RBI New Rules: ఉద్యోగులకు, పింఛన్ దారులకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. ఆగస్టు 1 నుంచే అమలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగులకు, పింఛన్ దారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఆర్బీఐ తీసుకువచ్చిన కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమలుకానున్నాయి.

 • Share this:
  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉద్యోగులకు, పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెలవుల కారణంగా వేతనం, పెన్షన్ డబ్బులు జమ అవకుండా ఏర్పడే ఇబ్బందులకు చెక్ పెట్టింది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో వేతనంతో పాటు పెన్షన్ డబ్బులు సెలవు దినాల్లోనూ ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(NACH) నిబంధనల్లో మార్పులు తీసుకువచ్చింది. దీంతో సెలవుల్లోనూ వేతనం డబ్బులు, జమ అయ్యే అవకాశం ఏర్పడింది. ఈ నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమలుకోకి వస్తాయని ఆర్బీఐ తెలిపింది. అప్పటి నుంచి వేతనాలు, పెన్షన్, వడ్డీ జమ, ఈఎంఐలు, టెలిఫోన్, గ్యాస్ బిల్లులు ఫస్ట్ తారీఖున జమ కావడం లేదా కట్ కావడం జరగనుంది. ఆర్బీఐ నూతనంగా చేపట్టిన మార్పుల ద్వారా NACH సేవలు వారానికి ఏడు రోజుల పాటు అంబుబాటులోకి వస్తాయి. ఇప్పటి వరకు కేవలం బ్యాంకులు తెరిచినప్పుడు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉండేవి. దీంతో సెలు దినాల్లో వేతనాలు, పింఛన్లు జమ కాకపోయేవి. దీంతో ఇబ్బందులు పడేవారు.
  Pension Scheme: నెలకు రూ.3,000 పెన్షన్ కావాలంటే ఈ స్కీమ్‌లో చేరండి... జీతం తక్కువ ఉన్నవారికే అవకాశం

  ముఖ్యంగా నెలాఖరులో రెండో శనివారం, ఆదివారం, ఇతర సెలువులు వస్తే నాలుగైదు రోజుల పాటు వేతనాలు ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో అనేక మంది ఆర్థిక ఇబ్బందులు పడేవారు. కానీ ఇక నుంచి ఆ సమస్యలు తీరరనున్నాయి. ఇటీవల జూన్ క్రెడిట్ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. వినియోగదారులకు అందించే సేవలను మరింత విస్తృతం చేయడానికి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(RTGS), ఎన్ఏసీహెచ్(NACH) సేవలు 24/7 అందుబాటులో ఉంటాయని తెలిపారు. NACHను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) నిర్వహిస్తుంది.

  ఇదిలా ఉంటే.. ఇటీవల ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ప్ర‌జ‌లు న‌గ‌దుపై ఆధార‌ప‌డ‌టం త‌గ్గించ‌డానికి డిజిట‌ల్ క‌రెన్సీని తీసుకురానున్నట్లు తెలిపింది. సమీప భవిష్యత్‌లో టోకు, రిటైల్‌ విభాగాల్లో ప్రయోగాత్మకంగా డిజిటల్‌ కరెన్సీ తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ టీ.రవిశంకర్‌ వెల్లడించారు. పలు దేశాల్లో టోకు, రిటైల్‌ విభాగాల్లో 'సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ’ (సీబీడీసీ)లు ఇప్పటికే అమలవుతున్నాయి. ప్రైవేట్ వర్చువల్‌ కరెన్సీ (వీసీ) తరహాలో ఉపయోగించుకునేలా దేశీయ సీబీడీసీని ఆర్‌బీఐ అభివృద్ధి చేస్తోందని రవిశంకర్ చెప్పారు.

  ప్రభుత్వ ఆమోద ముద్ర లేని కొన్ని వర్చువల్‌ కరెన్సీల విలువల్లో ఏర్పడుతున్నహెచ్చుతగ్గుల భయం లేకుండా సీబీడీసీని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో నగదుపై ఆధారపడటం తగ్గుతుందని, కరెన్సీ విలువకు, తయారీ ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరుగుతుందని రవిశంకర్ చెబుతున్నారు. సెటిల్‌మెంట్‌ రిస్క్‌ కూడా పరిమితంగానే ఉంటుందని వివరించారు.
  Published by:Nikhil Kumar S
  First published: