హోమ్ /వార్తలు /బిజినెస్ /

RBI: ఈ 5 బ్యాంకుల కస్టమర్లకు ఆర్బీఐ షాక్.. డబ్బులు విత్ డ్రాపై ఆంక్షలు.. వివరాలివే

RBI: ఈ 5 బ్యాంకుల కస్టమర్లకు ఆర్బీఐ షాక్.. డబ్బులు విత్ డ్రాపై ఆంక్షలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 5 సహకార బ్యాంకులపై పలు ఆంక్షలు విధించింది. ఈ పరిమితుల్లో డబ్బు విత్‌డ్రాపై కూడా నిషేధాలు చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 5 సహకార బ్యాంకులపై (Banks) పలు ఆంక్షలు విధించింది. ఈ పరిమితుల్లో డబ్బు విత్‌డ్రాపై కూడా నిషేధాలు చేసింది. ఈ బ్యాంకులపై ఆంక్షలు 6 నెలల పాటు కొనసాగుతాయని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. దీంతో ఈ బ్యాంకుల ఖాతాదారులు తమ ఖాతాలో డిపాజిట్ చేసిన డబ్బును ఉపసంహరించుకోలేని పరిస్థితి ఉంటుంది. మరోవైపు, ఈ బ్యాంకులు ఆర్‌బిఐ ముందస్తు అనుమతి లేకుండా ఎవరికీ కొత్త రుణం ఇవ్వలేవు లేదా రుణం తీసుకోలేవు. ఈ నిషేధం సమీక్షలో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అంటే బ్యాంకుల పనితీరును సమీక్షించిన తర్వాత మాత్రమే నిషేధాన్ని తొలగించడం లేదా పొడిగించడంపై నిర్ణయం ఉంటుంది. ఆర్‌బీఐ బ్యాంకుల ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డ‌తాయ‌ని భావిస్తే.. నిషేధం ఎత్తివేస్తుంది. ఈ బ్యాంకుల లైసెన్స్‌ను రద్దు చేయలేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధించిన ఐదు బ్యాంకుల్లో హెచ్‌సిబిఎల్ కోఆపరేటివ్ బ్యాంక్ లక్నో (యుపి), ఆదర్శ్ మహిళా నగరి కోఆపరేటివ్ బ్యాంక్ మర్యాదిత్ ఔరంగాబాద్ (మహారాష్ట్ర), షింషా కోఆపరేటివ్ బ్యాంక్ నియమిత మద్దూర్, (కర్ణాటక), ఉరవకొండ కోఆపరేటివ్ ఈ బ్యాంకులపై నిషేధం విధించింది రిజర్వ్ బ్యాంక్. టౌన్ బ్యాంక్ ఉరవకొండ, (ఆంధ్రప్రదేశ్), శంకర్రావ్ మోహితే పాటిల్ కోఆపరేటివ్ బ్యాంక్, అక్లూజ్ (మహారాష్ట్ర). HCBL సహకరి బ్యాంక్ లక్నో (UP), ఆదర్శ్ మహిళా నగరి సహకారి బ్యాంక్ మర్యాదిత్ ఔరంగాబాద్ (మహారాష్ట్ర), Shimsha Sahakara Bank నియమిత మద్దూర్, (కర్ణాటక) యొక్క కస్టమర్‌లు ప్రస్తుత ద్రవ్య కొరత కారణంగా తమ ఖాతాల నుండి డబ్బును విత్‌డ్రా చేయలేరు.

PM Kisan 13th Installment: రైతులకు మోదీ గుడ్ న్యూస్.. మరో రెండు రోజుల్లో ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు.. డేట్ ఇదే?

ఉరవకొండ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్, ఉరవకొండ, (ఆంధ్రప్రదేశ్) మరియు శంకర్‌రావ్ మోహితే పాటిల్ సహకరి బ్యాంక్, అక్లూజ్ (మహారాష్ట్ర) ఖాతాదారులు ఇప్పుడు తమ బ్యాంకు డిపాజిట్ల నుండి రూ. 5,000 వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. అంటే ఖాతాదారుడి ఖాతాలో జమ చేసిన మొత్తంతో సంబంధం లేకుండా, వారు తమ ఖాతా నుంచి రూ.5,000 మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.

First published:

Tags: Banks, Rbi, Reserve Bank of India

ఉత్తమ కథలు