హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gpay Dispute: గూగూల్‌పే చెల్లింపులు సుర‌క్షిత‌మేనా? ఇన్నాళ్లు లేని ఈ డౌట్ ఇప్పుడెందుకొచ్చిందంటే..

Gpay Dispute: గూగూల్‌పే చెల్లింపులు సుర‌క్షిత‌మేనా? ఇన్నాళ్లు లేని ఈ డౌట్ ఇప్పుడెందుకొచ్చిందంటే..

Google Pay: గూగుల్‌ పే (ప్రతీకాత్మక చిత్రం)

Google Pay: గూగుల్‌ పే (ప్రతీకాత్మక చిత్రం)

గూగూల్ మొబైల్ పేమెంట్ యాప్‌ అయిన గూగూల్ పే (జీపే).. ఆర్‌బీఐ అధికారిక అనుమ‌తి లేకుండానే ఆర్థిక వ్య‌వ‌హారాలు నిర్వ‌హిస్తోంద‌ని ఆర్థిక వ్య‌వ‌హారాల నిపుణుడు అభిజిత్ మిశ్రా ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు.

ఇంకా చదవండి ...

గూగూల్ మొబైల్ పేమెంట్ యాప్‌ అయిన గూగూల్ పే (జీపే).. ఆర్‌బీఐ అధికారిక అనుమ‌తి లేకుండానే ఆర్థిక వ్య‌వ‌హారాలు నిర్వ‌హిస్తోంద‌ని ఆర్థిక వ్య‌వ‌హారాల నిపుణుడు అభిజిత్ మిశ్రా ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు. గూగుల్ పే పేమెంట్ సిస్ట‌మ్‌లా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, ఇది పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్స్ యాక్ట్‌కు విరుద్ధ‌మ‌ని ఆయన తెలిపారు. ఇలాంటి కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేందుకు దానికి ఆర్‌బీఐ నుంచి ఎటువంటి అనుమ‌తులు లేవ‌ని త‌న పిల్‌లో ఆరోపించారు. ఎన్‌పీసీఐ మార్చి 20, 2019లో విడుద‌ల చేసిన అధికారిక పేమెంట్స్ సిస్ట‌మ్స్ ఆప‌రేట‌ర్ల జాబితాలో గూగూల్ పే పేరు లేక‌పోవ‌డాన్ని కూడా ఆయ‌న కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు.

ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా ఆర్‌బీఐ ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన స‌మాధానం.. గూగుల్ పే యూజ‌ర్ల‌ను, సాధార‌ణ ప్ర‌జానీకాన్ని గంద‌ర‌గోళంలోకి నెట్టింది. గూగూల్ పే అనేది ఒక యాప్‌. అది కేవ‌లం మ‌న చెల్లింపుల‌కు ఒక వాహ‌కంగా మాత్ర‌మే ప‌నిచేస్తుంది త‌ప్ప‌, దానంత‌ట అదే చెల్లింపుల కార్య‌కలాపాలు నిర్వ‌హించ‌దు. ఇది పేమెంట్ ఆప‌రేట‌ర్ కాదు.

హైకోర్టుకు ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే...

గూగూల్ పే అనేది ఒక థ‌ర్డ్ పార్టీ యాప్ ప్రొవైడ‌ర్ మాత్ర‌మే. అది ఎటువంటి పేమెంట్ సిస్ట‌మ్స్‌ను నిర్వ‌హించ‌డం లేదని ఆర్‌బీఐ చెప్పింది. దీంతో ఈ స్టేట్‌మెంట్ కొంత గంద‌ర‌గోళానికి దారితీసింది. దీనివ‌ల్ల గూగూల్ పే చ‌ట్ట‌బ‌ద్ధ‌మైనది కాద‌ని, జీపే ద్వారా కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ రిస్క్ తో కూడుకున్న‌ద‌ని కొంద‌రు న‌మ్ముతున్నారు. ఈ నేప‌థ్యంలో గూగూల్ పే ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

గూగూల్ పే ఏం చెబుతోంది..?

