ప్రాపర్టీ డాక్యుమెంట్స్, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను భద్రపరచుకోవడానికి చాలామంది బ్యాంక్ లాకర్ల (Bank Lockers)ను ఉపయోగిస్తారు. ఈ సేఫ్ లాకర్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of India) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నియమాలతో బ్యాంక్ లాకర్లలో పోగొట్టుకున్న విలువైన వస్తువులకు కస్టమర్లు పరిహారం పొందవచ్చు. బ్యాంక్ లాకర్లకు సంబంధించిన నియమాలను ఆర్బీఐ 2021లో మార్చింది. గత ఏడాది జనవరి నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే ఈ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం, తొలుత బ్యాంకులు తమ ప్రస్తుత కస్టమర్లతో 2023 జనవరి 1 నాటికి లాకర్ అగ్రిమెంట్లను రెన్యువల్ చేసుకోవాలని ఆర్బీఐ పేర్కొంది. తాజాగా ఈ గడువును 2023 డిసెంబర్ 31కి పెంచింది.
* దశలవారీగా ప్రాసెస్
దీనికి సంబంధించి ఆర్బీఐ ఓ సర్క్యులర్ విడుదల చేసింది. ప్రస్తుత సేఫ్ డిపాజిట్ లాకర్స్ అగ్రిమెంట్లు రెన్యూవల్ దశల వారీగా చేపట్టాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. 2023 జూన్ 30 నాటికి 50 శాతం, 2023 సెప్టెంబర్ 30కి 75 శాతం అగ్రిమెంట్లు రెన్యువల్ చేయాలని, 2023 డిసెంబర్ 31 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది.
స్టాంప్ పేపర్లు అందుబాటులో ఉంచడం ద్వారా రివైజ్డ్ అగ్రిమెంట్లు అమలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు సూచించింది. అంతేకాకుండా 2023 జనవరి 1 నాటికి అగ్రిమెంట్లు చేయనందుకు స్తంభింపజేసిన లాకర్‌ల సేవలను, తక్షణమే తిరిగి అందజేయాలని పేర్కొంది.
* గడువు పొడిగింపు
2021 ఆగస్టు 18న దీనికి సంబంధించి RBI సర్క్యులర్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం సేఫ్ డిపాజిట్ లాకర్/సేఫ్ కస్టడీ ఆర్టికల్ సదుపాయానికి సంబంధించి రివైజ్డ్ ఇన్‌స్ట్రక్షన్‌లు జారీ చేసింది. దీని ప్రకారం బ్యాంకులు ఇప్పటికే ఉన్న లాకర్ హోల్డర్‌లతో 2023 జనవరి 1 నాటికి రివైజ్డ్ అగ్రిమెంట్లను కుదుర్చుకోవాలి. అయితే సవరించిన ఒప్పందంపై ఇంకా పెద్ద సంఖ్యలో కస్టమర్లు సంతకాలు చేయలేదని ఆర్‌బీఐ దృష్టికి వచ్చింది. ఈ మార్పుల గురించి నిర్ణీత తేదీ (2023 జనవరి 1) కంటే ముందే బ్యాంకులు కస్టమర్లకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
ఇది కూడా చదవండి : బడ్జెట్‌లో మరో ఇన్‌కమ్ ట్యాక్స్ ఆమ్నెస్టీ స్కీమ్ ప్రకటించే అవకాశం.. ప్రయోజనాలు ఇవే..
* న్యూ లాకర్ అగ్రిమెంట్
కస్టమర్‌కు లాకర్‌ను కేటాయించే ముందు, బ్యాంకులు కస్టమర్‌తో సక్రమంగా స్టాంప్ చేసిన పేపర్‌పై అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. వారి హక్కులు, బాధ్యతలను తెలుసుకోవడానికి రెండు వర్గాలు సంతకం చేసిన లాకర్ అగ్రిమెంట్ కాపీని లాక్-హైరర్ (కస్టమర్)కు అందించాలి. ఒరిజినల్ లాకర్ అగ్రిమెంట్ లాకర్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌లో ఉంచుతారు. లాకర్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే, లాకర్ మూడు సంవత్సరాల అద్దె, ఛార్జీలను కవర్ చేసే టర్మ్ డిపాజిట్‌ను చేయమని బ్యాంక్‌లు కోరవచ్చని ఆర్బీఐ తెలిపింది.
లాకర్-హైరర్ ఆపరేటింగ్స్ లేదా లాకర్ అద్దెను చెల్లించని సందర్భాలు గతంలో చాలా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొంది. బ్యాంక్ మూసివేత, బ్రాంచ్ మార్చడం లేదా మరొక బ్యాంక్‌తో విలీనం వంటివి వాటిని రెండు వార్తాపత్రికల్లో పబ్లిక్ నోటీసు ద్వారా బ్యాంక్ తెలియజేయాలి. కనీసం రెండు నెలల ముందుగానే కస్టమర్‌లకు ఈ విషయం తెలియజేయాలి. ప్రకృతి వైపరీత్యాలు లేదా ఏదైనా అత్యవసర పరిస్థితుల కారణంగా ఆకస్మికంగా బ్యాంక్ షిఫ్ట్ అయితే కస్టమర్లను వీలైనంత త్వరగా సమాచారం అందజేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Personal Finance, Rbi