Home /News /business /

RBI GOVERNOR SHAKTIKANTA DAS PROPOSED THREE MEASURES TO MAKE UPI PAYMENTS SIMPLER FOR CONSUMERS ACROSS THE COUNTRY TAKE A LOOK GH SRD

UPI Payments: ఇకపై ఫీచర్ ఫోన్‌తో కూడా యూపీఐ చెల్లింపులు.. ఇంటర్నెట్ లేకుండా పనిచేసే పేమెంట్ సిస్టమ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UPI Payments: ఇటీవల ముగిసిన MPC సమావేశంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్‌బీఐ గవర్నర్ ముఖ్యమైన ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా యూజర్ల కోసం యూపీఐ చెల్లింపులను సులభతరం చేయడానికి మూడు మార్గదర్శకాలను ప్రతిపాదించారు.

ఇంకా చదవండి ...
ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ల వరకే పరిమితమైన యూపీఐ పేమెంట్ సేవలు (UPI payments) ఇకపై ఫీచర్ ఫోన్లలో కూడా అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు, ఇంటర్నెట్ అవసరం లేకుండానే యూపీఐ చెల్లింపులు చేసుకునేందుకు వీలుగా సరికొత్త పేమెంట్ సిస్టమ్ కూడా అందరికీ పరిచయం కానుంది. ఈ సరికొత్త సేవలకు సంబంధించిన వివరాలను తాజాగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) ప్రకటించారు. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ ప్రకటనల్లో భాగంగా ఫీచర్ ఫోన్ల కోసం డిజిటల్ పేమెంట్ సిస్టం లాంచ్ చేయనున్నామని శక్తికాంత దాస్ నవంబర్ 8న ప్రకటించారు. దీంతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్-ఆధారిత (UPI) ప్రొడక్టులను ఫీచర్ ఫోన్‌లలో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టమవుతోంది. ఫీచర్ ఫోన్లలో యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి వస్తే.. ఇంటర్నెట్ అవసరం లేని యూపీఐ చెల్లింపులు కూడా సాధ్యం కావొచ్చు.

ఇటీవల ముగిసిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్‌బీఐ గవర్నర్ ముఖ్యమైన ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా యూజర్ల కోసం యూపీఐ చెల్లింపులను సులభతరం చేయడానికి శక్తికాంత దాస్ మూడు మార్గదర్శకాలను ప్రతిపాదించారు.

"ట్రాన్సాక్షన్ల సంఖ్య పరంగా యూపీఐ అనేది దేశంలో అతిపెద్ద రిటైల్ చెల్లింపుల వ్యవస్థ. ఈ చెల్లింపులను ఎక్కడైనా అంగీకరిస్తారు. ముఖ్యంగా చిన్నపాటి ట్రాన్సాక్షన్లకు కూడా యూపీఐ చెల్లింపులను బాగా ఉపయోగిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థగా ఉన్న యూపీఐ వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి.. లావాదేవీలను సులభతరం చేయడానికి, యూపీఐ చెల్లింపులకు రిటైల్ కస్టమర్లను మళ్ళించడానికి, సర్వీస్ ప్రొవైడర్ల సామర్థ్యాన్ని పెంచడానికి.. యూపీఐ ఆధారిత పేమెంట్ ప్రొడక్టులను ఫీచర్ ఫోన్ యూజర్లకు కూడా ప్రారంభించాలని ప్రతిపాదించాం." అని దాస్ చెప్పారు.

rbi governor,rbi governer shaktikanta das,coronavirus,digital payments,cashless,telugu news,కరోనావైరస్,కోవిడ్-19,ఆర్బీఐ,ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్


అంతేకాదు స్మాల్ వ్యాల్యూ ట్రాన్సాక్షన్ల ప్రక్రియను ఆన్-డివైజ్ వాలెట్ ద్వారా సులభతరం చేయాల్సిందిగా ఆర్‌బీఐ గవర్నర్ ప్రతిపాదించారు. అలాగే పెట్టుబడులు, ఐపీఓ అప్లికేషన్ల లావాదేవీల కోసం రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచాలని ఆర్‌బీఐ ప్రతిపాదించినట్టు శక్తికాంత దాస్ ప్రకటించారు.

ఇది కూడా చదవండి : కార్ లోన్ తీసుకోవాలా? ఈ బ్యాంకుల్లో వడ్డీ రేటు తక్కువ

ఆర్థిక మార్కెట్లలో రిటైల్ కస్టమర్లకు ఎక్కువ భాగస్వామ్యాన్ని కల్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లతో రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా G-సెకన్ల విభాగంలో పెట్టుబడి పెట్టి ప్రైమరీ, సెకండరీ మార్కెట్‌లలో పాల్గొనడానికి రిటైల్ కస్టమర్లకు వీలు కల్పించింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌ల (IPO) విషయంలో కూడా యూపీఐని పాపులర్ పేమెంట్ ఆప్షన్ గా మార్చింది. అలాగే మార్చి 2020లో యూపీఐలో ట్రాన్సాక్షన్ లిమిట్‌ను రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచింది.

ఇది కూడా చదవండి :  కొత్త బిజినెస్ కు డబ్బులు కావాలా...బ్యాంకు లోన్ అవసరం లేకుండానే...ఫండ్ సంపాదించే చాన్స్...

అయితే ఇప్పుడు రిటైల్ పెట్టుబడిదారుల యూపీఐ వినియోగాన్ని మరింత ప్రోత్సహించడానికి.. రిటైల్ డైరెక్ట్ స్కీమ్, ఐపీఓ అప్లికేషన్‌ల కోసం యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ లిమిట్‌ను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఇదే సందర్భంగా రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నట్లు దాస్ ప్రకటించారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Digital payments, Payments, Rbi, Rbi governor, UPI

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు