హోమ్ /వార్తలు /బిజినెస్ /

డబ్బులు ఉన్నాయా...అయితే మూడు నెలల EMI కట్టేసుకోండి...లేకపోతే వచ్చే ఇబ్బంది ఇదే..

డబ్బులు ఉన్నాయా...అయితే మూడు నెలల EMI కట్టేసుకోండి...లేకపోతే వచ్చే ఇబ్బంది ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మూడు నెలల పాటు ఈఎంఐలపై మారటోరియం విధించింది. అయితే ఇది నిజంగా అందరికీ ఊరటనిచ్చే అంశమే. ఈ కష్టకాలం కలిసొచ్చే అంశమే. అయితే ఇందులో ఒక మెలిక ఉంది. మన దగ్గర డబ్బు ఉండి కూడా.. ఈఎంఐలు కట్టకపోతే అనవసరంగా మనం అధిక వడ్డీని కట్టాల్సి ఉంటుంది. ఆ లొసుగేంటో, మతలబు ఏంటో చూద్దాం..

ఇంకా చదవండి ...

కరోనా మహమ్మారి దెబ్బతో ఆర్థిక రంగం పడకేసింది. జనం ఉద్యోగాలకు దూరమయ్యారు. ఫలితంగా వేతన జీవులు, అలాగే మధ్య తరగతి కుటుంబాలకు ఆర్బీఐ ఓ వెసులుబాటు కల్పించింది. మూడు నెలల పాటు ఈఎంఐలపై మారటోరియం విధించింది. అయితే ఇది నిజంగా అందరికీ ఊరటనిచ్చే అంశమే. ఈ కష్టకాలం కలిసొచ్చే అంశమే. అయితే ఇందులో ఒక మెలిక ఉంది. మన దగ్గర డబ్బు ఉండి కూడా.. ఈఎంఐలు కట్టకపోతే అనవసరంగా మనం అధిక వడ్డీని కట్టాల్సి ఉంటుంది. ఆ లొసుగేంటో, మతలబు ఏంటో చూద్దాం..

ఆర్బిఐ ఇచ్చిన స్టేట్ మెంట్ మీరు మూడు నెలలు EMI లను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో అసలు విషయం ఏంటో ఇప్పుడు పూర్తిగా చూద్దాం. నిజానికి ఆర్‌బిఐ అలాంటిదేమీ చెప్పలేదు. మొదట, మీరు మీ రుణం లేదా క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించకూడదని ఆలోచిస్తుంటే, నిజంగా అది తెలివిలేని నిర్ణయమే. అలాగే చేస్తే మీరు పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంది.

మూడు నెలల EMI  మాఫీ అని RBI చెప్పలేదా?

లేదు. ఆర్బీఐ అస్సలు అలా చెప్పలేదు.

మరి ఆర్బీఐ ఏం చెప్పిందో అధికారిక ప్రకటన చూద్దాం...

"అన్ని టర్మ్ రుణాలకు సంబంధించి (వ్యవసాయ టర్మ్ లోన్లు, రిటైల్ మరియు పంట రుణాలతో సహా), అన్ని వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మరియు లోకల్ ఏరియా బ్యాంకులతో సహా), సహకార బ్యాంకులు, అఖిల భారత ఆర్థిక సంస్థలు మరియు ఎన్‌బిఎఫ్‌సిలు ( హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా) (“రుణ సంస్థలు”) అన్ని సంస్థాపనల చెల్లింపుపై మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని మంజూరు చేయడానికి అనుమతి మాత్రమే ఇచ్చింది. తాత్కాలిక నిషేధం తర్వాత మూడు నెలల నాటికి బోర్డు అంతటా మార్చబడుతుంది. తాత్కాలిక నిషేధ వ్యవధిలో రుణాలపై వడ్డీ మాత్రం పెరుగుతూనే ఉంటుంది.

అసలు విషయం ఏంటంటే...

మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని అనుమతించే హక్కును ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చింది. ఇది తప్పనిసరి కాదు అని అర్థం. మీ బ్యాంక్ దీన్ని అనుమతించకపోవచ్చు, అనుమతించవచ్చు అది వారి బోర్డు ఇష్టం. ఇది టర్మ్ లోన్‌లకు మాత్రమే వర్తిస్తుంది (సబ్‌నోట్‌లో, క్రెడిట్ కార్డ్ బకాయిలను ఇందులో చేర్చారు, కానీ ఇది ఒక బ్యాడ్ ఐడియా అనే చెప్పాలి). ఇందులో గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, కారు రుణాలు, విద్యా రుణాలు మొదలైనవి ఉన్నాయి - స్థిరమైన ఫిక్స్ డ్ టర్మ్ లోన్స్ అన్ని దీని కిందకు వస్తాయి. ఇక ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాల విషయంలో మాత్రం ఇది వర్తించదు. అది వర్కింగ్ క్యాపిటల్ లోన్‌ అయితే మూడు నెలలు వాయిదా వేయవచ్చు.

