• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • RBI HIKES PAYMENTS BANK DEPOSIT LIMIT HIKED TO RS 2 LAKH HERE FULL DETAILS NS GH

Payments Bank Deposit: పేమెంట్స్​​ బ్యాంక్​ కస్టమర్లకు RBI గుడ్​న్యూస్​.. డిపాజిట్​ లిమిట్​ పెంపు.. పూర్తి వివరాలివే..

Payments Bank Deposit: పేమెంట్స్​​ బ్యాంక్​ కస్టమర్లకు RBI గుడ్​న్యూస్​.. డిపాజిట్​ లిమిట్​ పెంపు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

పేటీఎం, ఎయిర్​టెల్​ వంటి డిజిటల్​ పేమెంట్స్​ బ్యాంకుల్లో డిపాజిట్​ పరిమితిని పెంచుతూ రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
మీకు డిజిటల్ పేమెంట్స్ బ్యాంకుల్లో అకౌంట్​ ఉందా? అయితే, మీకో గుడ్​న్యూస్​. పేటీఎం, ఎయిర్​టెల్​ వంటి డిజిటల్​ పేమెంట్స్​ బ్యాంకుల్లో డిపాజిట్​ పరిమితిని పెంచుతూ రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పేమెంట్​ బ్యాంక్​ డిపాజిట్​ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల చిన్న తరహా వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. అంతకు ముందు లక్ష రూపాయల డిపాజిట్​ లిమిట్ ​మాత్రమే ఉండటంలో చిన్న తరహా వ్యాపారులు ఇబ్బందులు పడేవారని.. తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారికి మేలు జరుగుతుందన్నారు. కాగా, ఈ డిపాజిట్​ లిమిట్​ పెంచాలని పేమెంట్స్​ బ్యాంక్స్​ ఎప్పటి నుంచో ఆర్​బీఐని కోరుతున్నాయి. ఎట్టకేలకు ఆర్​బీఐ ఆయా బ్యాంకులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.

కాగా, ఆర్​బీఐ తాజాగా నిర్వహించిన పాలసీ సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా విజృంభన నేపథ్యంలో రెపో రేటు, వడ్డీ రేట్లు, రివర్స్​ రెపో రేటు యథాతధంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఉన్న రెపోరేటు 4 శాతం, రివర్స్​ రెపోరేటు 3.35 శాతం అలాగే కొనసాగనున్నాయి. ప్రస్తుతం దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి.. కొన్ని చోట్ల లాక్​డౌన్​ ఆంక్షల నేపథ్యంలో రెపో రేటుపై యథాతధ స్థితిని కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది.

ఆర్​బీఐ తన సమీక్షా సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకు కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఆర్టీజీఎస్​, నెఫ్ట్ (NEFT) సేవలను ఇప్పుడు నాన్​బ్యాంకింగ్​ కస్టమర్లకు కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. పేమెంట్​ బ్యాంక్స్​ అన్నీ నాన్​ బ్యాంకింగ్​ సెక్టార్​ కిందికే వస్తాయి. కాబట్టి, ఆయా కస్టమర్లకు ఇది గుడ్​ న్యూస్​ అనే చెప్పవచ్చు. కాగా, దేశంలో కరోనా విజృంభన నేపథ్యంలో డిజిటల్​ పేమెంట్స్​ను ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్​బీఐ స్పష్టం చేసింది.

దీంతో, నాన్​బ్యాంకింగ్​ సిస్టమ్​ ఆపరేటర్లు కూడా ఇకపై నెఫ్ట్​, ఆర్టీజీఎస్​ సేవలను పొందవచ్చు. వారు ఇక నుంచి ప్రీపెయిడ్​ పేమెంట్​ ఇన్​స్ట్రుమెంట్​ పీపీఐ, కార్డు నెట్​వర్క్స్​, వైట్​ లేబుల్​ ఏటీఎం ఆపరేటర్లు, ట్రేడ్​ రిసీవబుల్స్​ డిస్కౌంటింగ్​ సిస్టమ్​ ఫ్లాట్​ఫామ్స్​ కూడా నెఫ్ట్​, ఆర్టీజీఎస్​ మనీ ట్రాన్స్​ఫర్​ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు, రైతులకు వ్యవసాయ రుణాన్ని ప్రోత్సహించాలని ఆర్​బీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రాధాన్యత రంగ రుణాల (పిఎస్‌ఎల్) కింద రుణ పరిమితిని రూ .50 లక్షల నుంచి రూ .75 లక్షలకు పెంచింది.
Published by:Nikhil Kumar S
First published: