రంగంలోకి దిగిన ఆర్బీఐ...బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్

ఇటీవల రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ...ఇది బ్యాంకు వినియోగదారులకు బదలాయింపు చేయాలని ఆదేశించేందుకు ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకర్లతో సమావేశంకానుంది.

news18-telugu
Updated: February 18, 2019, 3:07 PM IST
రంగంలోకి దిగిన ఆర్బీఐ...బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్
శక్తికాంతదాస్ (Image:ANI)
  • Share this:
ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేటును ఇటీవల తగ్గించడం తెలిసిందే. తగ్గించింది. రెపో రేటు (బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణంపై వడ్డీ రేటు)ను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతో ఇది 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగివచ్చింది. రెపో రేటును ఆర్బీఐ తగ్గించినా...ఆ మేరకు ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకర్లు రుణగ్రహీతల నుంచి వసూలు చేస్తున్న వడ్డీరేట్లను యధాతథంగానే కొనసాగిస్తున్నాయి. దీనిపై రుణగ్రహీతల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆర్బీఐ రంగంలోకి దిగింది. రెపో రేటు తగ్గించడంతో వినియోగదారుల రుణాలపై వడ్డీ రేటును తగ్గించాలని ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలివ్వనుంది.

దీని కోసం ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులతో ఈ నెల 21న సమావేశంకానున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయం ద్వారా దక్కాల్సిన లబ్ధి...వినియోగదారులకు బదలాయింపు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్బీఐ రెపో రేటును తగ్గించడంతో ఆ మేరకు వినియోగదారుల రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాలని కోరనున్నారు. ఆర్బీఐ రంగంలోకి దిగడంతో బ్యాంకుల రుణాలపై వడ్డీరేట్లు తగ్గి వినియోగదారులకు కాస్త ఊరట లభించే అవకాశం ఉంది.
First published: February 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading