హోమ్ /వార్తలు /బిజినెస్ /

RBI: బ్యాంక్‌రప్టీ ఫైల్‌ చేసిన ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌? ఇండియన్‌ బ్యాంకులను హెచ్చరించిన ఆర్‌బీఐ గవర్నర్‌

RBI: బ్యాంక్‌రప్టీ ఫైల్‌ చేసిన ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌? ఇండియన్‌ బ్యాంకులను హెచ్చరించిన ఆర్‌బీఐ గవర్నర్‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పేరెంట్‌ కంపెనీ SVB ఫైనాన్షియల్ గ్రూప్‌ బ్యాంక్‌రప్టీ ఫైల్ చేసింది. ఈ నేపథ్యంలో భారతీయ బ్యాంకులకు అస్సెట్‌-లయబిలిటీ వ్యత్సాసాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం హెచ్చరించారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

కరోనా సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దాదాపు అన్ని దేశాల అభివృద్ధి ప్రభావితమైంది. కరోనా అనంతరం కోలుకుంటున్న దేశాలకు రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం ప్రతికూలంగా మారింది. అనంతరం ద్రవ్యోల్బణం కోరల్లో ప్రపంచ దేశాలు చిక్కుకున్నాయి. వీటన్నింటి ప్రభావం ఇండియాపై లేదని చెప్పలేం. ఇప్పుడు కొత్తగా యూఎస్‌లోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ సంక్షోభం రూపంలో మరో దెబ్బ తగిలింది. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పీకల్లోతు ఇబ్బందుల్లో మునగడంతో యూఎస్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దీంతో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పేరెంట్‌ కంపెనీ SVB ఫైనాన్షియల్ గ్రూప్‌ బ్యాంక్‌రప్టీ ఫైల్ చేసింది. ఈ నేపథ్యంలో భారతీయ బ్యాంకులకు అస్సెట్‌-లయబిలిటీ వ్యత్సాసాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం హెచ్చరించారు. కొచ్చిలో జరిగిన వార్షిక KP హోర్మిస్ (ఫెడరల్ బ్యాంక్ వ్యవస్థాపకుడు) స్మారక ఉపన్యాసంలో ఆయన ప్రసంగించారు.

2008 సంక్షోభాన్ని గుర్తు చేస్తున్న పరిస్థితులు

SVB ఫైనాన్షియల్‌ ప్రధానంగా స్టార్టప్‌లకు ఫైనాన్సింగ్ చేస్తుంది. ఇది తన అస్సెట్స్‌తో యూఎస్‌లో 16వ అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించింది. 2022 చివరి నాటికి, బ్యాంక్‌ అస్సెట్స్‌ $209 బిలియన్లు(దాదాపు రూ.17,249,982,200), డిపాజిట్లలో సుమారు $175.4 బిలియన్లు(దాదాపు రూ.14,445,791,675) ఉన్నాయి. ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకున్న తర్వాత SVB ఫైనాన్షియల్ గ్రూప్‌కు ఇక సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌తో సంబంధం లేదు. SVB సంక్షోభం అనేక విధాలుగా 2008 ఆర్థిక సంక్షోభాన్ని గుర్తు చేస్తోంది.

ఆర్‌బీఐ గవర్నర్‌ హెచ్చరికలు

రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ యూఎస్‌లో కొనసాగుతున్న బ్యాంకింగ్ గందరగోళంపై మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం స్థిరమైన వృద్ధిపై దృష్టి సారించే బలమైన నిబంధనల ప్రాముఖ్యతను తెలియజేస్తుందని అన్నారు. అస్సెట్‌ వైపు లేదా లయబిలిటీ వైపు అధికంగా మార్పులు రాకూడదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏ బ్యాంక్‌ పేర్లను ఉదహరించకుండా శక్తికాంత్‌ దాస్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ బ్యాంకులో అస్సెట్స్‌ బిజినెస్‌ కంటే మించి నిర్వహించలేని స్థాయిలో డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు.

ఇండియన్‌ స్టార్టప్‌లపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

అనేక ఇండియన్‌ స్టార్టప్‌లు సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌లో బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులను డిపాజిట్‌ చేసి ఉన్నాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ మూసివేత కారణంగా ప్రభావితమయ్యే స్టార్టప్‌ల సూచనలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పంపినట్లు పేర్కొన్నారు. ఆర్థిక మంత్రికి ప్రతిపాదించిన సూచనలపై చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఇండియన్‌ బ్యాంకులు సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌లో నిధులు కలిగి ఉన్న స్టార్టప్‌లకు డిపాజిట్-బ్యాక్డ్ క్రెడిట్ లైన్‌ను అందించవచ్చని, ఎస్‌వీబీలోని ఫండ్స్‌ని తాకట్టుగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

First published:

Tags: Rbi, Reserve Bank of India

ఉత్తమ కథలు