ATM Charges: ఏటీఎం యూజర్లకు త్వరలో షాక్ తప్పదా?

ATM Charges | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI త్వరలో ఏటీఎం యూజర్లకు షాక్ ఇవ్వొచ్చన్న వార్తలొస్తున్నాయి. ఎందుకో తెలుసుకోండి.

news18-telugu
Updated: June 23, 2020, 9:26 AM IST
ATM Charges: ఏటీఎం యూజర్లకు త్వరలో షాక్ తప్పదా?
ATM Charges: ఏటీఎం యూజర్లకు త్వరలో షాక్ తప్పదా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు ఏటీఎం కార్డు వాడుతున్నారా? ఎక్కువగా ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేస్తున్నారా? అయితే మీకు త్వరలో షాక్ తగలొచ్చు. ఇకపై ప్రతీ ట్రాన్సాక్షన్‌కు విత్‌డ్రాయల్ లిమిట్ రూ.5,000 చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI నియమించిన కమిటీ సిఫార్సు చేసినట్టు వార్తలొస్తున్నాయి. అంతేకాదు... ఎక్కువ డ్రా చేసేవాళ్లకు ఛార్జీలు వేయాలని ఆ కమిటీ సూచించింది. ఏటీఎంలల్లో జరిపే అన్ని లావాదేవీలపై ఇంటర్ ఛేంజ్ ఛార్జీలను పెంచాలని ఆ కమిటీ సూచించినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలకు ఇది వర్తించేలా చేయాలని కోరింది. ఈ కమిటీ ప్రస్తుతానికి పబ్లిక్ డొమైన్‌లో అంటే అందరికీ అందుబాటులో లేదు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం-RTI ద్వారా ఈ రిపోర్ట్‌ను సంపాదించారని, ఆ రిపోర్ట్‌లో ఈ విషయాలు ఉన్నాయని వార్తలొస్తున్నాయి.

ఏటీఎం ఇంటర్ ఛార్జ్ ఫీజులు ఎలా ఉండాలన్నదానిపై ఆర్‌బీఐ ఈ కమిటీని గత ఏడాది ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన సిఫార్సుల్ని కూడా ఆర్‌బీఐకు నివేదికలో వెల్లడించింది. అయితే ఆర్‌బీఐ ఈ సిఫార్సులకు అంగీకారం తెలిపిందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ఏటీఎం ఛార్జీలు 16 శాతం పెరిగే అవకాశం ఉంది. అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షాన్స్‌కు రూ.17, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.7 చొప్పున ఏటీఎం ఛార్జీలు వసూలు చేయాలని కమిటీ తెలిపింది. 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లోని ఏటీఎంలకు ఈ ఛార్జీలు వర్తించేలా చేయాలని కోరింది. 10 లక్షల లోపు ఉన్న ప్రాంతాల్లో ఏటీఎం ఛార్జీలను 24 శాతం పెంచాలని కోరింది.

ఇవి కూడా చదవండి:

SBI: ఎస్‌బీఐ ఏటీఎం కార్డుపై జూన్ 30 వరకు ఆ ఛార్జీల్లేవ్

Smartphones: చైనా బ్రాండ్లు వద్దా? అయితే మీ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Flipkart Sale: రూ.52,000 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.21,999 ధరకే... అదిరిపోయిన ఆఫర్
First published: June 23, 2020, 9:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading