Shaktikanta Das: సాధారణ స్థితి వైపుగా దేశ ఆర్థిక వ్యవస్థ..ఆర్బీఐ గవర్నర్

RBI Governor Shaktikanta Das | ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. దీని కోసమే కీలక వడ్డీ రేట్లను తగ్గించినట్లు చెప్పారు.

news18-telugu
Updated: July 11, 2020, 12:01 PM IST
Shaktikanta Das: సాధారణ స్థితి వైపుగా దేశ ఆర్థిక వ్యవస్థ..ఆర్బీఐ గవర్నర్
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
  • Share this:
గత వందేళ్లలో మునుపెన్నడూ లేని సంక్షోభ పరిస్థితులను ప్రస్తుతం ఎదుర్కొంటున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఎస్బీఐ బ్యాంకింగ్, ఎకనమిక్ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ..దేశ వ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు ఉన్నాయన్నారు. ఉపాధి, ఇతర రంగాలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభం దేశ ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతకు గట్టి పరీక్ష పెడుతోందన్నారు. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కోవిడ్-19 కారణంగా బ్యాకింగ్ రంగంపై ఏర్పడిన ప్రతికూల పరిస్థితులపై అధ్యయనం చేయాలని అన్ని బ్యాంకులను ఆదేశించినట్లు చెప్పారు.

లాక్‌డౌన్ నిబంధల సడలింపుల తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి మళ్లీ సాధారణ పరిస్థితులకు చేరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. అయితే డిమాండ్-సప్లై చైన్ పూర్తిగా మునుపటి స్థితికి చేరేందుకు ఎంత కాలం పడుతుందో వేచిచూడాల్సి ఉందన్నారు.




కరోనా కష్టకాలంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం తమ ప్రధాన ధ్యేయమన్నారు. దీన్ని నియంత్రణలో ఉంచే లక్ష్యంతోనే కీలక వడ్డీ రేట్లను తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వివరించారు.
Published by: Janardhan V
First published: July 11, 2020, 12:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading