RBI HARBINGER 2021 HACKATHON RESERVE BANK OF INDIA LAUNCHES FIRST GLOBAL HACKATHON WITH SMARTER DIGITAL PAYMENTS THEME SS
RBI Hackathon: ఈ 4 సమస్యలకు పరిష్కారం చెప్తే రూ.40 లక్షల బహుమతి
RBI Hackathon: ఈ 4 సమస్యలకు పరిష్కారం చెప్తే రూ.40 లక్షల బహుమతి
(ప్రతీకాత్మక చిత్రం)
RBI HARBINGER 2021 Hackathon | హ్యాకథాన్‌లో పార్టిసిపేట్ చేయాలనుకునేవారికి అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తొలి హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. రూ.40 లక్షల వరకు ప్రైజ్ మనీ ప్రకటించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (RBI) తొలిసారిగా గ్లోబల్ హ్యాకథాన్ ప్రకటించింది. 'HARBINGER 2021' పేరుతో ఈ హ్యాకథాన్ నిర్వహిస్తోంది. స్మార్ట్ డిజిటల్ పేమెంట్స్ థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ హ్యాకథాన్‌లో (Hackathon) పాల్గొనాలని ఔత్సాహికుల్ని ఆహ్వానిస్తోంది ఆర్బీఐ. ఇప్పటివరకు డిజిటల్ పేమెంట్స్ ఉపయోగించనివారికి ఈ పేమెంట్స్ విధానం చేరువ చేసేందుకు కావాల్సిన పరిష్కారాలను ఈ హ్యాకథాన్‌లో సూచించాల్సి ఉంటుంది. చెల్లింపుల్ని సులభతరం చేయడం, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడం, డిజిటల్ చెల్లింపుల్లో భద్రతను పటిష్టం చేయడం, కస్టమర్ల డేటాకు రక్షణను పెంచడం లాంటి అంశాలపై సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆసక్తిగలవారు 2021 నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు.
RBI HARBINGER 2021 Hackathon: ఎవరు అప్లై చేయొచ్చు?
పైన సూచించిన అంశాలకు పరిష్కారాలు సూచించే ఐడియాలు ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. వ్యక్తిగతంగా లేదు ఓ బృందంగా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. సంస్థలు కూడా ఈ హ్యాకథాన్‌లో పాల్గొనొచ్చు. హ్యాకథాన్‌లో పాల్గొనేవారు ఈ నాలుగు అంశాలకు పరిష్కారాలను సూచించాల్సి ఉంటుంది. ఇండస్ట్రీ నిపుణుల నుంచి పర్యవేక్షణ ఉంటుంది. ఆ పరిష్కారాలను జ్యూరీ ఎదుట ప్రదర్శించాల్సి ఉంటుంది. గెలిచినవారికి రూ.40 లక్షల బహుమతి లభిస్తుంది. రన్నరప్‌గా నిలిచినవారికి రూ.20 లక్షలు లభిస్తాయి. హ్యాకథాన్‌లో పాల్గొనాలనుకునేవారు https://fintech.rbi.org.in వెబ్సైట్లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. 2021 నవంబర్ 15న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.