ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ కీలక సూచనలు

దేశ బ్యాంకింగ్‌ రంగాన్ని మరింత సమర్థ వంతంగా తీర్చిదిద్దేందుకు బ్యాంకుల్లో పాలనను కఠినతరం చేయాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు.

news18-telugu
Updated: November 17, 2019, 4:17 PM IST
ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ కీలక సూచనలు
శక్తికాంతదాస్ (Image:ANI)
  • Share this:
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తుల పెరుగుదల, మూలధనం క్షీణత, మోసాలు, తగిన స్థాయిలో రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ లేకపోవడానికి కఠినమైన పాలనలేమే కారణమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ప్రభుత్వరంగ బ్యాంకులకు కీలకమైన సూచనలు చేశారు. దేశ బ్యాంకింగ్‌ రంగాన్ని మరింత సమర్థ వంతంగా తీర్చిదిద్దేందుకు బ్యాంకుల్లో పాలనను కఠినతరం చేయాలని కోరారు. స్వతంత్ర బోర్డ్‌ల పాత్ర పెరగాలని శక్తికాంత్ దాస్ సూచించారు. కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వ్యవస్థపై నియంత్రణ, ఆడిట్‌, బిజినెస్‌ రిపోర్టింగ్‌, రిస్క్‌ మేనేజ్‌ మెంట్‌ల తగిన స్థాయిలో ఏర్పాటు విషయంలో స్వతంత్ర బోర్డుల పాత్రలో పురోగతి లేకపోవడంతో నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయని శక్తికాంత్ దాస్ అన్నారు.

అయితే కొంతకాలంగా బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు కొంతమేర తగ్గాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రొవిజన్‌ కవరేజ్‌ నిష్పత్తి గతేడాది 48.3 శాతంగా ఉండగా ఈ ఏడాది 60.5 శాతానికి పెరిగిందని వెల్లడించారు. బ్యాంకింగ్‌ రంగంలో కేపిటల్‌ అడిక్వెన్సీ నిష్పత్తి కూడా గణనీయంగా పెరిగిందని వివరించారు.

First published: November 17, 2019, 4:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading