RBI EXTENDS CARD TOKENISATION DEADLINE TO JUNE 30 2022 HERE FULL DETAILS NS
RBI: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఆ రూల్ అమలుకు మరో 6 నెలలు గడువు.. ఆర్బీఐ కీలక ప్రకటన
ప్రతీకాత్మక చిత్రం
జనవరి 1 నుంచి టోకెనైజేషన్ (Tokenisation) విధానాన్ని తీసుకురానున్నట్లు ఆర్బీఐ(RBI) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ గడువును పెంచుతూ నిర్ణయం ఆర్బీఐ తీసుకుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక ప్రకటన చేసింది. సైబర్ నేరాలకు (Cyber Crime) అడ్డుకట్ట వేసేందుకు జనవరి 1 నుంచి టోకెనైజేషన్ (tokenisation) విధానాన్ని తీసుకురానున్నట్లు ఆర్బీఐ (RBI) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. జూన్ 30 వరకు డెడ్ లైన్ ను పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ తాజాగా సర్క్యులర్ విడుదల చేసింది. సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఆర్బీఐ టోకెనైజేషన్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. అసలు టోకెనైజేషన్ అంటే ఎమిటన్న విషయానికి వస్తే.. సాధారణంగా క్రెడిట్ (Credit Card) లేదా డెబిట్ కార్డు (Debit Card) హోల్డర్లు పేమెంట్స్ చేయడానికి కార్డు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకుంటే సంబంధిత వెబ్ సైట్ లేదా యాప్ లో డబ్బులు చెల్లించడం కోసం కార్డు నెంబర్, ఎక్స్పైరీ నెల, సంవత్సరం, సీవీవీ నంబర్ ను నమోదు చేస్తాము.
ఆ వివరాలు ఆ ఖాతాలో సేవ్ అయి ఉంటాయి. అయితే ఎప్పుడైనా ఆ డేటా లీక్ అయితే.. ఆ వివరాలన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నివారించేందుకు ఆర్బీఐ టోకెనైజేషన్ విధానాన్ని తీసుకురానుంది. మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డును రీప్లేస్ చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. మీరు మీ కార్డు వివరాలు ఎంటర్ చేయకుండా ఓ టోకెన్ మాత్రమే జారీ చేస్తారు. కార్డు, టోకెన్ రిక్వెస్టర్, డివైజ్ ద్వారా యూనిక్ కాంబినేషన్‌తో ఈ టోకెన్ ఉంటుంది. RBI Monetary Policy: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే
ఉదాహరణకు మీరు ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయాలనుకుంటే కార్డ్ వివరాలు ఎంటర్ చేయకుండా టోకెన్ వివరాలు మాత్రమే ఎంటర్ చేస్తారు. ఆ టోకెన్ ఆ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే పనిచేస్తుంది. అది కూడా మీరు కోరుకున్న డివైజ్ నుంచే పనిచేస్తుంది ఒకవేళ టోకెన్ వివరాలు ఇతరులకు తెలిసినా వాటిని ఉపయోగించలేరు. ఇలా మీరు రెగ్యులర్‌గా జరిపే పేమెంట్స్‌కి టోకెనైజేషన్ వాడుకోవచ్చు. మీరు కోరుకున్న వెబ్సైట్ లేదా యాప్ నుంచి టోకెనైజేషన్ రిక్వెస్ట్ పంపాలి. సదరు మర్చంట్ మీ రిక్వెస్ట్‌ను బ్యాంకుకు పంపిస్తారు. ఆ తర్వాత టోకెన్ క్రియేట్ అవుతుంది. మీరు ఆ టోకెన్‌ను ఆ ప్లాట్ఫామ్లోనే ఉపయోగించొచ్చు. RBI Ombudsman Scheme: లావాదేవీలపై ఫిర్యాదులకు RBI కొత్త స్కీం.. అన్ని బ్యాంకుల ఖాతాదారులు తప్పక తెలుసుకోండి
అంటే అమెజాన్‌లో క్రియేట్ చేసే టోకెన్ అమెజాన్‌లో మాత్రమే పనిచేస్తుంది. ప్రస్తుతం మర్చంట్స్ అందరూ టోకెనైజ్ కార్డ్స్ అంగీకరించట్లేదు. కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో మాత్రమే ఈ సదుపాయం కనిపిస్తోంది. త్వరలో మర్చంట్స్ అందరూ ఈ సదుపాయం ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా లావాదేవీలు ఎక్కువగా జరిపేట్టైతే ఇకపై కార్డు వివరాలు ఎంటర్ చేయకుండా టోకెనైజేషన్ పద్ధతి ఉపయోగించండి. మీ కార్డు వివరాలు సురక్షితంగా ఉంటాయి.
మీరు ఒకసారి టోకెన్ రిజిస్టర్ చేసిన తర్వాత డీరిజిస్టర్ కూడా చేయొచ్చు. లేదా ఒక ట్రాన్సాక్షన్లో ఎంత పేమెంట్ చేయాలో, డైలీ లిమిట్ ఎంతో కూడా మాడిఫై చేయొచ్చు. మీరు టోకెనైజేషన్ క్రియేట్ చేసిన తర్వాత కూడా పేమెంట్ విధానం గతంలో ఉన్నట్టుగానే ఉంటుంది. అంటే పేమెంట్ పూర్తి చేయడానికి మీరు తప్పనిసరిగా ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.