Home /News /business /

RBI EXTENDS DEADLINE TO IMPLEMENT NEW RULES TO CREDIT CARD OCTOBER 1 UMG GH

Credit Card: క్రెడిట్‌ కార్డ్స్ యూజర్స్‌కి గుడ్ న్యూస్.. కొత్త రూల్స్ అమలుకు గడువు పొడిగింపు.. రానున్న మార్పులు ఇవే..!

క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్

క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్

క్రెడిట్ కార్డ్ (Credit Card) జారీకి సంబంధించిన వివిధ నిబంధనలను అమలు చేయడానికి గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అక్టోబర్ 1 వరకు పొడిగించింది. అంతకుముందు గడువు జూలై 1గా ఉంది.

క్రెడిట్ కార్డ్ జారీకి సంబంధించిన వివిధ నిబంధనలను అమలు చేయడానికి గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అక్టోబర్ 1 వరకు పొడిగించింది. అంతకుముందు గడువు జూలై 1గా ఉంది. పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన వివిధ సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జూన్‌ 21న విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆర్‌బీఐ పేర్కొంది. మాస్టర్ డైరెక్షన్‌లోని నిబంధనలను అమలు చేయడానికి 2022 అక్టోబర్ 01 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.

కీలక మార్పుల కోసం గడువు పొడిగింపు
ఒక కస్టమర్ క్రెడిట్ కార్డ్‌ను జారీ చేసిన 30 రోజులలోపు యాక్టివేట్ చేయకపోతే, బ్యాంక్‌లు లేదా కార్డ్-జారీ చేసేవారు దాన్ని యాక్టివేట్ చేయడానికి వినియోగదారు నుంచి వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను తప్పనిసరిగా పొందాలి. కస్టమర్ కార్డును యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నించకపోతే.. కార్డ్ జారీ చేసిన సంస్థలు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఏడు పని దినాల్లోగా కార్డ్‌ను రద్దు చేసేయవచ్చు.

క్రెడిట్ కార్డ్‌పై క్రెడిట్ లిమిట్‌ను పెంచే ముందు కార్డ్ జారీ చేసేవారు తప్పనిసరిగా స్పష్టమైన సమాచారం అందజేసి, అనుమతి పొందాలి. కార్డుదారుని నుంచి స్పష్టమైన అంగీకారం తీసుకోకుండా, ఏ సమయంలోనైనా కార్డ్ హోల్డర్‌కు సూచించిన క్రెడిట్ పరిమితిని పెంచకూడదని ఆర్‌బీఐ పేర్కొంది. అంతేకాకుండా, క్రెడిట్ కార్డ్ బకాయిల చెల్లింపునకు సంబంధించిన నిబంధనలు, షరతులు, చెల్లించాల్సిన కనీస మొత్తం కూడా నిర్ధేశించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. నెగిటివ్‌ అమార్టైజేషన్ లేదని నిర్ధారించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. చెల్లించని ఛార్జీలు/లేవీలు/పన్నులు వసూలు చేయడం/కాంపౌండింగ్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్ కోసం క్యాపిటలైజ్ కావని రెగ్యులేటర్ తెలిపింది. మిగిలిన నిబంధనల అమలు కోసం నిర్దేశించిన గడువు మారదని ఆర్‌బీఐ చెప్పింది.

జూలై 1 నుంచి మారనున్న రూల్స్
ఏప్రిల్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసేటప్పుడు కార్డ్ జారీ చేసేవారు అనుసరించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త నియమాలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్- జారీ, కండక్ట్‌) ఆదేశాలు, 2022 అని పిలుస్తారు, ఇది బిల్లింగ్‌, క్రెడిట్ కార్డ్‌ల రద్దుకు సంబంధించిన సూచనలను కలిగి ఉంటుంది. భారతదేశంలో పనిచేస్తున్న ప్రతి షెడ్యూల్డ్ బ్యాంక్ (పేమెంట్స్ బ్యాంక్‌లు, స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లు, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్‌లు మినహా) అన్ని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (NBFC) ఈ నిబంధనలు వర్తిస్తాయి.

ప్రతి నెలా 10వ తేదీన క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను రూపొందిస్తే, క్రెడిట్ కార్డ్ కోసం బిల్లింగ్ సైకిల్ మునుపటి నెల 11వ తేదీన ప్రారంభమై ప్రస్తుత నెల 10వ తేదీన ముగుస్తుందని రెగ్యులేటర్ తెలిపింది. క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ స్టేట్‌మెంట్‌లో ఎటువంటి ఆలస్యం చేయకూడదు. కార్డ్ జారీ చేసేవారు తప్పనిసరిగా బిల్లులు/స్టేట్‌మెంట్‌లు పంపినట్లు, తక్షణమే ఇమెయిల్‌లు చేస్తాయని RBI పేర్కొంది. వడ్డీని వసూలు చేయడానికి కనీసం ఒక పక్షం రోజుల ముందు చెల్లించడానికి వినియోగదారునికి తగినంత సమయం ఉందని నిర్ధారించుకోవాలి.

ఆలస్యమైన ఇన్‌వాయిస్ గురించి పదేపదే ఫిర్యాదులను నివారించడానికి, కార్డ్ జారీచేసేవారు కార్డ్ హోల్డర్ సమాచార అధికారంతో ఇంటర్నెట్/మొబైల్ బ్యాంకింగ్ ద్వారా బిల్లులు, అకౌంట్ స్టేట్‌మెంట్‌లను జారీ చేయాలని ప్రపోజ్‌ చేయవచ్చని ఆర్‌బీఐ చెప్పింది. కార్డ్ జారీచేసేవారు తప్పనిసరిగా కార్డ్ హోల్డర్ బిల్లింగ్ స్టేట్‌మెంట్‌ను స్వీకరించేలా ఒక సిస్టమ్‌ను అమలు చేయాలని సూచించింది.
Published by:Mahesh
First published:

Tags: BUSINESS NEWS, Credit card, Debit card, Rbi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు