Reserve Bank Of India | దేశంలో లోన్ వేధింపులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ – RBI) ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్‌కు (Bank) ఝలక్ ఇచ్చింది. భారీగా పెనాల్టీ విధించింది. ఆర్‌బీఎల్ బ్యాంక్‌కు షాకిచ్చింది. లోన్ రికవరీ ఏజెంట్లు రూల్స్‌ను అతిక్రమించడ ఇందుకు ప్రధాన కారణం. రుణ గ్రహాతలను వేధింపులకు గురిచేయడం వల్ల ఆర్‌బీఎల్ బ్యాంక్‌కు జరిమానా విధించినట్లు వెల్లడించింది.
లోన్ రికవరీ ఏజెంట్లు నిబంధనల అతిక్రమణ నేపథ్యంలో ఆర్‌బీఎల్ బ్యాంక్‌కు రూ. 2.27 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. 2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ముంబైకి చెందిన రికవరీ ఏజెంట్లపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఫిర్యాదుల ప్రకారం చూస్తే లోన్ రికవరీ ఏజెంట్లు నిబంధనలను అతిక్రమించారని పేర్కొంది.
2 ఇన్ 1 స్కూటర్లు.. అటు పెట్రోల్‌తో నడుస్తాయ్, ఇటు బ్యాటరీతో పరుగులు పెడతాయ్!
రుణ గ్రహీతలను లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు, వేధింపులకు గురికాకుండా చూసుకోవడంలో ఆర్‌బీఎల్ బ్యాంక్ విఫలమైందని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. ఏజెంట్లను నియమించే ముందు వారి పోలీసు ధ్రువీకరణను నిర్ధారించలేదని ఆర్‌బీఐ పేర్కొంది. కాగా ఆర్‌బీఐ గత సంవత్సరం కొత్త రూల్స్ తీసుకువచ్చింది. బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు.. వాటికి సంబంధించిన ఏజెంట్లు ఎలాంటి బెదిరింపులకు లేదా వేధింపులకు పాల్పడకుండా ఖచ్చితంగా చూసుకోవాలని పేర్కొంది. ఈ రూల్స్‌ను అతిక్రమించిన బ్యాంకులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
రూ.34,000 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ .. రూ.8 వేలు కట్టి ఇంటికి తీసుకెళ్లండి, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా!
కాగా మన తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా చాలా మంది లోన్ ఏజెంట్ల వేధింపులకు బలయ్యారు. ఈ అంశం పార్లమెంట్‌కు కూడా చేరింది. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ కొత్త రూల్స్ తెచ్చింది. లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు వీటిని తీసుకువచ్చింది. అందువల్ల రుణ గ్రహాతలు ఏమైనా వేధింపులకు గురైతే వెంటనే ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయొచ్చు.
డిజిటల్ లోన్ తీసుకునే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్‌బీఐ ఆమోదం పొందిన లోన్ యాప్స్ నుంచే లోన్ తీసుకోవడం ఉత్తమం. అందువల్ల మీరు ఆన్‌లైన్‌లో డిజిటల్ లోన్ యాప్ ద్వారా రుణం పొందాలని భావిస్తే.. ఈ పని కచ్చితంగా చేయాలి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అధిక వడ్డీ భారం మోయాలి. అలాగే వేధింపులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అందుకే లోన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వేగంగా లోన్ వస్తుందని ఆశకు పోవద్దు. ఎంత అవసరం ఉన్నా కూడా ఈ విషయాన్ని చెక్ చేసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loan, Loan apps, Rbi, Rbl, Reserve Bank of India