Bank Fraud: ఈ బ్యాంకులో డబ్బులు ఉన్నాయా...అయితే జాగ్రత్త..మార్చి 31 వరకూ డబ్బులు తీసుకోలేరు...
Central Bank Jobs 2021: సెంట్రల్ బ్యాంకులో 214 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
(ప్రతీకాత్మక చిత్రం)
రిజర్వ్ బ్యాంకు మంగళవారం పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఅపరేటివ్ బ్యాంక్ (PMC) పై ఆంక్షలను మరో మూడు నెలల పాటు పొడిగస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్బీఐ విడుదల చేసిన నోటీసు ప్రకారం "డిపాజిటర్ రక్షణ ప్రయోజనాల కోసం" సెప్టెంబర్ 23, 2019 తీసుకున్న చర్యలు మరో మూడు నెలల పాటు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
PMC Fraud: రిజర్వ్ బ్యాంకు మంగళవారం పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఅపరేటివ్ బ్యాంక్ (PMC) పై ఆంక్షలను మరో మూడు నెలల పాటు పొడిగస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్బీఐ విడుదల చేసిన నోటీసు ప్రకారం "డిపాజిటర్ రక్షణ ప్రయోజనాల కోసం" సెప్టెంబర్ 23, 2019 తీసుకున్న చర్యలు మరో మూడు నెలల పాటు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు రిజర్వ్ బ్యాంకు ప్రతిపాదించిన ఉత్తర్వుల ప్రకారం పీఎంసీ, Unity Small Finance Bank Ltd. (USFB) బ్యాంకుల విలీనం కూడా పర్యవేక్షించనుంది. కాగా ఈ విలీన ప్రతిపాదన స్కీమును నవంబర్ 22, 2021న ప్రతిపాదించారు. అంతేకాదు డిసెంబర్ 10 లోగా అభ్యంతరాలు, సూచనలను అందించాలని ఉత్తర్వుల్లో కోరింది. మరోవైపు ఇరుబ్యాంకుల డిపాజిటర్లు, క్రెడిటర్ల జాబితాను పరిశీలించాల్సి ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది.
కొత్త ఉత్తర్వుల ప్రకారం పీఎంసీ బ్యాంకుపై విధించిన ఆంక్షలు జనవరి 1, 2021 నుంచి మార్చి 31, 2021 అమలు కానున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇదిలా ఉంటే పీఎంసీ బ్యాంకు స్కాం నిందితులు బ్యాంకు మాజీ ఎండీ జాయ్ థామస్, మాజీ చైర్మన్ వర్యమ్ సింగ్, మాజీ డైరక్టర్ సుర్జిత్ సింగ్ ఆరోరాతో పాటు HDIL ప్రమోటర్లు రాకేష్ వర్థమాన్, సారంగ్ వర్ధమాన్ లను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.
తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సృష్టించిన నేరంలో బ్యాంకు డైరక్టర్లపై వివిధ ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు మోపి, విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నిందితులను అరెస్టు చేసి అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పోలీసులు 32 వేల పేజీల చార్జిషీటును మెట్రోపొలిటి్ మెజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించారు. ఇదిలా ఉంటే బ్యాంకుకు సంబంధించిన డిపాజిటర్ల సొమ్మును భద్రపరిచేందుకు బ్యాంకును Unity Small Finance Bank Ltd. (USFB)లో విలీనం చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.