మూడు నెలలపాటు వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. అంటే దాని అర్థం, మీరు చెల్లించాల్సిన రుణంపై వడ్డీని తిరిగి చెల్లించాల్సిందే. రుణం వాయిదా వేశారు కానీ వడ్డీని వాయిదా వేయలేదు.

ఉదాహరణకు మీ గృహ రుణం పదేళ్లకు 8.5% వడ్డీకి రూ. 50 లక్షలు. ఇఎంఐ రూ. 62,000 (సుమారు). అనుకుందాం. మీరు ఏప్రిల్‌లో మొదటి విడత చెల్లించాలి, కాని మీరు తాత్కాలిక నిషేధాన్ని ఎంచుకున్నారు అనుకుందాం... అంటే ప్రిన్సిపాల్ రూ. 50 లక్షల మీద నెలవారి ఈఎంఐలో రెండు భాగాలు ఉంటాయి. అందులో వడ్డీ భాగం, అసలు భాగం రెండు కలిపి ఉంటాయి. అంటే వడ్డీ చెల్లింపు భాగం ఏప్రిల్ నెలలో రూ. 35,000 అనుకుందాం. మీరు ఈఎంఐ చెల్లించలేదు. కాబట్టి ఏప్రిల్ చివరిలో మీ రుణ మొత్తం రూ. 50,35,000 గా మారిపోతుంది. అలాగే మే, జూన్ నెలలో కూడా మారిటోరియం తీసుకొని ఈఎంఐ చెల్లించకపోతే, మీ బకాయి అసలుపై వడ్డీ పెరిగి రూ. 50.71 లక్షలు. మూడు నెలల తరువాత, మీ కొత్త ప్రిన్సిపాల్ రూ. 51.07 లక్షలుగా మారిపోతుంది.అంటే మీరు సుమారు రూ. 1 లక్షలు అదనపు వడ్డీని బ్యాంకుకు చెల్లించాలి. అయితే మీ అసలు మొత్తం 51.07 లక్షలుగా మారి దానిపై అదనంగా వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.

అయితే అదనపు వడ్డీ భారం నుంచి మీరు బయటపడాలంటే, మూడు నెలల తర్వాత మీరు బ్యాంకుకు 1.07 లక్షలు చెల్లించి 50 లక్షల నుండి తిరిగి మీ ఈఎంఐ ప్రారంభించండి. లేదా, మీ రుణ వడ్డీ రేటును తగ్గించమని మీరు బ్యాంకును అభ్యర్థించవచ్చు వడ్డీ రేటు ఫ్లోటింగ్ అయితే 0.5% వరకూ తగ్గే అవకాశం ఉంది. మీకు ఆర్థిక భారం లేదు అనుకుంటే అదనపు వడ్డీని చెల్లించాలనుకోవడం అర్ధంలేనిదని చెప్పవచ్చు. మీకు అధిక వడ్డీ వద్దు అనుకుంటే ఎఫ్పటి లాగే మారిటోరియం తీసుకోకుండా వడ్డీ చెల్లించుకోండి.

తమ వినియోగదారులకు మూడు నెలల మారిటోరియం అందిస్తామని ఎస్బిఐ ఇప్పటికే తెలిపింది. బ్యాంకును సంప్రదించి యథావిధిగా ఈఎంఐ చెల్లిస్తామని చెప్పవచ్చు. బ్యాంకు వారు ఒప్పుకునే అవకాశం ఉంది. నిజానికి మారిటోరియం తప్పనిసరి కాదు... ఆర్‌బిఐ ఈ నిర్ణయం బ్యాంకుకు వదిలివేసింది.

మరొక ముఖ్య విషయం ఇది కేవలం ఈఎంఐ హాలిడే మాత్రమే...వడ్డీ మాఫీ కాదు. వడ్డీ మినహాయింపులను ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఇందులోని ఉపశమనం ఏమిటంటే, మీరు తాత్కాలిక నిషేధాన్ని తీసుకుంటే మీరు సిబిల్‌కు డిఫాల్టర్‌గా పేర్కొనదు. అలాగే మూడు నెలల పాటు ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంకు మిమ్మల్ని ఎన్పీఏ కింద ప్రకటించదు. ఇది ఒక రకంగా ఉపశమనం అనే చెప్పాలి.

క్రెడిట్ కార్డుల గురించి ఏమిటి?

మీరు ఈ నెల క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకుండా ఉండవచ్చని మీరు అనుకుంటే, మరోసారి ఆలోచించండి. క్రెడిట్ కార్డులు సంవత్సరానికి 36% + వడ్డీని వసూలు చేస్తాయి. ఆ తర్వాత మీ ఇష్టం...

First published:

Tags: Bank loans, Business, BUSINESS NEWS, Home loan, Housing Loans, Personal Finance, Personal Loan, Sbi

ఉత్తమ కథలు