Home /News /business /

బ్యాంకుల్లో Current Account ఓపెన్ చేయాలనుకుంటున్నారా..? గతంలో మాదిరి కాదు.. కొత్త రూల్స్ తెలుసుకోండి

బ్యాంకుల్లో Current Account ఓపెన్ చేయాలనుకుంటున్నారా..? గతంలో మాదిరి కాదు.. కొత్త రూల్స్ తెలుసుకోండి

ప్రతీకాాత్మక చిత్రం

ప్రతీకాాత్మక చిత్రం

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఇతర వాటాదారుల నుంచి వచ్చిన విన్నపాలను పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ మార్గదర్శకాలను సవరించింది. నగదు జమ, ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో రుణాలు పొందే వారి కోసం బ్యాంకులు కరెంట్ అకౌంట్‌లు తెరవచ్చని ఆర్బీఐ సూచించింది.

ఇంకా చదవండి ...
బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. రూ.5 కోట్ల కంటే తక్కువ బ్యాంక్ ఎక్స్పోజర్ (exposure) కలిగిన వారి కోసం అక్టోబరు 29న ఆర్బీఐ మార్గదర్శకాలు సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రుణ గ్రహీతలు ఎలాంటి పరిమితులు లేకుండా కరెంట్ అకౌంట్‌ తెరవచ్చు. క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని ఆర్బీఐ (RBI) తాజా నోటిఫికేషన్లో తెలిపింది. నెల రోజుల్లో ఈ మార్గదర్శకాలు అమలు చేయాలని కూడా బ్యాంకులను(Banks) కోరింది.

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఇతర వాటాదారుల నుంచి వచ్చిన విన్నపాలను పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ మార్గదర్శకాలను సవరించింది. నగదు జమ, ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో రుణాలు పొందే వారి కోసం బ్యాంకులు కరెంట్ అకౌంట్‌లు(Current Account) తెరవచ్చని ఆర్బీఐ సూచించింది. రూ.5 కోట్ల కంటే తక్కువ రుణగ్రహీతలకు ఎలాంటి పరిమితులు లేవు. ఒకవేళ రుణగ్రహీతలు ఎక్కడైనా రూ.5 కోట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటే బ్యాంకులకు తెలియజేయాలని బ్యాంకింగ్ రెగ్యులేటర్ నోటిఫికేషన్లో చేర్చింది. అయితే రుణగ్రహీతలు ఏ బ్యాంకులో కరెంట్ అకౌంట్‌ నిర్వహించాలనుకుంటున్నారో ఆ బ్యాంకులో ఎక్స్పోజర్ కనీసం పది శాతం ఉండాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది.

నూతన మార్గదర్శకాల ప్రకారం ఒక్కరే అనేక బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్‌లు తెరవడాన్ని నియంత్రిస్తారు. దీంతో ఆర్థిక క్రమశిక్షణ మెరుగవుతుంది. ఫలితంగా ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నిధుల మళ్లింపునకు అడ్డుకట్ట పడుతుందని, దీని ద్వారా బ్యాంకులకు, వ్యాపారుల కార్యకలాపాల నిర్వహణలో కొంత స్వేచ్ఛ లభిస్తుందని ఆర్బీఐ తెలిపింది. రుణ గ్రహీతలకు రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటే ఏదైనా ఒక బ్యాంకులో క్యాష్ క్రెడిట్, ఓడీ సౌకర్యం పొందవచ్చని ఆర్బీఐ తెలిపింది. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించింది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇతర లెండింగ్ బ్యాంకులు కేవలం కలెక్షన్ ఖాతాలు మాత్రమే తెరవాల్సి ఉంటుంది. జమ చేసిన నిధులు రెండు పని దినాల్లో వారి ఖాతాలో జమవుతాయి. ఇతర లెండింగ్ బ్యాంకుల్లో షరతులకు లోబడే ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. 10 శాతం కన్నా ఎక్కువ బ్యాంకు ఎక్స్పోజర్ ఉంటేనే ఆ బ్యాంకులో కరెంట్ అకౌంట్‌ తెరవచ్చని ఆర్బీఐ మార్గదర్శకాల్లో వివరించింది. అయితే రుణాలు ఇవ్వని బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్‌లు తెరిచేందుకు రిజర్వు బ్యాంకు అనుమతించలేదు. ఎలాంటి పరిమితులు లేకుండా అనేక ఖాతాలు నిర్వహించుకోవచ్చని ఇంటర్ బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంకు, నాబార్డు బ్యాంకు, సిడ్బి బ్యాంకులకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దర్యాప్తు సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

KCR-KTR: కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. వాటిపై నిర్ణయం కేటీఆర్‌దేనా ?

YS Sharmila: ఊహించని విధంగా వైఎస్ షర్మిలను ఇరికించిన వైసీపీ

కరెంట్ అకౌంట్‌ల ప్రారంభానికి గత ఏడాది ఆగస్టులో ఆర్బీఐ నిబంధనలు విడుదల చేసింది. ఎవరైతే బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్‌ తెరుస్తారో వారి మొత్తం ఆదాయంలో కనీసం పది శాతం ఆ బ్యాంకు ఖాతా షేర్ ఉండాలి.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Bank account

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు