RBI Governor Q&A: వరుసగా రెపోరేట్లు పెంచుతూ వస్తున్న ఆర్బీఐ(RBI) మరోసారి అదే బాటలో నడిచింది. అయితే గతంలో వరుసగా మూడుసార్లు 50 బేసిస్ పాయింట్లు(Basin points) పెంచగా.. ఇప్పుడు 35 బేసిస్ పాయింట్లకు పరిమితం అయింది. కాస్తంత ఉపశమనం కలిగింది. డిసెంబర్ 7న ఇండియా రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ(MPC) రెపో రేటును 35 bps పెంచడంతో రెపో 6.25 శాతానికి చేరింది. వరుసగా 10 నెలల పాటు సెంట్రల్ బ్యాంక్ కంఫర్ట్ జోన్ కంటే ఎక్కువగా ఉన్న ద్రవ్యోల్బణంపై పోరాటాన్ని స్పష్టం చేసింది. పాలసీ విలేకరుల సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడారు. ద్రవ్యోల్బణం, డిజిటల్ రూపీ, రేట్ల పెంపు వంటి అనేక అంశాలపై మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.
భవిష్యత్తులో రేట్ల పెంపు గురించి
మనం అనిశ్చిత ప్రపంచంలో జీవిస్తున్నాం. ఔట్‌కమ్ మా అంచనాలకు సరిపోకపోతే మేము ఏం చేస్తాం. ఈ దశలో దాని గురించి మాట్లాడటం సాధ్యం కాదు. మేము ఓవరాల్ ఔట్‌లుక్‌ను మానిటర్ చేస్తూనే ఉంటాం.
ప్రధాన ద్రవ్యోల్బణం(Core Inflation)పై ఆర్బీఐ ఆలోచన
ప్రధాన ద్రవ్యోల్బణం గురించి ఇంతకుముందు కూడా మాట్లాడాం. కానీ గత ఆరు, ఏడు నెలలుగా ప్రధాన ద్రవ్యోల్బణం దాదాపు 6 శాతం వద్ద ఉంది. అదే నేను చెప్పాను. ఈ సమస్యను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ద్రవ్యోల్బణం గురించి విశ్లేషిస్తున్నప్పుడు దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
US ఫెడ్ రేట్లు, భారత్‌పై ప్రభావం
యూఎస్ ఫెడ్ రేట్లు మొత్తం ప్రపంచానికి, భారతదేశానికి కూడా ప్రధానం. ఎందుకంటే ఇది చాలా అంశాలను, ముఖ్యంగా కరెన్సీ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంది. కానీ మా విధానాలు ప్రాథమికంగా దేశంలోని పరిస్థితుల ఆధారంగానే ఉంటాయి.
ఇండియా వృద్ధి, ద్రవ్యోల్బణం
మేము ఫెడ్ పాలసీ రేటును చూసి మా నిర్ణయం తీసుకునే సందర్భం కాదు. దేశంలోని అంశాల ఆధారంగా మానిటరీ పాలసీ రేటుపై మా నిర్ణయాలు తీసుకుంటాం.
గ్లోబల్ మ్యాప్‌లో భారతదేశం బ్రైట్ స్పాట్
బ్రైట్ స్పాట్ అనేది ఆర్బీఐ ప్రస్తావించిన మాట కాదు.. ఇది IMF భారతదేశం గురించి మాట్లాడుతూ చెప్పింది. అనిశ్చితి ప్రపంచంలో ఇండియా స్థిరంగా కనిపిస్తోంది.
వాస్తవానికి ప్రపంచం నుంచి పూర్తిగా విడిపోయి ఉండలేం. ప్రపంచ పరిస్థితుల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కానీ ఇండియా స్థిరంగా నిలబడగలదు. స్పిల్ ఓవర్స్ భారతదేశంతో సహా అన్ని అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి.
ఆర్థిక వృద్ధిపై ఆర్బీఐ యాంటి ఇన్ఫ్లేషన్ ప్రభావం
వృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరత్వాన్ని కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తోంది. ప్రభుత్వానికి సహజంగానే వృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. కొత్త టెక్నాలజీ ఆవిష్కరణల వల్ల పెట్టుబడికి వచ్చే అవకాశాలను నేను ప్రస్తావించాను. క్లైమేట్ ఛేంజ్‌లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి కూడా మాట్లాడాను. పెట్టుబడులకు మంచి అవకాశం ఉన్న PLI గురించి కూడా వివరించాను.
ద్రవ్యోల్బణం నిర్వహణ(Inflation Management) ఎందుకు ప్రధానం
ద్రవ్యోల్బణం నిర్వహణ అనేది దాని సొంత ప్రయోజనాల కోసం మాత్రమే కాదు. ధర స్థిరత్వం అంశం చాలా అవసరం. ఎందుకంటే అది ప్రజల వృద్ధికి అవసరం. ప్రజల మీడియం టర్మ్ వృద్ధికి అవసరం. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే, పెట్టుబడిదారులు పెట్టుబడిని నిలిపివేస్తారు. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని మేనేజ్ చేయాలి. వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరత్వాన్ని కొనసాగించాలి. ఈ రెండింటి మధ్య ఎటువంటి వైరుధ్యం లేదు.
CBDC(సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ), UPI మధ్య ప్రధాన వ్యత్యాసం
UPI, CBDC మధ్య తేడా ఏంటని చాలా మంది RBIని అడుగుతున్నారు. ఏదైనా UPI లావాదేవీలో బ్యాంక్ ప్రమేయం ఉంటుంది. UPI యాప్‌ని ఉపయోగించినప్పుడు, సంబంధిత బ్యాంక్‌కి మెసేజ్ వెళ్తుంది. CBDC పేపర్ కరెన్సీ లాంటిది. బ్యాంకుకు వెళ్లి, డిజిటల్ కరెన్సీని డ్రా చేసి మొబైల్ ఫోన్ వాలెట్లో ఉంచుకోవచ్చు. ఏదైనా దుకాణంలో లేదా మరో వ్యక్తికి పేమెంట్ చేసేటప్పుడు ఉపయోగించవచ్చు. సెండర్ వ్యాలెట్ నుంచి రీసీవర్ వ్యాలెట్లోకి డిజిటల్ కరెన్సీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందులో బ్యాంక్ ప్రమేయం ఉండదు.
పేపర్ కరెన్సీ vs డిజిటల్ కరెన్సీ చట్టబద్ధత
CBDCకి సంబంధించి ఆర్బీఐ చట్టంలో చేసిన సవరణ ప్రకారం కరెన్సీలో డిజిటల్ కరెన్సీ కూడా ఉంటుంది. అన్ని విధాలుగా చట్టం దృష్టిలో తేడా లేదు. పేపర్ కరెన్సీ, డిజిటల్ కరెన్సీ రెండే ఒకటే. ట్రాన్స్ఫర్ చేస్తున్న మనీ నిర్దిష్ట పరిమితి దాటితే, పాన్ కార్డ్ నంబర్ ఇవ్వాలి. CBDC విషయంలో కూడా అదే నియమాలు వర్తిస్తాయి, ఎందుకంటే రెండూ కరెన్సీలే.
బ్యాంక్ క్రెడిట్, డిపాజిట్ గ్రోత్ మధ్య అంతరాన్ని పెంచడం
ఆర్బీఐ బ్యాంకులకు క్రెడిట్ లేదా డిపాజిట్ వైపు వడ్డీ రేట్లకు సంబంధించి ఎలాంటి దిశానిర్దేశం చేయదు. క్రెడిట్ గ్రోత్, డిపాజిట్ గ్రోత్‌ని సరైన దృక్కోణంలో చూడాలి. క్రెడిట్ గ్రోత్ తక్కువ ప్రాతిపదికన ఉంది. డిపాజిట్ గ్రోత్ అధిక స్థాయిలో ఉంది. అందుకే రెండింటి మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. కరోనా సమయంలో ఎటువంటి క్రెడిట్ గ్రోత్ లేదు. ఇది దాదాపు 5 శాతం, 6 శాతం లేదా తక్కువ బేస్. కానీ మహమ్మారి మొదటి రెండేళ్లలో డిపాజిట్ గ్రోత్ పెరిగింది. కాబట్టి ఇప్పుడు డిపాజిట్ వైపు ఆధారపడి ఏమి జరిగినా, వృద్ధిని బేస్ ఎఫెక్ట్ నేపథ్యంలో చూడాలి. ఇప్పుడు బ్యాంకులు వారి అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ను చేస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rbi, Rbi governor