‘గూగూల్ పే పూర్తిగా చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన‌ది. యుపిఐ ద్వారా చెల్లింపులు జ‌రిపేందుకు గూగూల్ పే త‌న బ్యాంకు పార్ట్నర్ల‌కు కేవ‌లం సాంకేతిక సేవల‌ను మాత్ర‌మే అందిస్తుంది..యుపిఐ యాప్‌ల‌ను థ‌ర్డ్ పార్టీ యాప్‌లుగా విభ‌జించారు. వాటికి పేమెంట్ సిస్ట‌మ్ ఆప‌రేటర్ కావాల్సిన అవ‌స‌రం లేదు. గూగూల్ పే ద్వారా చేసే చెల్లింపుల‌న్నీ ఆర్‌బీఐ, ఎన్‌సీపీఐ నియ‌మాల‌ను అనుస‌రించి జ‌రుగుతాయి. అందువ‌ల్ల అవ్వ‌న్నీ పూర్తిగా సుర‌క్షిత‌మైన‌వి. ఈ విష‌యంలో ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్తినా 24గంట‌లూ అందుబాటులో ఉండే గూగూల్ పే క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ సెంట‌ర్ల ద్వ‌రా యూజ‌ర్లు ప‌రిష్క‌రించుకోవ‌చ్చు’ అని కోరింది.

అయితే ఆర్‌బీఐ చేసిన ప్ర‌క‌ట‌న‌కు కొందరు సోషల్ మీడియాలో త‌ప్పుడు భాష్యాలు ఆపాదిస్తున్నారు... గూగూల్ పే యాప్ గుర్తింపు లేనిద‌ని, దాని ద్వారా చేసే మ‌నీ పేమెంట్స్ సుర‌క్షితం కాద‌ని చెబుతున్నారు. ‘ఇది పూర్తిగా అవాస్త‌వం. కావాలంటే ఎన్‌పీసీఐ వెబ్సైట్‌లో చెక్ చేసుకోవ‌చ్చు. ఆర్బీఐ కోర్టు హియ‌రింగ్‌లో కానీ, లిఖిత‌పూర్వకంగా ఇచ్చిన స‌మాధానం లోకానీ ఎక్క‌డా ఇలా ప్ర‌స్తావించ‌లేదు. అందుకే గూగూల్ కార్య‌క‌లాపాలు పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్ట‌మ్‌యాక్ట్ 2007ను ఉల్లంఘించ‌డంలేదు’ అని ఆర్‌బీఐ కోర్టుకు తెలిపింది.

నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా ఆథ‌రైజ్డ్ పేమేంట్ సిస్ట‌మ్ ఆప‌రేట‌ర్స జాబితాలో గూగూల్ పే లేద‌ని కూడా ఆర్‌బీఐ కోర్టుకు నివేదించింది. యూజ‌ర్లు ఈ విష‌యంలో గంద‌ర‌గోళానికి గురికావాల్సిన ప‌నిలేదు. జీపే ద్వారా చేసే చెల్లింపుల‌న్నీ సుర‌క్షిత‌మైన‌వి, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన‌వని గూగూల్ ప్ర‌క‌ట‌న పేర్కొంది. ఇక ఈ వ్య‌వ‌హారం థ‌ర్డ్ పార్టీ యాప్‌ల‌న్నింటినీ ప్ర‌భావితం చేసేది కాబ‌ట్టి.. దీనిపై లోతైన విచార‌ణ అవ‌స‌ర‌మ‌ని భావిస్తూ హైకోర్టు ఈ కేసును జులై 22వ తేదీకి వాయిదా వేసింది.

Published by:Sambasiva Reddy
First published:

Tags: Delhi High Court, Google pay, Money Transfer, Rbi

ఉత్తమ కథలు