకులకు కూడా ఈ డేటా కేంద్రాన్ని విస్తరించేందుకు సన్నాహాలు చేయనున్నట్లు తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.