Home /News /business /

RBI CANCELS REGISTRATION OF 5 NBFCS DUE TO IRREGULAR LENDING PRACTICES KNOW FULL DETAILS HERE GH VB

Reserve Bank Of India: రుణాలిచ్చి ప్రజలను వేధిస్తున్న కంపెనీలపై ఆర్‌బీఐ కొరడా.. 5 NBFCల రిజిస్ట్రేషన్‌ రద్దు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా ఆర్‌బీఐ 5 నాన్-బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలపై (NBFCs) కొరడా ఝుళిపించింది. ఈ కంపెనీలు తమ డిజిటల్ లెండింగ్ కార్యకలాపాలలో అవుట్‌సోర్సింగ్, ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్‌కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఆర్‌బీఐ గుర్తించింది.

ఇంకా చదవండి ...
భారతదేశంలో అన్ని ఆర్థిక సంస్థల కార్యకలాపాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) పర్యవేక్షిస్తుంది. ఏదైనా ఫైనాన్షియల్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటుంది. అయితే తాజాగా ఆర్‌బీఐ 5 నాన్-బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలపై (NBFCs) కొరడా ఝుళిపించింది. ఈ కంపెనీలు తమ డిజిటల్ లెండింగ్ కార్యకలాపాలలో అవుట్‌సోర్సింగ్, ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్‌కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఆర్‌బీఐ గుర్తించింది. ఈ లెండింగ్ పద్ధతులు ప్రజా ప్రయోజనాలకు హానికరమని పేర్కొంది. అలానే ఈ ఐదు ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (Certificate of Registration-CoR)ని రద్దు చేసింది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ బుధవారం తెలిపింది.

Govt Scheme: నెలకు ఒక్క రూపాయితో రూ.2,00,000 బెనిఫిట్స్... ఈ స్కీమ్ ఉందని మీకు తెలుసా?

యూఎంబీ సెక్యూరిటీస్ లిమిటెడ్, అనశ్రీ ఫిన్‌వెస్ట్, చద్దా ఫైనాన్స్, అలెక్సీ ట్రాకాన్, జురియా ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఐదు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFCs) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను ఆర్‌బీఐ క్యాన్సిల్ చేసింది. "ఆర్‌బీఐ చట్టం, 1934లోని సెక్షన్ 45-Iలోని క్లాజ్ (ఎ)లో నిర్వచించిన విధంగా, ఈ 5 కంపెనీలు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ (ఎన్‌బిఎఫ్‌ఐ) వ్యాపార లావాదేవీలను నిర్వహించలేవు” అని ఆర్‌బీఐ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ కంపెనీలు అధిక వడ్డీ వసూలుకు సంబంధించి ఉన్న నిబంధనలను కూడా పాటించడం లేదని.. లోన్ రికవరీ ప్రయోజనాల కోసం కస్టమర్లను అనవసరంగా వేధింపులకు గురిచేస్తున్నాయని పేర్కొంది.

ఐదు కంపెనీలు రుణాలు మంజూరు చేయలేవు
ఫాస్టాప్ టెక్నాలజీస్ అందించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ సేవలను యూఎంబీ సెక్యూరిటీస్ ఉపయోగిస్తోంది. అనశ్రీ ఫిన్‌వెస్ట్ అనేక యాప్‌ల ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. అయితే బెంగళూరుకు చెందిన ఈ రెండు సంస్థలు ఇకపై రుణం ఇవ్వలేవు. వైఫై క్యాష్ ద్వారా రుణాలు ఆఫర్ చేసిన చద్దా ఫైనాన్స్, న్యూఢిల్లీ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ కూడా ఇకపై రుణాలను మంజూరు చేయడానికి అనుమతిని కోల్పోయింది. మిగిలిన రెండు కంపెనీలు కూడా ఇకపై రుణాలను అందించడం కుదరదు.

రుణాలను మంజూరు చేసే సంస్థలపై నిబంధనలు అమలు చేయకపోతే అవి ప్రజలను పీడించే ప్రమాదం ఉంది. పైన పేర్కొన్న కంపెనీల్లాగా అధిక వడ్డీలు ఇవ్వాలని, లేదా లోన్ తిరిగి చెల్లించాలని తీవ్ర ఒత్తిడి తేవచ్చు. కొన్ని చట్టవిరుద్ధమైన రికవరీ వ్యూహాలలో భాగంగా ఈ కంపెనీలు రుణగ్రహీత మొబైల్ లేదా కంప్యూటర్‌కు యాక్సెస్ పొంది వారి ఫొటోలను కాజేస్తున్నాయి. ఈ ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ కూడా చేస్తున్నాయి.

PAN Card Rule:పాన్ కార్డ్ ఉన్నవారికి నేటి నుంచి కొత్త రూల్... వివరాలు ఇవ్వాల్సిందే

ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యలను గుర్తించిన ఆర్‌బీఐ అవి మళ్ళీ ఎవరికీ రుణాలు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ యాప్‌లను ఉపయోగించి అడ్వాన్స్‌లు అందిస్తున్న చాలా కంపెనీలు ఆర్‌బీఐలో నమోదు కాలేదని ఓ దర్యాప్తులో తేలింది. గూగుల్ ఇటీవల తన యాప్ స్టోర్‌లలో ఆర్‌బీఐ-నమోదిత లోన్ యాప్‌లను మాత్రమే ఉంచాలని నిర్ణయించింది. నవంబర్‌లో, డిజిటల్ రుణాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టం కోసం ఆర్‌బీఐ ప్యానెల్ పిలుపునిచ్చింది.
Published by:Veera Babu
First published:

Tags: Financial banks, Nbfc, Rbi, Reserve Bank of India

తదుపరి వార్తలు