Home /News /business /

RBI EXTENDS CARD TOKENISATION DEADLINE BY THREE MONTHS HERE DETAILS NS

RBI: క్రెడిట్, డెబిట్ కార్డుతో షాపింగ్ చేసే వారికి అలర్ట్.. ఆర్బీఐ కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టోకనైజేషన్ కు సంబంధించిన గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ(RBI). వివిధ వర్గాల నుంచి వస్తున్న వినతులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ (RBI) స్పష్టం చేసింది.

    బ్యాంకు వినియోగదారులకు చెందిన క్రెడిట్/డెబిట్ కార్డుల (Credit/Debit Cards) వివరాలను సైబర్ మోసగాళ్లకు చిక్కకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) టోకనైజేషన్ (RBI Tokenisation) విధానాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే.. మొదటిసారి ఈ విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ మే 2020లో ప్రతిపాదించింది. ఆ సమయంలో ఈ విధానం అమలుకు జూన్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించింది ఆర్బీఐ. కానీ.. వ్యాపారులు, బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లు సన్నద్ధత వ్యక్తం చేయకపోవడంతో గడువు తేదీని 2021 డిసెబర్ 31కి పొడిగించారు. అయితే.. మళ్లీ గడువు పొడిగించాలన్న వినతులు ఆయా వర్గాల నుంచి రావడంతో ఈ జూన్ 30 వరకు పొడిగించింది ఆర్బీఐ. తాజాగా గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. వివిధ వర్గాల నుంచి వస్తున్న వినతులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.

    కార్డుల టోకెనైజేషన్ అంటే ఏమిటి?
    ఇప్పటి వరకు, ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ల నుంచి వస్తువులను కొనుగోలు చేసినప్పుడల్లా లేదా ట్రావెల్ వెబ్‌సైట్ ద్వారా రైలు లేదా విమాన టిక్కెట్‌లను బుక్ చేసినప్పుడల్లా, ఫ్యూచర్‌ ట్రాన్సాక్షన్‌లు సులభంగా జరిగేందుకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలను సేవ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చేసే పేమెంట్స్‌కు కేవలం మూడు అంకెల CVV నంబర్‌ను మాత్రమే నమోదు చేస్తే, పేమెంట్‌ చెక్అవుట్‌ను సెకన్లలోపు చేస్తారు. కానీ ప్రస్తుతం కార్డు వివరాలను సేవ్ చేయడం ప్రమాదకరం. ప్రముఖ వెబ్‌సైట్‌ల నుంచి హ్యాకర్లు డేటాను సేకరించిన సందర్భాలు ఉన్నాయి.
    Credit Card: క్రెడిట్‌ కార్డ్స్ యూజర్స్‌కి గుడ్ న్యూస్.. కొత్త రూల్స్ అమలుకు గడువు పొడిగింపు.. రానున్న మార్పులు ఇవే..!

    ఇప్పుడు టోకెనైజేషన్ ప్రక్రియ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ 16-అంకెల నంబర్‌ను యూనిక్ టోకెన్‌తో రీప్లేస్ చేస్తుంది. ఈ టోకెన్ ఒక కార్డుకు, ఒక మర్చెంట్‌కు ఒకేసారి ఉపయోగపడుతుంది. ఈ టోకెన్, కార్డ్ వివరాలను పూర్తిగా అందించదు. కాబట్టి మర్చంట్ వెబ్‌సైట్ నుంచి డేటా లీక్ అయినా, హ్యాకర్‌ కార్డ్ వివరాలను దుర్వినియోగం చేయలేడు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, మొబైల్ పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీలు లేదా యాప్‌లో లావాదేవీల కోసం టోకెన్‌లను ఉపయోగించవచ్చు.
    Credit Cards: క్రెడిట్ కార్డు యూజ‌ర్ల‌కు మ‌రో బెన్‌ఫిట్‌.. ఆర్బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌

    టోకెనైజేషన్ నియమం ఆన్‌లైన్ లావాదేవీలను ప్రాసెస్ చేయడం కోసం కార్డ్ నంబర్‌లు, CVV లేదా గడువు తేదీని సర్వర్‌లో సేవ్ చేయకుండా మర్చంట్ వెబ్‌సైట్‌లను నిషేధిస్తుంది. కార్డ్ వినియోగదారులు షాపింగ్ వెబ్‌సైట్‌లో వస్తువును కొనుగోలు చేసే ముందు టోకెన్‌ను తయారు చేసి, నిర్దిష్ట వెబ్‌సైట్‌లో (భవిష్యత్తు ఉపయోగం కోసం) ఆ టోకెన్‌ను సేవ్ చేయాలి లేదా టోకెన్‌ను సృష్టించి, షాపింగ్ తర్వాత చెల్లింపు సమయంలో (భవిష్యత్తులో ఉపయోగం కోసం) సేవ్ చేయాలి.

    అయితే డెబిట్, క్రెడిట్ కార్డ్ టోకెనైజేషన్ ప్రక్రియ తప్పనిసరి కాదు. కస్టమర్‌లు తమ కార్డ్‌లను మర్చంట్ వెబ్‌సైట్‌లో టోకనైజ్ చేయాలా వద్దా అని ఎంచుకోవచ్చు. అలాంటప్పుడు, కస్టమర్ ఏదైనా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు 16-అంకెల కార్డ్ నంబర్, గడువు తేదీ, CVV సహా ప్రతి లావాదేవీకి కార్డ్ వివరాలను మళ్లీ మళ్లీ నమోదు చేయాలి. కార్డ్ వివరాలు Flipkart, Amazon, Myntra మొదలైన వెబ్‌సైట్‌లలో స్టోర్‌ కావు. ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేసిన ప్రతిసారీ కార్డ్‌ని టోకనైజ్ చేసి, టోకెన్‌ని స్టోర్ చేసుకునేలా సెలక్ట్‌ చేసుకోవచ్చు, లేదా కార్డ్ వివరాలను ప్రతిసారి నమోదు చేయవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Credit card, Debit card, Reserve Bank of India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు